Tata Curvv: “టాటా కర్వ్” వచ్చేస్తోంది.. రేపే ఆవిష్కరణ.. ధర, ఫీచర్లు ఇతర వివరాలు..
- టాటా కర్వ్.. రేపే ఆవిష్కరణ..
- ఐసీఈ.. ఈవీ వెర్షన్లలో రిలీజ్..
- ధర.. ఇతర ఫీచర్లు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata Curvv: ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్న టాటా కర్వ్ జూలై 19న ఆవిష్కరించబడుతోంది. ఈ ఫ్యూచరిస్టిక్ కూపే స్టైట్ ఎస్యూవీ ఆగస్టు 7న విడుదల కానుంది. మిడ్ సైజ్ ఎస్యూవీ విభాగంలోకి వచ్చే కర్వ్, పెట్రోల్-డీజిల్, ఎలక్ట్రిక్ వెర్షన్లో అందుబాటులో ఉండబోతోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ క్రేటా, మారుతి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, టయోటా అర్బన్ క్రూయిజర్, హోండా ఎలివేట్, స్కోడా కుషాక్, వోక్స్ వ్యాగన్ టైగున్, ఎంజీ ఆస్టర్ కార్లకు టాటా కర్వ్ పోటీని ఇవ్వబోతోంది.
ఇక టాటా కర్వ్ ఎలక్ట్రిక్ వెర్షన్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎంజీ జెడ్ ఎస్ ఈవీ, బీవైడీ అట్టో 3, రాబోయే హ్యుందాయ్ క్రేటా ఈవీ కార్లకు పోటీనిస్తుంది. దేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాటా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. బలమైన ఈవీ పోర్ట్‌పోలియోను టాటా కలిగి ఉంది. టాటా నెక్సాన్ ఈవీ, టాటా టియాగో ఈవీ, టిగోర్ ఈవీ, పంచ్ ఈవీ కార్లను కలిగి ఉంది. భవిష్యత్తులో టాటా తన హారియర్ ఈవీని కూడా తీసుకురాబోతోంది.
Also Read
- Tata Safari EV: టాటా సఫారీ EV వచ్చేస్తోంది.. మహీంద్రా XEV 9Sకు గట్టి పోటీ!
- Maruti Suzuki Fronx: 28 కిలోమీటర్ల మైలేజ్.. రూ. 6.90 లక్షల ధర.. కొత్త మారుతి ఫ్రాంక్స్ వచ్చేస్తోంది..!
- Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
- క్రెటా ప్రియులకు గుడ్ న్యూస్.. త్వరలోనే మార్కెట్లోకి Hyundai Creta 7-Seater.. ఫుల్ డీటెయిల్స్ మీకోసం..
Read Also: Venu swamy: హీరోహీరోయిన్సే అనుకున్నాము ఇప్పుడు విలన్స్ కూడానా.. వేణుస్వామి క్రేజ్ మాములుగా లేదుగా..
ప్రస్తుతం రాబోతున్న టాటా కర్వ్‌లో అత్యాధునిక భద్రతతో పాటు టెక్ ఫీచర్లను అందిస్తోంది. ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే, పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, టచ్ ప్యానెల్‌తో కూడిన టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ మరియు టచ్-బేస్డ్ HVAC కంట్రోల్స్ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. 360 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్ కూడా ఉంటుందని భావిస్తున్నారు.
టాటా కర్వ్, నెక్సాన్ ఐసీఈ పవర్ ట్రెయిన్ని కలిగి ఉంటుంది. ఇది రెవోట్రాన్ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ (120PS మరియు 170Nm), రెవోట్రాన్ 1.5 డీజిల్ ఇంజన్ (115PS మరియు 260Nm)ని కలిగి ఉంటుంది. ట్రాన్స్మిషన్లను పరిశీలిస్తే పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్, 6- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పాటు 6-స్పీడ్ ఏఎంటీ, 7-స్పీడ్ డీసీఏ ఆప్షన్లను కలిగి ఉంది. డిజిల్ ఇంజన్ 6-స్పీడ్ MT మరియు 6-స్పీడ్ AMT ఉన్నాయి.
టాటా కర్వ్ ఈవీ స్పెసిఫికేషన్లు ఇప్పటికీ అస్పష్టంగా ఉన్నప్పటికీ, టాటా తన కొత్త ఈవీ ఆర్కిటెక్చర్ అయిన acti.ev (అడ్వాన్సుడ్ కనెక్టెడ్ టెక్-ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ వెహికల్)పై ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. ఇది ఒక్క ఫుల్ ఛార్జ్‌తో 450 కి.మీ కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుంది. టాటా కర్వ్ పెట్రోల్-డిజిల్ వెర్షన్ ధర రూ. 11 లక్షల నుంచి రూ. 19 లక్షలు(ఎక్స్-షోరూం) మధ్య ఉండొచ్చు. ఇక ఎలక్ట్రిక్ వెర్షన్ ధర రూ. 18 లక్షల నుంచి రూ. 21 లక్షలు(ఎక్స్ షోరూం) ఉండే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
-
Ilhan Omar: సోదరుడితో పెళ్లి ఆరోపణలు.. అమెరికా ఎంపీ ఇల్హాన్ ఒమర్‌పై విచారణ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?