Venu Goapl Reddy
Author- NTV Telugu-
MUDA scam: ముడా స్కామ్‌లో సీఎం సిద్ధరామయ్య పేరు.. షాకిచ్చిన ఈడీ..
MUDA scam: కర్ణాటకలో సంచలనంగా మారిన మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్యతో పాటు ఆయన భార్యకు సంబంధం ఉందని ఈడీ పేర్కొంది. సిద్ధరామయ్య, ఆయన భార్య, ఆయన కుటుంబ సభ్యులకు ఈ స్కామ్‌లో సంబంధం ఉందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వెల్లడించింది. ప్రభుత్వం సేకరించిన భూమిని అక్రమంగా డీ-నోటిఫై చేయడం, మోసపూరిత భూమి మార్పిడి , సుమారు రూ.56 కోట్ల విలువైన సైట్ -
Union Budget 2025: భారత బడ్జెట్ చరిత్రలో “అతిపెద్ద”, “అతిచిన్న” బడ్జెట్ ప్రసంగాలు ఇవే..
Union Budget 2025: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 01న కేంద్ర బడ్జెట్‌ని పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్‌పై దేశ ప్రజలంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇండియాని ఆర్థికంగా మరింత ముందుకు తీసుకెళ్లే అనేక నిర్ణయాలు ఉంటాయని అంతా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, నిర్మలమ్మ చేయబోయే బడ్జెట్ ప్రసంగం గురించి అంతా ఎదురుచూస్తు్న్నారు. శనివారం, ఆమె వరసగా 8వ సారి కేంద్ర బడ్జెన్ని ప్రవేశపెట్టబోతున్నారు. -
UK: బ్రిటన్ “ఇస్లామిక్ దేశం”గా మారొచ్చు.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
UK: యూకే మాజీ మంత్రి, హోం సెక్రటరీగా పనిచేసిన సుయెల్లా బ్రేవర్మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా బాటలోనే బ్రిటన్ కూడా మళ్లీ గొప్పగా మారాల్సిన అవసరం ఉందని అన్నారు. బ్రిటన్ ‘‘ముస్లిం ఛాందసవాదుల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది’’ అని హెచ్చరించారు. రాబోయే రెండు దశాబ్దాల్లో వెస్ట్రన్ దేశాలు ఇరాన్ తరహా పరిస్థితుల్ని ఎదుర్కోవచ్చని చెప్పారు. బ్రేవర్మాన్ రైట్ వింగ్ థింక్ ట్యాంక్, హెరిటేజ్ ఫౌండేషన్ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. -
Rakesh Rathore: అత్యాచారం కేసులో కాంగ్రెస్ ఎంపీ అరెస్ట్..
Rakesh Rathore: ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన కాంగ్రెస్ ఎంపీ రాకేష్ రాథోడ్ అత్యాచార కేసులో ఈ రోజు అరెస్టయ్యారు. సీతాపూర్ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న రాకేష్ రాథోడ్ విలేకరులతో సమావేశం నిర్వహిస్తున్న సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. గత నాలుగు ఏళ్లుగా తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఉత్తర్ ప్రదేశ్ యూనిట్ జనరల్ సెక్రటరీగా ఉన్న రాథోడ్‌పై జనవరి 17న పోలీసులు కేసు నమోదు చేశారు. -
Anna Hazare: ‘‘డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చాడు’’.. కేజ్రీవాల్‌పై అన్నాహజారే సంచలన వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై ఆయన గురువు, ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ అవినీతిపై స్పందిస్తూ.. ‘‘ఇది దురదృష్టకరం. ఆయన నాతో స్వచ్ఛంద సేవకుడిగా ఉన్నారు. జీవితంలో మీ ప్రవర్తన , అభిప్రాయాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని నేను ఎప్పుడూ అతనికి చెప్పేవాడిని. -
Bangladesh: బంగ్లాకు నిధులు ఆపేసిన ట్రంప్.. మహ్మద్ యూనస్‌తో ‘‘జార్జ్ సోరోస్’’ కుమారుడు భేటీ..
Bangladesh: అమెరికన్ బిలియనీర్ జార్జ్ సోరోస్ కుమారుడు, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్(ఓఎస్ఎఫ్) ఛైర్పర్సన్ అలెక్స్ సోరోస్, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్‌ని కలవడం చర్చనీయాంశంగా మారింది. అమెరికా ప్రస్తుతం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంగ్లాదేశ్‌కి ఆర్థిక సాయాన్ని ఆపేసిన తర్వాత ఈ సంఘటన జరిగింది. గత అక్టోబర్ నెలలో సోరోస్, యూనస్ కలిశారు. తాజాగా వీరిద్దరు రెండోసారి కలుసుకున్నారు. -
India AI: మనకు సొంత ఏఐ.. కేంద్రమంత్రి కీలక ప్రకటన..
India AI: ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ట్రెండ్ నడుస్తోంది. అమెరికా, చైనాల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. ఇప్పటికే అమెరికా చాట్‌జీపీటీ, జెమిని వంటి ఏఐ మోడళ్లను అభివృద్ధి చేసింది. అయితే, వీటికి పోటీగా వచ్చిన చైనీస్ ఏఐ మోడల్ ‘‘డీప్ సీక్’’ ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనాన్నే క్రియేట్ చేసింది. ఏకంగా ఏఐ రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో భారత్ కూడా సొంత జనరేటివ్ ఏఐ మోడల్ని అభివృద్ధి చేయబోతోంది. -
Arvind Kejriwal: ‘‘యమునా నదిలో విషం’’.. కేజ్రీవాల్‌కి ఈసీ కీలక ఆదేశం..
Arvind Kejriwal: దేశ రాజధాని ఢిల్లీలో నీటి సరఫరాకు అంతరాయం కలిగించేందుకు హర్యానా యమునా నదిలో ‘‘విషం’’ కలుపుతోందని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. అయితే, ఈ ఆరోపణలకు రుజువులు ఇవ్వాలని ఎన్నికల సంఘం మంగళవారం కేజ్రీవాల్‌కి లేఖ రాసింది. బుధవారం రాత్రి 8 గంటల వరకు రుజువులు ఇవ్వాలని ఆదేశించింది. -
CM Yogi: “బుజ్జగింపు రాజకీయ నాయకుల” పవిత్ర స్నానాలు.. అఖిలేష్‌పై విమర్శలు..
CM Yogi: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రతిపక్ష నేత సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌పై విమర్శలు గుప్పించారు. అఖిలేష్ యాదవ్‌ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. బుజ్జగింపులకు పాల్పడే రాజకీయ నాయకులుగా పేరున్న వారు కూడా ఇప్పుడు ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళలోని త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తున్నారని అన్నారు. అలాంటి వ్యక్తులు సనాతన ధర్మాన్ని గౌరవిస్తారని ఆశించడం పొరపాటు అవుతుందని యోగి అన్నారు. -
Rahul Gandhi: ‘‘లిక్కర్ స్కామ్‌కి సూత్రధారి’’.. కేజ్రీవాల్‌పై రాహుల్ గాంధీ విమర్శలు..
Rahul Gandhi: ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ ‘‘మద్యం కుంభకోణానికి మూలకర్త’’ అని దుయ్యబట్టారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం రాహుల్ గాంధీ పట్పర్ గంజ్‌లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
IMEC: IMECతో ఇరాన్‌కు చెక్.. భారత కారిడార్‌కు ట్రంప్ మద్దతు..
-
BJP: స్మృతి ఇరానీకి మళ్లీ ప్రమోషన్.. యూపీ సహా పలు రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్‌లు నియామకం
-
Flipkart BBD Sale: Samsung గెలాక్సీ ఎస్25పై రూ.20 వేల డిస్కౌంట్.. పూర్తి వివరాలివే..
-
Srikanth Odela: : నాని ‘జడల్’ లుక్ వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరో తెలుసా?
-
DA Release : తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రెండు డీఏలకు గ్రీన్ సిగ్నల్.!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!