Bear Grylls: “బేర్ గ్రిల్స్” వీడియోలు రక్షించాయి.. అగ్నిపర్వతం నుంచి బయటపడిన సోదరులు..
- బేర్ గ్రిల్స్ మనుగడ టెక్నిక్స్ కాపాడాయి..
- బాలి అగ్నిపర్వతంపై ఇద్దరు బ్రిటిష్ సోదరులు మిస్సింగ్..
- 40 గంటల తర్వాత ఆచూకీ గుర్తింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bear Grylls: ‘బేర్ గ్రిల్స్’ ఇతని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు మ్యాన్ వర్సెస్ వైల్డ్ వంటి షోలతో కష్టతరమైన పరిస్థితుల్లో ఎలా మనుగడ సాధించాలో చెప్పే ఈ షో ప్రపంచ వ్యాప్తంగా చాలా ఫేమస్. అయితే, ఇప్పుడు బేర్ గ్రిల్స్ షోలు చూసే ఇద్దరు ప్రమాదకరమైన అగ్నిపర్వతం బారి నుంచి తమను తాము రక్షించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే ఈ ఘటన ఇండోనేషియాలోని బాలిలోని మౌంట్ అగుంగ్ అగ్నిపర్వతం వద్దకు వెళ్లి తప్పిపోయిన ఇద్దరు యువకుల విషయంలో జరిగింది.
ఇండోనేషియా బాలిలో ఒక అగ్నిపర్వతాన్ని అధిరోహించే క్రమంలో ఇద్దరు బ్రిటిష్ యువకులు అదృశ్యమయ్యారు. వారిని రక్షంచడానికి రెస్క్యూ బృందానికి 40 గంటల సమయం పట్టింది. బ్రిటిష్ జర్నలిస్టు కేథరీన్ ఫోర్‌స్టర్, తన ఇద్దరు కుమారులైన మాథన్(21), ఆండ్రూ(18) అనుభవాలను సోషల్ మీడియా పోస్టులో పంచుకున్నారు. తాను 30 గంటల పాటు తన కుమారుల మాట వినలేదని చెప్పారు.
Also Read
- Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. 'జై జవాన్ జై కిసాన్' రూపశిల్పి శాస్త్రి జీ..
- Sugar Stock Limit: షుగర్ వ్యాపారులకు షాక్.. నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు
- UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
- Gandhi Jayanti 2026: గాంధీ జయంతి.. రాజ్‌ఘాట్‌లో బాపూజీకి ప్రధాని మోడీ ఘన నివాళులు
Read Also: Accident: గుజరాత్‌లో ఘోర ప్రమాదం..లోయలో పడిన 70మంది ప్రయాణికులతో కూడిన బస్సు..
మాథన్, ఆండ్రూలు బాలిలోని 10,000 అడుగులు ఎత్తైన అగ్నిపర్వతాన్ని అధిరోహించాలని అనుకున్నారు. అక్కడ నుంచి సూర్యోదయాన్ని చూడాలని బయలుదేరారు. ఆగ్నేయాసియా అంతటా ప్రయాణించిన వీరిద్దరు, ఇంటికి వెళ్లే ముందు ఈ అగ్నిపర్వతం ఎక్కాలని భావించి, చివరకు ప్రమాదం అంచుల వరకు వెళ్లివచ్చారు.
అగ్నిపర్వతం ఎక్కే సమయంలో ఇద్దరి ఫోన్ల బ్యాటరీలు డెడ్ అయ్యాయి. దీంతో వీరు సాయం కోసం ఎవరిని కాంటాక్ట్ చేయలేని పరిస్థితి నెలకొంది. అయితే, బేర్ గ్రిల్స్ వీడియోలను చూసే అలవాటు ఉన్న వీరు, అందులో అతను ఉపయోగించిన మనుగడ టెక్నిక్స్‌ని వాడుకుని తమను తాము రక్షించుకోవాలని భావించారు. దీంతో వర్షపు నీటిని సేకరించడంతో పాటు, ఎలా ఆశ్రయం నిర్మించుకోవాలనే దానిని నేర్చుకున్నారు. వీరిద్దరు మిస్సైన విషయాన్ని మరో స్నేహితుడు బ్రిటిష్ ఎంబసీకి నివేదించడంతో రెస్క్యూ కార్యక్రమాలను ప్రారంభించారు. చివరిసారిగా వారి లోకేషన్‌ని ట్రేస్ చేశారు. దాదాపుగా 40 గంటల తనకవాత వీరిద్దర్ని సజీవంగా అధికారులు రక్షించారు.
తాజావార్తలు
-
Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ‘జై జవాన్ జై కిసాన్’ రూపశిల్పి శాస్త్రి జీ..
-
Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
-
Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
-
Sugar Stock Limit: షుగర్ వ్యాపారులకు షాక్.. నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు
-
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?