Priyank Kharge: కాంగ్రెస్ నేత, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఢిల్లీ ఎర్ర కోట కార్ బాంబ్ దాడిపై స్పందించారు. ఈ దాడికి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను నిందించారు. ఆయన ‘‘స్వతంత్ర భారతదేశంలో అత్యంత అసమర్థ హోం మంత్రి’’ అని, వెంటనే రాజీనామా చేయాలని మంగళవారం డిమాండ్ చేశారు.
Maharashtra: మహారాష్ట్రలో లోకల్ బాడీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో, ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమిలో విభేదాలు కనిపిస్తున్నాయి. తాజాగా, మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్ మంగళవారం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ స్వతంత్రంగా పోటీ చేస్తుందని ప్రకటించారు.
Pakistan: పాకిస్తాన్లో బయటకే ప్రజాస్వామ్యం కనిపిస్తుంది. మొత్తం కంట్రోల్ అంతా ఆ దేశ సైన్యం చేతిలోనే ఉంటుంది. సైన్యం ఏం చెప్పినా, ప్రభుత్వం తలాడించాల్సిందే. లేదంటే సైనిక తిరుగుబాట్లు తప్పవు. పాకిస్తాన్ ఎన్నో సార్లు సైనిక తిరుగుబాట్లను చూసింది. ఇప్పుడు, నాలుగో సారి ఆ దేశంలో ‘‘ఆసిమ్ మునీర్’’ రూపంలో తిరుగుబాటు జరుగున్నట్లు కనిపిస్తోంది.
Delhi Car Blast: ఢిల్లీలో ఉగ్రవాద దాడి జరిగింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట వద్ద కారు బాంబ్ దాడి జరగడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ‘‘ఆపరేషన్ సిందూర్’’ మళ్లీ మొదలైనట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతుున్నాయి. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఉగ్రవాదులకు సంబంధించిన కీలక వివరాలు బయటకు వచ్చాయి.
Delhi Car Blast: ఢిల్లీ ఎర్రకొట వద్ద కారు బ్లాస్ట్ దేశాన్ని భయాందోళనకు గురి చేసింది. సోమవారం సాయంత్రం, కారులో అమోనియం నైట్రేట్ నింపుకుని దాడికి పాల్పడ్డాడు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని డాక్టర్ ఉమర్ మొహమ్మద్‌గా గుర్తించారు. ఈ దాడిలో ఇప్పటి వరకు 12 మంది మరణించారు.
Delhi Red Fort Blast: ఢిల్లీ ఎర్రకొట కార్ బాంబ్ బ్లాస్ట్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హ్యాందాయ్ i20లో అమ్మోనియం నైట్రేట్, ఫ్యూయల్ ఆయిల్ కలిపి పేలుడుకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో 12 మంది మరణించారు. సంఘటన జరిగిన రోజు 9 మంది మరణించగా, చికిత్స పొందుతూ ఈ రోజు మరో ముగ్గురు మరణించారు. అయితే, ఈ ఘటనకు పుల్వామా దాడికి కారణమైన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ మధ్య సంబంధాలు బయటపడినట్లు పోలీసు వర్గాలు మంగళవారం తెలిపాయి.
JNUSU: జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (JNUSU) ఎన్నికల్లో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA), స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI), మరియు డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫ్రంట్ (DSF) ల సంకీర్ణమైన లెఫ్ట్ యూనిటీ అలయన్స్ అఖండ విజయం సాధించింది. నాలుగు సెంట్రల్ ప్యానెల్ పదవుల్ని కైవసం చేసుకుంది. క్యాంపస్‌లో పూర్తి ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది.
Bihar Election 2025: బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడతలో రికార్డ్ స్థాయి పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు 64.46 శాతం నమోదైనట్లు, మరికొన్ని స్థానాల్లో ఇంకా ఓటింగ్ జరుగుతున్నట్లు బీహార్ ముఖ్య ఎన్నికల అధికారి వినోద్ గుంజ్యాల్ చెప్పారు. 73 ఏళ్ల బీహార్ ఎన్నికల చరిత్రలో ఇదే హైయెస్ట్. 2020లో జరిగిన ఎన్నికల్లో మొదటిదశలో నమోదైన దాని కన్నా ఎక్కువ నమోదైంది.
H-1B Visa: డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇమ్మిగ్రేషన్, వలసలపై కఠిన వైఖరి అవలంభిస్తున్నాడు. H-1B వీసా హోల్డర్లపై అనేక ఆంక్షలు విధిస్తున్నాడు. ముఖ్యంగా, H-1B వీసా వీసాలపై ఆంక్షలు భారతీయుల అవకాశాలను దెబ్బతీస్తున్నాయి. ఎందుకంటే ఈ వీసాలపై 70 శాతం భారతీయులు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే, ఇప్పుడు అమెరికా వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్న క్రమంలో, కెనడా ఆహ్వానం పలుకుతోంది.
Amit Shah: భారత సైన్యంపై ‘‘కుల’’ వ్యాఖ్యలు చేసినందకు రాహుల్ గాంధీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. గురువారం బీహార్‌లోని మధుబని, పశ్చిమ చంపారన్, మోతిహరీ జిల్లాల్లో ఎన్నికల ర్యాలీ నిర్వహించిన ఆయన, రాహుల్ గాంధీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.