Divorce Case: గుజరాత్‌కు చెందిన ఒక వ్యక్తి విడాకుల కోసం వింత కారణాన్ని లేవనెత్తారు. "తన భార్యకు వీధి కుక్కలు అంటే చాలా ప్రేమ అని, ఇది తనపై క్రూరత్వాన్ని చూపిస్తోందని" అహ్మదాబాద్‌కు చెందిన 41 ఏళ్ల వ్యక్తి గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. తన విడాకుల అభ్యర్థనను తోసిపుచ్చిన ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఆయన హైకోర్టుకు వెళ్లారు. భార్యకు కుక్కలపై ఉన్న ప్రేమ తమ వైవాహిక బంధాన్ని విచ్ఛిన్నం చేసిందని ఆరోపించారు.
Congress Minister: కర్ణాటక మైనారిటీ వ్యవహారాల మంత్రి బీజెడ్ జమీర్ అహ్మద్ ఢిల్లీ కారు బ్లాస్ట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పేలుడుపై అనుమానాలు వ్యక్తం చేశారు. బీహార్ ఎన్నికలకు ఒక రోజు ముందు పేలుడు జరిగిందని, పేలుడు సమయాన్ని ప్రశ్నించారు. బెంగళూర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ పేలుడు ఘటనపై కేంద్రం హోం మంత్రి అమిత్ షా సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Al Falah University: ఢిల్లీ కారు బాంబ్ బ్లాస్ట్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే బాబ్రీ మసీదు కూల్చివేసిన డిసెంబర్ 6న 32 కార్లతో భారీ దాడులు చేయాలని ఉగ్ర డాక్టర్లు పథకం రచించినట్లు విచారణలో వెల్లడైంది. మరోవైపు, ఈ ఉగ్రవాదులతో సంబంధం ఉన్న హర్యానా ఫరీదాబాద్ లో ఉన్న అల్ ఫలాహ్ యూనివర్సిటీపై ఇప్పుడు భద్రతా ఏజెన్సీల చూపు పడింది. ఈ యూనివర్సిటీ నిధులపై దర్యాప్తు కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) రంగంలోకి దిగింది. ఈ యూనివర్సిటీ నుంచే ఢిల్లీ…
Delhi Car Blast: ఢిల్లీ ఎర్రకోట వద్ద కారు బాంబ్ బ్లాస్ట్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తు్న్నాయి. ఇప్పటికే ఈ ఘటన ఉగ్రవాద దాడిగా కేంద్రం ప్రకటించింది. నిందితులందరికి జైషే మహ్మద్‌తో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. డాక్టర్లుగా ఉంటూ ఉగ్రవాదులుగా మారిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కారు బాంబుతో ఆత్మాహుతి చేసుకున్న వ్యక్తిని కాశ్మీర్‌కు చెందిన ఉమర్ నబీగా గుర్తించారు. నిందితుందరికి ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ యూనివర్సిటీతో సంబంధాలు ఉన్నాయి.
Pakistan: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్‌లో చావు తప్పించుకున్నప్పటికీ, ఆ దేశానికి సిగ్గు రావడం లేదు. తాజాగా, ఆయన మాట్లాడుతూ.. తూర్పు సరిహద్దులో భారత్‌తో, పశ్చిమ సరిహద్దులో ఆఫ్ఘానిస్తాన్‌తో టూ-ఫ్రంట్ వార్‌కు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని చెప్పారు. పాకిస్తాన్ రెండు దేశాలతో యుద్ధానికి ‘‘పూర్తిగా సిద్ధంగా ఉంది’’ అని అన్నారు. ఢిల్లీ ఉగ్రవాద దాడి సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Pakistan: భారతదేశంలో ఎప్పుడు ఉగ్రవాద దాడి జరిగిన, దాని మూలాలు పాకిస్తాన్‌లోనే ఉంటాయి. అయితే, ఈ నిజాన్ని ఎప్పుడు కూడా పాకిస్తాన్ ఒప్పుకోదు. తమ ప్రమేయం లేదని చెబుతుంటుంది. ఈసారి కూడా అదే ప్రయత్నం చేసింది. ఢిల్లీ కారు బాంబ్ బ్లాస్‌ను తక్కువ చేసేలా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కామెంట్స్ చేశారు. ఢిల్లీ ఉగ్రదాడి గురించి స్పందిస్తూ.. ‘‘గ్యాస్ సిలిండర్ పేలుడు’’గా ఆసిఫ్ అభివర్ణించారు. భారత్ రాజకీయ ప్రయోజనాల కోసం దీనిని వాడుకుంటోందని ఆరోపించారు.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా వైట్ హౌజ్‌లో భేటీ అయ్యారు. ఒకప్పుడు ఉగ్రవాదిగా ముద్ర పడిన అల్ షరా ఇప్పుడు సిరియా దేశాధినేత. ఆయనపై అమెరికా 10 మిలియన్ డాలర్ల బహుమతి కూడా ప్రకటించింది.
Delhi Car Blast: ఢిల్లీ ఎర్రకోట కార్ బాంబ్ పేలుడు ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డాక్టర్ నుంచి ఉగ్రవాదిగా మారిన ఉమర్ నబీ దుష్ట పథకం పన్నినట్లు తేలింది. బాబ్రీ మసీదును కూల్చేసిన డిసెంబర్ 6న దాడులు చేయాలని ప్లాన్ చేసుకున్నాడని అధికారులు తెలిపారు.
Bangaldesh: గతేడాది బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఆందోళనల తర్వాత అప్పటి ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి భారత్‌కు పారిపోయి వచ్చింది. అయితే, ఈ హింసాత్మక ఉద్యమంలో మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు హసీనాపై బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) నేరాలను మోపింది. ఈ కేసులో నవంబర్ 13న తీర్పును వెలువరించనుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో హై అలర్ట్ నెలకొంది. బంగ్లాదేశ్ వ్యాప్తంగా తీర్పుకు ముందే ఉద్రిక్తతలు పెరిగాయి. దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు, కీలక ప్రదేశాల్లో సైన్యం, పోలీసులు […]
Bihar exit poll: బీహార్ ఎన్నికలు ముగిశాయి. మరో రెండు రోజుల్లో ఫలితాలు తెలుస్తాయి. అయితే, ఇప్పటికే అనేక ఎగ్జిట్ పోల్స్ బీహార్‌లో మరోసారి బీజేపీ+జేడీయూల ఎన్డీయే అధికారంలోకి వస్తుందని చెప్పాయి. తాజాగా, యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ కూడా ఇదే విషయాన్ని చెప్పింది.