Chandipura Virus: ‘చండీపురా వైరస్’ ఏమిటి.? లక్షణాలు, నివారణ, చికిత్స వివరాలు..
- గుజరాత్‌లో కలకలం రేపుతున్న చండీపురా వైరస్..
- వ్యాధి లక్షణాలు.. చికిత్స.. నివారణ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandipura Virus: ‘‘చండీపురా వైరస్(సీహెచ్‌పీవీ)’’ గుజరాత్ రాష్ట్రాన్ని కలవరపరుస్తోంది. ఈ వైరస్ కారణంగా నాలుగేళ్ల బాలిక మరణించినట్లు వైద్యాధికారులు చెప్పారు. ఈమెతో పాటు చండీపురా వైరస్ కారణంగా 14 మంది రోగులు మరణించినట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు 29 కేసులు నమోదయ్యాయి.
ఏమిటీ చండీపురా వైరస్..?
Also Read
- Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
- Tamil Nadu: రైతులు, టీచర్లకు ఊరట.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
- Maharashtra: 200 ఏళ్ల తర్వాత కుటుంబంలో ఆడబిడ్డ జననం.. అంబరాన్నంటిన సంబరాలు
- Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
చండీపురా వైరస్ అనేది రాబ్డోవిరిడే కుటుంబానికి చెందిన వెసిక్యులోవైరస్ జాతికి చెందిన ఆర్బోవైరస్. దీనిని మొట్టమొదటిసారిగా 1965లో మహారాష్ట్రలోని చండీపురా గ్రామంలో గుర్తించడంతో ఆ గ్రామం పేరునే వైరస్‌కి పెట్టారు. ఇసుక ఈగలు, దోమలు, పేలు ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. ఇది తీవ్రమైన జ్వరాన్ని, ఫ్లూ, తీవ్రమైన ఎన్సెఫాలిటిస్(మెదడువాపు)ని లక్షణాలు కలిగి, ప్రాణాంతకంగా మారుతంది. ఈ వ్యాధిన పడేవారిలో పిల్లలే ఎక్కువ ఉంటున్నారు. ఇది అంటువ్యాధి కాదని నిపుణులు చెబుతున్నారు.
లక్షణాలు:
* తలనొప్పి
*జ్వరం. అకాస్మత్తుగా వస్తుంది.
* తరుచుగా వాంతులు.
* కోమా. కొన్ని సార్లు ఈ వైరస్ కోమాకు ఆ తర్వాత మరణానికి దారి తీస్తుంది.
* మూర్చ.
నివారణ:
ముఖ్యం ఇసుక ఈగలను నివారించాలి. కీటకాలు కుట్టకుండా చర్యలు తీసుకోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. శాండ్ ఫ్లై లు ఇంటి సమీపంలో లేవని నిర్ధారించుకోవాలి.
చికిత్స:
ప్రస్తుతానికి చండీపురా వైరస్‌కి నిర్ధిష్టమైన వ్యాక్సిన్, యాంటీ వైరల్ చికిత్స లేదు. మరణాలను నివారించేందుకు ముందస్తుగా వ్యాధిని గుర్తించాలి. ఆస్పత్రిలో చేరిన తర్వాత రోగ లక్షణాలను అనుసరించి చికిత్స చేయాల్సి ఉంటుంది. రోగులు డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి, ముఖ్యంగా వాంతులు అవుతున్న సందర్భంలో. తీవ్రమైన నాడీ సంబంధిత లక్షణాలు, రోగి శ్వాసకోశ సమస్యలను నిర్వహించడానికి ఐసీయూ అవసరం. జ్వరాన్ని తగ్గించడానికి యాంటి పైరెటిక్స్ మందులు అవసరం. మూర్ఛని తగ్గించడానికి యాంటీ కాన్వల్సెంట్స్‌ని వాడుతారు.
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
-
Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
-
Diabetes: తల్లిదండ్రులకు మధుమేహం ఉంటే మీకు వస్తుందా?
-
Godavari Water: ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. పాయకరావుపేటలో సీఎం చంద్రబాబు జలహారతి
-
US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్‌పోర్ట్‌కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్‌ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!