Mehbooba Mufti: ఢిల్లీ ఎర్రకోట కార్ బాంబ్ బ్లాస్ట్ ఘటనలో 9 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఉగ్రదాడికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ జైషే మహ్మద్‌తో సంబంధాలు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితులు డాక్టర్లుగా ఉంటూనే ఉగ్రవాదానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. అయితే, ఈ ఘటనపై జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మహబూబా ముఫ్తీ స్పందించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న డాక్టర్ల తల్లిదండ్రుల్ని విచారణ పేరుతో ‘‘వేధించవద్దు’’ అని అన్నారు. […]
Benjamin Netanyahu: ఢిల్లీ కారు బాంబ్ బ్లాస్ట్ దేశాన్ని మరోసారి కలవరపెట్టింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట వద్ద జరిగిన ఈ ఘటనపై ఇజ్రాయిల్ భారత్‌కు మద్దతు తెలిపింది. ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ ఈ ఘటనపై స్పందించారు. బాధిత కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేశారు.
Delhi Car Blast: ఢిల్లీలో కారు బాంబు దాడికి పాల్పడిన ఉగ్రవాది ఉమర్ నబీ మొహమ్మద్‌కు మరో కారు కూడా ఉన్నట్లు విచారణలో తేలింది. సోమవారం ఎర్రకోట వద్ద జరిగిన దాడికి హ్యుందాయ్ ఐ20 కారను ఉపయోగించాడు. కారులో పేలుడు పదార్థాలు నింపి, ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో 9 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఇదిలా ఉంటే, అతడికి ఉన్న రెండో కారు కోసం ఢిల్లీ, హర్యానా, యూపీ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
Delhi Car Blast: ఢిల్లీ ఎర్రకోట కారు బ్లాస్ట్ కేసులో విచారణ ముమ్మరమైంది. ఈ కేసును ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చేతిలోకి తీసుకుంది. పలువురు డాక్టర్ ఉగ్రవాదులతో పాటు మరికొందరిని అధికారులు అరెస్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ బాంబులో ఏ పదార్థం వాడారో తెలుసుకునేందుకు నమూనాలను ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ బృందం పరీక్షిస్తోంది. ముందుగా, ఈ పేలుడులో అమ్మోనియం నైట్రేట్ మాత్రమే వాడినట్లు ప్రాథమికంగా అనుకున్నారు. అయితే, ఇదే కాకుండా హైగ్రేడ్ పేలుడు పదార్థాలు కూడా వాడినట్లు తెలుస్తోంది.
Masood Azhar: సోమవారం ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబ్ దాడితో దేశం ఒక్కసారిగా భయాందోళనకు గురైంది. ఈ దాడి వెనక పాకిస్తాన్ ఉగ్రసంస్థ జైషే మహ్మద్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోసారి కరడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజార్ పేరు వినిపిస్తోంది. ఐక్యరాజ్యసమితి ఇతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది.
Delhi Car Blast: ఢిల్లీ ఎర్రకోట కార్ బ్లాస్ట్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తీగ లాగే కొద్దీ డొంక కదులుతోంది. 26/11 ముంబై దాడుల తరహాలో ఢిల్లీ వ్యాప్తంగా పలు ప్రధాన ప్రాంతాల్లో దాడుల చేయాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఎర్రకోట, ఇండియా గేట్, కాన్స్టిట్యూషన్ క్లబ్, గౌరీ శంకర్ ఆలయం వంటి ప్రధాన ప్రాంతాలను లక్ష్యంగా ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్ లో దాడులు చేయాలని కుట్ర చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
BJP: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ రోజుతో ముగిశాయి. అన్ని ఎగ్జిట్స్ పోల్స్ కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమినే గెలుస్తుందని చెప్పాయి. మరోసారి, బీజేపీ+జేడీయూలు కలిసి అధికారాన్ని ఏర్పాటు చేస్తాయని వెల్లడించాయి. ఆర్జేడీ+కాంగ్రెస్‌ల మహాఘటబంధన్ కూటమి మరోసారి ప్రతిపక్షానికి పరిమితం అవుతాయని అంచనా వేశాయి.
Vladimir Putin: ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం గురించి ఊహాగానాలు, అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఆయనకు ప్రాణాంతక క్యాన్సర్ ఉందని పలు నివేదికలు కూడా వెలువడ్డాయి. తాజాగా, మరోసారి పుతిన్ ఆరోగ్యంపై ఊహాగానాలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఆయన కుడి చేతి వాపుగా ఉందని ఈ వీడియో చూపిస్తోందని న్యూస్ వీక్ నివేదించింది. Read Also: True 8K వీడియో […]
Pakistan: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ కోర్టు వెలుపల ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 12 మంది మరణించారు. అంతకుముందు, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు సమీపంలో ఉన్న వానాలోని క్యాడెట్ కాలేజీపై సోమవారం దాడి జరిగింది. ఈ రెండు దాడుల్లో భారత్ పాత్ర ఉందని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరోపించారు. ఈ రెండు దాడులు ‘‘భారత స్పాన్సర్ ఉగ్రవాద ప్రాక్సీ దాడులు’’ అని నిందించారు. పాకిస్తాన్‌ను అస్థిరపరిచేందుకు భారత్ ఉగ్రవాదాన్ని నిర్వహిస్తుందని ఫరీఫ్ మంగళవారం అన్నారు. భారతదేశ […]
Bihar Exit Polls: దేశంలో రాజకీయంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కీలకంగా మారాయి. అందరి చూపు కూడా బీహార్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారే దానిపై నెలకొంది. బీహార్ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు కావడం కూడా ఈ ఎన్నికల ఫలితాలపై అంచనాలు పెంచింది. బీహార్‌లోని మొత్తం 243 నియోజకవర్గాలకు నవంబర్ 6, నవంబర్ 11 తేదీల్లో రెండు దశలుగా ఓటింగ్ నిర్వహించారు. తొలి విడతలో 65.08 శాతం నమోదు కాగా, రెండో విడతలో సాయంత్రం 5 గంటల వరకు…