Koti Deepotsavam 2026 Day 15: నేడు కోటి దీపోత్సవంలో విశేష పూజలు.. శ్రీహరికి మహాభిషేకం, శ్రీనివాస కల్యాణం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Koti Deepotsavam 2026 Day 15: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా కార్తీక మాసం సందర్భంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం 2026 భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది. ఈ ఉత్సవాల్లో భాగంగా 15వ రోజు అయిన నవంబర్ 28, శనివారం (కార్తీక బహుళ పంచమి) పలు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ప్రముఖ స్వామీజీల అనుగ్రహ భాషణం, ప్రవచనామృతం, శ్రీహరికి మహాభిషేకం, శ్రీనివాస కల్యాణ మహోత్సవం వంటి విశేష కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించనున్నాయి.
నేటి ప్రత్యేక కార్యక్రమాల షెడ్యూల్
Also Read
- Koti Deepotsavam Day 14 LIVE: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనృసింహ స్వామి కల్యాణోత్సవం.. ఒకే వేదికపై విశేష కార్యక్రమాలు
- Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
- Koti Deepotsavam 2026: 14వ రోజు విశేష కార్యక్రమాలు.. నేడు యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహ స్వామి కల్యాణం!
- Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి నేడు తిరుగులేదు!
1. అనుగ్రహ భాషణం: శ్రీ అవధూతగిరి మహారాజ్ స్వామీజీ (బాలాపూర్), శ్రీ సిద్ధేశ్వరగిరి మహారాజ్ స్వామీజీ (మహామండలేశ్వర్, బాలాపూర్)
2. ప్రవచనామృతం: అష్టావధాని డా. ధూళిపాళ్ల మహాదేవమణి ఆధ్యాత్మిక ప్రవచనం చేయనున్నారు.
3. వేదికపై పూజ: శ్రీహరికి మహాభిషేకం, అష్టదళ పాదపద్మారాధన నిర్వహించనున్నారు.
4. భక్తులచే పూజ: శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలకు కోటిపుష్పార్చన కార్యక్రమం జరగనుంది.
5. కల్యాణం: భక్తుల సమక్షంలో శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు.
6. వాహన సేవ: చివరిగా స్వామివారికి గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు.
కార్తీక మాసంలో జరిగే ఈ ప్రత్యేక కార్యక్రమాలు భక్తులకు భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచనున్నాయి. ముఖ్యంగా శ్రీనివాస కల్యాణ మహోత్సవం, గరుడ వాహన సేవ నేటి కోటి దీపోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రతి ఏడాది లాగే పూజా సామగ్రిని కూడా ఉచితంగా అందజేస్తున్న రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్.. ఈ కోటి దీప యజ్ఞంలో పాల్గొనాలని సాదరంగా ఆహ్వానం పలుకుతుంది..

తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 15: నేడు కోటి దీపోత్సవంలో విశేష పూజలు.. శ్రీహరికి మహాభిషేకం, శ్రీనివాస కల్యాణం!
-
Bisleri in Trouble Again: మళ్లీ చిక్కుల్లో బిస్లెరీ.. నీటి నమూనాల్లో కోలిఫామ్ బ్యాక్టీరియా.. FSSAI కీలక చర్య
-
Moksagna: మోక్షజ్ఞ మూవీలో నటించడానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్?
-
Tollywood: మాస్ హీరోలుగా మారడం కాదు.. ఆ హీరోలను చూసి నేర్చుకోండి..!
-
Idupu Kayitham Song: ‘ఇడుపు కాయితం’ నుంచి మరో క్రేజీ సాంగ్..!
ట్రెండింగ్
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!
-
Rishabh Pant: WTC చరిత్రలో ‘రిషబ్ పంత్’ సరికొత్త చరిత్ర..!