Venu Goapl Reddy
Author- NTV Telugu-
Ragging: ‘‘టాయ్‌లెట్ సీటుని నాకించారు’’.. ర్యాగింగ్ భూతానికి 15 ఏళ్ల విద్యార్థి బలి..
Ragging: ర్యాగింగ్ భూతానికి 15 ఏళ్ల బాలుడు బలయ్యాడదు. కేరళలోని టీనేజర్ మిహిర్ ఆత్మహత్య సంచలనంగా మారింది. స్కూల్లో ర్యాగింగ్, బెదిరింపులతో ప్రాణం తీసుకున్నాడు. కేరళలోని ఎర్నాకుళంలోని త్రిప్పునితురలో జనవరి 15న మిహిర్ తన అపార్ట్మెంట్ భవనంలోని 26వ అంతస్తు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కుమారుడు ఎదుర్కొన్న భయంకరమైన అనుభవాలను అతడి తల్లి రజ్నా పీఎం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. -
Mamta Kulkarni: సన్యాసిగా మారిన బాలీవుడ్ యాక్టర్ “మమతా కులకర్ణి” బహిష్కరణ..
ఇప్పుడు ఈ మహామండలేశ్వర్‌గా నియమించడం వివాదాస్పదమైంది. తాజాగా కిన్నార్ అఖాడా నుంచి మమతా కులకర్ణితో బహిష్కరించారు. ఆమెతో పాటు లక్ష్మీ నారాయణ్ త్రిపాఠిని కూడా బహిష్కరించారు. కిన్నార్ అఖాడా వ్యవస్థాపకుడు రిషి అజయ్ దాస్ వీరిద్దరి నుంచి అఖాడా నుంచి బహిష్కరించినట్లు తెలిసింది. మమతా కులకర్ణిని మహామండలేశ్వర్‌గా నియమించడం వివాదాస్పదం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
Sonia Gandhi: ‘‘పాపం రాష్ట్రపతి’’.. సోనియా గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..
Sonia Gandhi: పార్లమెంట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంపై కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్షాలు పెదవి విరిచాయి. సోనియా గాంధీ రాష్ట్రపతిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. ద్రౌపది ముర్ము సుదీర్ఘ ప్రసంగం తర్వాత అలసిపోయినట్లు కనిపించారని కాంగ్రెస్ అధినేత్రి చేసిన వ్యాఖ్యలు ‘‘అవమానకరమైనవి’’ అని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. -
Economic Survey: భారతదేశ జీడీపీ అంచనా 6.3% – 6.8%.. ఎకనామిక్ సర్వేలో కీలక విషయాలు..
Economic Survey: 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ GDP వృద్ధి 6.3% - 6.8% మధ్య ఉంటుందని ఆర్థిక సర్వే 2024-25 అంచనా వేసింది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి నెమ్మదిగా ఉండొచ్చని అంచనాలు సూచిస్తున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంట్లో ఆర్థిక సర్వేని సమర్పించింది. తగ్గుతున్న నిరుద్యోగ రేటు, స్థిరమైన ద్రవ్యోల్భణం, వృద్ధి వేగాన్ని కొనసాగించడానికి మరిన్ని సంస్కణలను అవసరమనే ఉద్దేశాన్ని ఉదహరించింది. -
Boondi Laddoo: “బూందీ లడ్డూ”తో పరారీలో ఉన్న హత్య దోషి అరెస్ట్..
Boondi Laddoo: నాలుగేళ్లుగా తప్పించుకుతిరుగుతున్న ఓ హత్య కేసులో దోషిని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్‌తో అరెస్ట్ చేశారు. రిపబ్లిక్ డే రోజున ‘‘ బూందీ లడ్డూ’’ ని పంచుతూ అతడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పెరోల్ పొందిన తర్వాత అప్పటి నుంచి దోషి పరారీలో ఉన్నాడు. 2008లో ఢిల్లీలోని నజాఫ్‌గఢ్ ప్రాంతంలో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్యని హత్య చేసిన కైలాష్(40) అనే వ్యక్తిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. -
Wife harassment: భార్య వేధింపులకు మరో భర్త బలి.. ‘‘వరకట్న చట్టాలను మార్చాలంటూ..’’
Wife harassment: తప్పుడు ‘‘వరకట్న వేధింపులు’’ భర్తల ఆత్మహత్యలకు కారణమవుతోంది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో భార్య వేధింపులు భరించలేక ఓ ఫోటోగ్రాఫర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, ఆమె ముగ్గురు బంధువుల కారణంగా ఈ చర్యకు పాల్పడ్డాడని, వారిపై కేసులు నమోదు చేసినట్లు గురువారం ఒక పోలీస్ అధికారి తెలిపారు. ‘‘వరకట్న నిషేధ చట్టాలను’’ మహిళలు దుర్వినియోగం చేయకుండా ప్రభుత్వం మార్పులు చేయాలని కోరుతూ.. నితిన్ పడియార్(28) జనవరి 20న ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. Read Also: […] -
Bangladesh: బంగ్లాదేశ్‌కి డబుల్ షాక్.. ముందు అమెరికా, ఇప్పుడు స్విట్జర్లాండ్..
Bangladesh: మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్‌కి వరస షాక్‌లు తగులుతున్నాయి. షేక్ హసీనా పదవీ నుంచి దిగిపోయిన తర్వాత మతోన్మాదంతో రెచ్చిపోతున్న బంగ్లాదేశ్ ఆర్థికంగా దివాళా తీసే స్థితికి చేరుకోబోతోంది. పాకిస్తాన్‌తో విస్తృత సంబంధాలు పెట్టుకోవాలని చూస్తు్న్న బంగ్లాదేశ్, పాక్ తీరులోనే అడుక్కునే స్థితిలోకి చేరే అవకాశం ఉంది. -
Live-in relation: కుళ్లిపోయిన స్థితిలో తండ్రి, కూతురు మృతదేహాలు.. “లివ్-ఇన్ పార్ట్నర్” అరెస్ట్..
Live-in relation: తమిళనాడు చెన్నైలోని ఒక అపార్ట్మెంట్లో తండ్రి, కూతురు మృతదేహాలు కుళ్లిన స్థితిలో కనిపించాయి. చాలా నెలల క్రితమే వీరిద్దరు చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు ఫిర్యాదు చేయడంతో, ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించారు. ఈ ఘటనలో హత్య-ఆత్మహత్య కోణంలో విచారణ సాగిస్తున్నారు. Read Also: Karnataka: పెళ్లికి నిరాకరించిందని విద్యార్థిని గొంతు కోసి చంపిన ప్రేమోన్మాది.. అయితే, ఈ మరణాలతో సంబంధం ఉన్నట్లు […] -
Karnataka: పెళ్లికి నిరాకరించిందని విద్యార్థిని గొంతు కోసి చంపిన ప్రేమోన్మాది..
Karnataka: కర్ణాటకలో దారుణం జరిగింది. పెళ్లికి ఒప్పుకోలేదని ఓ ప్రేమోన్మాది యువతి గొంతు కోసి చంపాడు. ఈ ఘటన రాష్ట్రంలోని రాయచూర్ జిల్లా సింధనూర్‌లో జరిగింది. పట్టపగలే ఈ దారుణం జరిగింది, నేరం చేసిన తర్వాత నిందితుడు పోలీసుల ముందు లొంగిపోయాడు. మరణించిన విద్యార్థిని షిఫా(24)గా గుర్తించారు. నిందితుడు టైల్స్ దుకాణంలో పనిచేసే ముబిన్‌గా గుర్తించారు. -
HMPV Virus: దేశంలో మరో HMPV కేసు.. 4 ఏళ్ల బాలుడిలో వైరస్ నిర్ధారణ..
HMPV Virus: చైనాలో ప్రారంభమైన HMPV దేశాన్ని కూడా కలవరపెట్టింది. చైనాలో భారీగా కేసులు నమోదు కావడం, మరోసారి కోవిడ్ మహమ్మారిని గుర్తుకు తెచ్చింది. ఇదిలా ఉంటే, HMPV వైరస్ కేసులు కూడా భారత్‌లో కూడా నమోదు కావడం ఆందోళల్ని పెంచాయి. అయితే, నిపుణులు దీనిని వల్ల పెద్దగా ప్రమాదం ఉండదని చెప్పారు. Read Also: CM Revanth Reddy : రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పెంపుకు పాఠశాల విద్యలో AI ఆధారిత డిజిటల్ విద్య ఇదిలా […]
తాజావార్తలు
-
Mamata Banerjee: బెంగాల్లో మళ్లీ ఎన్నికలు, జ్ఞానేశ్ కుమార్ అరెస్టు.. మమత సంచలన డిమాండ్..
-
Gautam Adani: అంబానీని దాటేసిన అదానీ.. మళ్లీ దేశంలోనే నంబర్ 1 ధనవంతుడిగా రికార్డ్!
-
Best Places to Visit in India in October: అక్టోబర్‌లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 10 ప్రదేశాలు అస్సలు మిస్ కావొద్దు..
-
Meloni: యూఎన్‌కు మెలోనీ దూరం.. ట్రంప్‌ను కలవడం ఇష్టం లేకనేనా?
-
Ganesh Immersion 2026 : గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు.. 20 వేల మంది పోలీసులతో నిఘా.!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!