HIV: హెచ్ఐవీ-ఎయిడ్స్ ఇప్పటికీ వైద్య రంగానికి కొరకురాని కొయ్యగా మిగిలింది. ప్రపంచంలో అధునాతన చికిత్స విధానాలు అందుబాటులోకి వస్తున్నప్పటకీ హెచ్‌ఐవీని పూర్తిగా నయం చేసే చికిత్స కానీ మందులు కానీ శాస్త్రవేత్తలు కనుగొనలేకపోతున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం అనూహ్యం హెచ్ఐవీ రోగులు ఈ వ్యాధిని జయించిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా జర్మనీకి చెందిన మరో వ్యక్తి కూడా హెచ్ఐవీని జయించిన్నట్లు తెలుస్తోంది. ఇలా దీని నుంచి పూర్తిగా కోలుకున్న ప్రపంచంలో ఏడో వ్యక్తిగా రికార్డులకెక్కనున్నారు.
హెచ్ఐవీతో పాటు లుకేమియా క్యాన్సర్‌తో బాధపడుతున్న బెర్లిన్‌కి చెందిన 60 ఏళ్ల వ్యక్తిని గోప్యత కారణంగా ‘‘నెక్ట్స్ బెర్లిన్ పేషెంట్’’గా వ్యవహరిస్తున్నారు. స్టెమ్ సెల్ మార్పిడి (ఎముక మజ్జ మార్పిడి) ద్వారా ఈ రెండు వ్యాధులు నయమయ్యే అవకాశం ఉంది. అయితే, ఇది ఒక ప్రత్యేక కేసుగా మాత్రమే వైద్యులు పేర్కొంటున్నారు, ప్రపంచంలోని 40 మిలియన్ల హెచ్ఐవీ రోగులకు ఈ చికిత్స ఒక ఎంపిక కాదని చెబుతున్నారు.
Read Also: CM Chandrababu: ఇంకా దొరకని ఎంపీడీవో వెంకట రమణ ఆచూకీ.. కుటుంబ సభ్యులకు సీఎం ఫోన్
మొదటగా అసలు బెర్లిన్ పెషెంట్‌గా పేర్కొనబడిన తిమోతీ రే బ్రౌన్ 2008లో తొలిసారి హెచ్ఐవీ నుంచి నయమైన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. బ్రౌన్ 2020లో క్యాన్సర్‌తో మరణించాడు. వచ్చే వారంలో బెర్లిన్ వేదికగా 25వ అంతర్జాతీయ ఎయిడ్స్ కాన్ఫరెన్స్ జరగబోతోంది. దీనికి ముందు బెర్లిన్‌కి చెందిన మరో రోగి దీర్ఘకాలిక హెచ్ఐవీ నుంచి ఉపశమనం లభించే రెండో వ్యక్తిగా, ప్రపంచంలో ఏడు వ్యక్తిగా గుర్తించబడనున్నారు.
ప్రస్తుతం పేర్కొనబడుతున్న రోగి 2009లో హెచ్ఐవీ బారిన పడ్డాడు. ఇతనికి 2015లో లుకేమియా సోకింది. ఈ చికిత్స కోసం ఎముక మజ్జ మార్పిడి అనే అత్యంత క్లిష్టమైన చికిత్స విధానాన్ని అవలంభిస్తారు. ఈ ప్రక్రియలో 10 శాతం మరణ ప్రమాదం ఉంది. ఎముక మజ్జ ద్వారా వ్యక్తి రోగనిరోధక శక్తి భర్తీ చేయబడుతుంది. దీని తర్వాత 2018 చివరి నుంచి హెచ్ఐవీ చికిత్సలో వాడే ‘‘యాంటీ రెట్రో వైరల్’’ డ్రగ్స్ తీసుకోవడం మానేశారు. దాదాపుగా ఆరు ఏళ్ల తర్వాత ఇతను హెచ్ఐవీ, క్యాన్సర్ నుంచి బయటపడినట్లు కనిపిస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు.