Odisha: వైద్యం పేరుతో మహిళ తలలో 18 సూదులు గుచ్చిన తాంత్రికుడు..
- వైద్యం పేరుతో యువతి తలలో సూదులు గుచ్చిన తాంత్రికుడు..
- ఒడిశాలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha: ఒడిశా రాష్ట్రంలో దారుణం జరిగింది. మంత్రాల నెపంతో తాంత్రికుడు మహిళ తలలో 18 సూదులను పొడిచాడు. రాష్ట్రంలో బలంగీర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. తాంత్రికుడు 19 ఏళ్ల యువతి తలలో సూదులను గుచ్చడంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. సీటీ స్కాన్ నిర్వహించగా, ఆమె తలలో 10 సూదులను గుర్తించారు. ఆమెకు వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం తాంత్రికుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Olympic Medals: ఒలింపిక్స్‌లో అందించే బంగారు పతకంలో ఎంత బంగారముంటుందో తెలుసా..?
Also Read
వివరాల్లోకి వెళితే.. యువతి గత నాలుగేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఆమె పరిస్థితి నయం కాలేదు. ఈ నేపథ్యంలో తనకు ఆరోగ్యం నయం కావాలని తల్లిదండ్రులతో కలిసి ఓ తాంత్రికుడిని సంప్రదించింది. వైద్యం పేరుతో ఒక గదిలోకి యువతిని తీసుకెళ్లిన తాంత్రికుడు సంతోష్ రానా, గంట తర్వాత ఆమెను బయటకు తీసుకువచ్చాడు. ఆ తర్వాత ఆమె అసౌకర్యంగా ఉండటం చూసిన తల్లిదండ్రులు ఆమె తలలో సూదులను గుర్తించారు. దీంతో బాధితురాలి తండ్రి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. సీటీ స్కాన్‌లో 10 సూదులు తలలో ఉన్నట్లు తేలింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తాంత్రికుడిని అరెస్ట్ చేసి, తదుపరి విచారణ చేస్తున్నారు.
తాజావార్తలు
-
CJP Protest: యూటర్న్ తీసుకున్న సీజేపీ ఉద్యమం.. క్షణాల్లో సీన్ మార్పు
-
2027 World Cup Squad: 2027 వరల్డ్ కప్ టీమిండియాలో సీనియర్లకు నో.. ఆ క్రికెటర్ ఎంచుకున్న 15 మంది ప్లేయర్లు వీరే..
-
CJP: బర్గర్ వివాదం.. సీజేపీ అధికార ప్రతినిధి తొలగింపు..
-
Ajay Bhupathi: ఆర్జీవీ మేకింగ్ స్టైల్‌కు ప్రత్యేక బ్రాండ్ ఉంది
-
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో.. మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు..
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!