Anil Ravipudi: మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో జరిగిన సక్సెస్ మీట్‌లో అనిల్ రావిపూడి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Bheems Ceciroleo: నాన్న.. నన్ను నువ్వు దేనికి పనికి రావు అన్నావు కదా.. ఇప్పుడు చూడు ఎక్కడనున్నానో..!
కళ్యాణ్ రామ్ నుంచి మెగాస్టార్ వరకు అందరు హీరోలకు వారి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్లు ఇచ్చిన అనిల్ రావిపూడిని నెటిజన్లు ప్రస్తుతం ‘రీజనల్ రాజమౌళి’ అని పిలుస్తున్నారు. దీనిపై అనిల్ స్పందిస్తూ.. రాజమౌళితో నన్ను పోల్చడం అంటే నా స్థాయి పెంచుకోవడమే.. కానీ, అది ఆయన స్థాయిని తగ్గించడమే అవుతుందన్నారు. ఆయన తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన లెజెండరీ డైరెక్టర్. నేను నాకు తెలిసిన టైమింగ్‌తో ఎంటర్టైనర్స్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఆయనతో పోలిక వద్దని కోరారు.
సినిమా రిలీజ్ అయ్యాక తనకు వచ్చిన అభినందనల గురించి అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. నిన్న రాత్రి రాజమౌళి మెసేజ్ చేశారని.. చాలా బాగా తీశావని అభినందించారన్నారు. అది నాకు పెద్ద అవార్డు అంటూ కొనియాడారు. అలాగే నా లవ్లీ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫోన్ చేసి సినిమా గురించి మాట్లాడారని.. అందుకు థాంక్యూ మహేష్ అని అన్నారు. ఇంకా నా సినిమా రిలీజ్ రోజున మా ఇంట్లో వాళ్ళకంటే ముందు వినాయక్ ఫోన్ చేస్తారని.. ఈసారి కూడా ఆయన అప్రిసియేషన్ మర్చిపోలేనని అన్నారు. ముఖ్యంగా సీనియర్ దర్శకులు రాఘవేంద్రరావు కూడా మెసేజ్ చేసి విష్ చేసినట్లు అనిల్ తెలిపారు.
Sudha Kongara : ఫేక్ ఐడీలు, నెగటివ్ రివ్యూలు.. విజయ్ ఫ్యాన్స్‌పై సుధా కొంగర ఫైర్!
ఈ సినిమా రేంజ్ ఏంటో హీరో నితిన్ ముందే గెస్ చేశారని అనిల్ అన్నారు. నితిన్ ఒక హీరోగానే కాకుండా డిస్ట్రిబ్యూటర్ కొడుకుగా ఆలోచించి.. ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్స్ వసూలు చేస్తుందో ముందే చెప్తాడు అన్నారు. అలాగే రామ్ చరణ్, నితిన్, మంచు మనోజ్, సుష్మిత కొణిదెల వంటి ప్రముఖులు సినిమాను చూసి వ్యక్తిగతంగా విష్ చేశారని ఆయన అన్నారు. ప్రీమియర్ షోలలో మాస్ ఆడియన్స్‌తో కలిసి సినిమా చూసినప్పుడు వచ్చిన రెస్పాన్స్ చూసి గూస్‌బమ్స్ వచ్చాయని, ఆ ఎనర్జీని తాను ఎప్పటికీ మర్చిపోలేనని అనిల్ రావిపూడి ఈ సందర్భంగా ఎమోషనల్ అయ్యారు.