Venu Goapl Reddy
Author- NTV Telugu-
Donald Trump: ఉక్రెయిన్ ఏదో రోజు రష్యాలో భాగం కావచ్చు.. ట్రంప్ సంచలనం..
Donald Trump: అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ సంచలనంగా మారారు. అనేక నిర్ణయాలతో ప్రపంచదేశాలను హడలెత్తిస్తున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా ఆయన ఉక్రెయిన్‌పై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ‘‘ఉక్రెయిన్ ఏదో ఒక రోజు రష్యాలో భాగం కావచ్చు’’ అని అన్నారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ స్కీని కలవడానికి కొన్ని రోజులు ముందు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
MP Horror: 19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం చేసిన బంధువులు..
MP Horror: మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. బంధువులే 19 ఏళ్ల అమ్మాయిపై దారుణంగా ప్రవర్తించారు. యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, ఆమెను 15 అడుగులు ఎత్తైన టెర్రస్ నుంచి కిందకు తోసేశారు. ఈ ఘటన రాష్ట్రంలోని నర్సింగ్‌పూర్‌లో జరిగింది. యువతి బంధువులే, పొరుగింటి వారి టెర్రర్‌పై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ నేరంలో ఆరుగురు వ్యక్తులు పాల్గొన్నారు. వీరిలో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
PM Modi: “AIతో జాగ్రత్తగా ఉండాలి”.. పారిస్ సదస్సులో ప్రధాని మోడీ..
PM Modi: పారిస్‌లో జరుగుతున్న AI యాక్షన్ సమ్మిట్‌లో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ప్రమాదాలు, పక్షపాతం గురించి ఆందోళన లేవనెత్తారు. అభివృద్ధి చెందుతున్న ఏఐ రంగంలో జాగ్రత్తగా, సహకారంతో కూడిన ప్రపంచ పాలన అవసరాన్ని ప్రధాని నొక్కి చెప్పారు. ప్రధాని తన ప్రసంగంలో ఆర్థిక వ్యవస్థ, భద్రత, సమాజం వంటి కీలక రంగాలను ఏఐ ఎలా పునర్నర్మిస్తుందనే విషయాన్ని హైలెట్ చేశారు. -
Massive Traffic Jams: ‘‘4 గంటల ప్రయాణానికి 12 గంటల సమయం’’.. కుంభమేళా దారుల్లో ట్రాఫిక్ జామ్..
Massive Traffic Jams: ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాకి భక్తుల రద్దీ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రయాగ్‌రాజ్ వైపు వెళ్తున్నారు. దీంతో కుంభమేళాకు వెళ్లే అన్ని దారులు కూడా రద్దీగా మారాయి. చాలా ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్స్ ఎదురయ్యయాయి. వేలాది మంది భక్తులు రాత్రంతా హైవేపై గడపాల్సి వచ్చింది. -
AAP: పంజాబ్ సీఎంని మార్చనున్న ఆప్..? భగవంత్ మాన్ ఏం చెప్పారంటే..
AAP: ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఘోర పరాజయం తర్వాత పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం కూలిపోతుందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ప్రస్తుతం పంజాబ్ సీఎం భగవంత్ మాన్ని మారుస్తారనే చర్చ కొనసాగుతోంది. అయితే, ఈ ఊహాగానాలపై మాన్ నవ్వుతూ స్పందించారు. ఈ రోజు ఢిల్లీలో పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సమావేశమయ్యారు. ఢిల్లీలోని కపుర్తలా హౌజ్‌లో జరిగిన పంజాబ్ ఎమ్మెల్యేల సమావేశం రాజకీయ వేడిని పుట్టించింది. -
China: “సోలో బ్రతుకే సో బెటర్”.. చైనాలో ‘‘వివాహాల’’ సంక్షోభం..
China: చైనాలో వివాహాల సంఖ్య క్షీణించడం అక్కడి ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. దీని ఫలితంగా జననాల రేటు కూడా తగ్గుతోంది. ఫలితంగా ఇది వృద్ధుల సంఖ్యను పెంచుతోంది. గత సంవత్సరం వివాహాలలో రికార్డు స్థాయిలో తగ్గుదల కనిపించింది. దేశ పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివాహ నమోదులలో 20% క్షీణత నమోదైందని, -
Supreme Court: దోషులుగా తేలిన రాజకీయ నాయకులు, పదవుల్లో ఉండొచ్చా?.. సుప్రీం కీలక ఆదేశాలు..
Supreme Court: దోషులుగా తేలిన రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులుగా కొనసాగే అంశంపై కేంద్రం, ఎన్నికల సంఘం కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. క్రిమినల్ నేరాలకు పాల్పడిన ఎంపీలు ఎమ్మెల్యేలను జీవితాంతం అనర్హత వేటు వేయాలని కోరుతూ వేసిన పిల్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పింది. దోషులుగా తేలిన రాజకీయ నాయకులు జైలు శిక్ష అనుభవించిన తర్వాత 6 సంవత్సరాలు మాత్రమే ఎన్నికల్లో […] -
WhatsApp Marriage: ఇంటర్ స్టూడెంట్స్.. “వాట్సాప్‌లో పెళ్లి”.. పోలీస్ స్టేషన్లో హైడ్రామా..
WhatsApp Marriage: బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో జరిగిన ఓ పెళ్లి సంచలనంగా మారింది. వాట్సాప్‌లో ఓ జంట పెళ్లి చేసుకోవడం వార్తల్లో నిలిచింది. అయితే, వీరి వివాహాన్ని ఇరు కుటుంబాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే, యువతీయువకులు మాత్రం పెద్దల నిర్ణయానికి వ్యతిరేకంగా కలిసి ఉండేందుకు పట్టుబడుతున్నారు. -
Human Brain: మనిషి చనిపోయే ముందు “మెదడు”లో ఏం జరుగుతుంది.. షాకింగ్ రిజల్ట్స్..
Human Brain: మనం చనిపోయే ముందు, మన శరీరంలో, ముఖ్యంగా మన మెదడులో ఎలాంటి పనులు జరుగుతాయనేది ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అంతుబట్టని విషయమే. దీనిపై అనేక ఏళ్లుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, ఈ పరిశోధనల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘‘ఎన్‌హ్యాన్స్ ఇంటర్‌ప్లే ఆఫ్ న్యూరోనల్ కోహరెన్స్ అండ్ కప్లింగ్ ఇన్ ది డైయింగ్ హ్యూమన్ బ్రెయిన్’’ అనే పేరుతో ఫ్రాంటియర్స్ ఇన్ ఏజింగ్ న్యూరో సైన్స్ జర్నల్‌లో మెదడు అధ్యయనానికి సంబంధించిన కీలక విషయాలను ప్రచురించారు. -
Infosys Layoffs: “సాఫ్ట్వేర్” ఆశలు ఆవిరి.. కన్నీటితో ఇళ్లకు వెళ్లిన ఇన్ఫోసిస్ ఫ్రెషర్స్..
Infosys Layoffs: గ్యాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే సగటు వ్యక్తి ఆశ సాఫ్ట్వేర్ జాబ్ సంపాదించడం, లక్షల్లో ప్యాకేజీలు అందుకోవడం, ఫ్లాట్లు, కార్లు ఇలా ఎన్నో ఆశలు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. యువత సాఫ్ట్వేర్ ఆశలు ఆవిరి అవుతున్నాయి. గత రెండేళ్లుగా టెక్ కంపెనీలు తమ ఖర్చుల్ని తగ్గించుకునేందుకు వేల సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. తాజాగా, దేశీయ టెక్ దిగ్గజం ‘‘ఇన్ఫోసిస్’’ ఏకంగా 700 మంది ఫ్రెషర్లను ఒకేసారి తొలగించడం సంచలనంగా మారింది.
తాజావార్తలు
-
New Mahindra Thar OG: కొత్త Mahindra Thar OG భారత్‌లో లాంచ్.. 2.2L డీజిల్, 2.0L టర్బో పెట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
Sharwanand : ఓ హిట్ కొట్టాడో లేదో శర్వానంద్ రెమ్యునరేషన్‌కు రెక్కలొచ్చాయట
-
Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
-
Srikakulam Rains: చిగురుటాకులా వణుకుతోన్న శ్రీకాకుళం.. విద్యాసంస్థలకు ఇవాళ, రేపు సెలవు!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!