Himanta Biswa Sarma: అస్సాంలో ముస్లిం జనాభా పెరుగుదల రాజకీయం కాదు, ‘‘ జీవన్మరణ’’ సమస్య..
- అస్సాంలో ముస్లిం జనాభా పెరుగుదలపై సీఎం కీలక వ్యాఖ్యలు..
- రాజకీయం కాదని ‘‘జీవన్మరణ’’ సమస్యన్న హిమంత బిశ్వ శర్మ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himanta Biswa Sarma: అస్సాంలో పెరుగుతున్న ముస్లిం జనాభాపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మారుతున్న జనాభా చాలా ఆందోళన కలిగిస్తోందని, ముస్లిం జనాభా విపరీతంగా పెరిగిందని అన్నారు. తనకు జనాభా మార్చడం అనేది రాజకీయం కాదని, ‘‘జీవన్మరణ’’ సమస్య అని ఆయన చెప్పారు. ‘‘జనాభాను మార్చడం నాకు పెద్ద సమస్య. అస్సాంలో ముస్లిం జనాభా 40 శాతానికి చేరుకుంది. 1951లో ఇది 12 శాతంగా ఉంది’’ అని ఆయన చెప్పారు. మేము చాలా జిల్లాలను కోల్పోయాము, ఇది నాకు రాజకీయ సమస్య కాదు, జీవన్మరణ సమస్య అని చెప్పారు.
Read Also: Suvendu: మైనారిటీ మోర్చాపై సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు
Also Read
- Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
- Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
హిమంత ముస్లిం జనాభా గురించి మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. జూన్ 2021లో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే ఆయన మాట్లాడుతూ, అస్సాంలో మైనారిటీ ముస్లింలలో ఆర్థిక అసమానతలు, పేదరికానికి జనాభా విస్ఫోటనం కారణమని అన్నారు. రాష్ట్రంలో ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో జనాభా నియంత్రణపై అవగాహన కల్పించేందుకు గర్భనిరోధక సాధనాలు పంపిణీ చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గత సంవత్సరం, అస్సాం ప్రభుత్వం రాష్ట్రంలోని ఐదు స్థానిక ముస్లిం వర్గాల సామాజిక-ఆర్థిక సర్వేను నిర్వహిస్తుందని, తద్వారా వారి అభ్యున్నతికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అస్సాంని ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలు కొనసాగుతున్నాయని వాటిపై చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టం అమలులోకి వచ్చిన తరువాత,బెంగాలీ మాట్లాడే బంగ్లాదేశ్ ముస్లింలను ‘మియా’ అని పిలుస్తారు, వారిని స్థానిక ప్రజలుగా గుర్తించడానికి షరతులు విధిస్తామని సీఎం హిమంత చెప్పారు. అస్సాంలో మియా కమ్యూనిటీకి గుర్తింపు రావాలంటే ఆ సమాజంలోని ప్రజలు కొన్ని సాంస్కృతిక పద్ధతులు , నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని హిమంత శర్మ నొక్కి చెప్పారు. మియా కమ్యూనిటీలను స్థానికులుగా గుర్తించేందుకు కుటుంబ పరిమాణాన్ని ఇద్దరు పిల్లలకు పరిమితం చేయడం, బహుభార్యత్వాన్ని నిలిపేయడం, బాల్య వివాహాలను నిషేధించడం వంటి చర్యలను ఆయన హైలెట్ చేశారు.
తాజావార్తలు
-
January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
-
Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
-
Pollution: దగ్గు, జలుబు తగ్గడంలేదా? కారణాలు ఇవే కావచ్చు!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!