Encounter: మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 6 గంటల పాటు భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో మొత్తం 12 మంది మావోయిస్టులు హతమయ్యారు.
Wagh Nakh: మరాఠా సామ్రాజ్యనేత ఛత్రపతి శివాజీ మహరాజ్ ఉపయోగించిన ఆయుధం ‘‘వాఘ్ నఖ్’’ లేదా పులి పంజాగా పిలిచే ఆయుధం లండర్ మ్యూజియం నుంచి ముంబైకి చేరుకున్నట్లు రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ మునిగంటివార్ తెలిపారు.
Digvijaya Singh: కరుడుగట్టిన కాంగ్రెస్ నేత, ఆర్ఎస్ఎస్ బద్ధవ్యతిరేకించే దిగ్విజయ్ సింగ్, ఆ సంస్థను పొగిడారు. సమర్థవంతమైన కమ్యూనికేషన్, సంస్థాగత విస్తరణపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)ని చూసి నేర్చుకోవాలని కాంగ్రెస్ యూత్ కార్యకర్తలకు సూచించారు.
Helicopter Incident: మహరాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లు తృటిలో హెలికాప్టర్ ప్రమాదం నుంచి బయటపడ్డారు. రాష్ట్రంలోని మారుమూల జిల్లా గడ్చిరోలిలో స్టీల్ ప్రాజెక్టుకు శంకుస్థాపనకు వెళ్తున్న సమయంలో వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణంలో చిక్కుకుని, తప్పిపోయింది.
Himanta Biswa Sarma: అస్సాంలో పెరుగుతున్న ముస్లిం జనాభాపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మారుతున్న జనాభా చాలా ఆందోళన కలిగిస్తోందని, ముస్లిం జనాభా విపరీతంగా పెరిగిందని అన్నారు.
Gujarat HC: మహిళ పేరు, చిరునామా, మొబైల్ నెంబర్ అడగడం సరికాదని, అయితే ఇది లైంగిక వేధింపుల కిందకు రాదని గుజరాత్ హైకోర్టు మంగళవారం వ్యాఖ్యానించింది. గాంధీనగర్‌కి చెందిన ఒక మహిళ తన పేరు అడిగినందుకు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఒక వ్యక్తిపై IPC సెక్షన్ 354A కింద FIR నమోదు చేసిన తర్వాత ఈ తీర్పు వచ్చింది.
UP BJP: లోక్‌సభ ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఘోర పరాజయం చూసింది. 2014, 2019 ఎన్నికల్లో దాదాపుగా రాష్ట్రంలోని అన్ని స్థానాలను క్లీన్‌స్వీప్ చేసిన ఆ పార్టీ, 2024 ఎన్నికల్లో మాత్రం దారుణమైన ఫలితాలను చూసింది.
Captain Anshuman Singh: గతేడాది సియాచిన్ గ్లేసియర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ధైర్యసాహసాలు ప్రదర్శించి, అమరుడైన కెప్టెన్ అన్షుమాన్ సింగ్‌కి మరణానంతరం రెండో అత్యున్నత శాంతికాల శౌర్య పురస్కారం కీర్తి చక్ర ప్రకటించింది.
Bengaluru: ధోతి ధరించాడనే కారణంతో ఓ వృద్ధుడు, అతని కొడుకుని మాల్‌లోకి అనుమతించని ఘటన బెంగళూర్‌లో చోటు చేసుకుంది. జీటీ మాల్లోని థియేటర్లో సినిమా చూసేందుకు వెళ్లిన సమయంలో అక్కడి సిబ్బంది వీరిని అడ్డుకుంది.
Nagpur: నాగ్‌పూర్‌లో కారులో ఓ వ్యక్తి తన లవర్‌తో చేసిన రొమాన్స్ వైరల్ అవుతోంది. కారులో ప్రయాణిస్తూ ఇలాంటి పనులు చేయడమేంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.