Coal Mines: ప్రపంచంలో అతిపెద్ద 5 బొగ్గు గనుల్లో 2 మన దేశంలోనే..ఎక్కడంటే..
- ప్రపంచ అతిపెద్ద బొగ్గు గనుల్లో ఛత్తీస్‌గఢ్ మైన్స్..
- టాప్-5లో చోటు దక్కించుకున్న గెవ్రా.. కుస్ముండా మైన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Coal Mines: ప్రపంచంలో 5 అతిపెద్ద బొగ్గు గనుల్లో ప్రస్తుతం రెండు మనదేశంలో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కోల్ ఇండియా అనుబంధ సంస్థ సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్(SECL) ఆధ్వర్యంలోని గెవ్రా, కుస్ముండా బొగ్గు గనులు ప్రపంచంలో 10 అతిపెద్ద బొగ్గు గనుల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. WorldAtlas.com విడుదల జాబితాలో ఈ రెండు గనులు వరసగా 2వ, 4వ స్థానాన్ని పొందాయి.
Read Also: Sunita Williams: మట్టి లేకుండా అంతరిక్షంలో మొక్కలు పెంచుతున్న సునీతా విలియమ్స్.. ఎలాగో తెలుసా?
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కోర్బా జిల్లాలో ఉన్న ఈ రెండు గనులు ఏటా 100 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తున్నాయి. ఇది భారతదేశంలోని బొగ్గు ఉత్పత్తిలో 10 శాతం వాటాను కలిగి ఉంది. గెవ్రా ఓపెన్‌కాస్ట్ గని వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 70 మిలియన్ టన్నులు. ఈ గని 2023-24 ఆర్థిక సంవత్సరంలో 59 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. గెవ్రా 1981 సంవత్సరంలో తన కార్యకలాపాలు ప్రారంభించింది. రాబోయే 10 సంవత్సరాలకు గానూ దేశ ఇంధన అవసరాలను తీర్చడానికి తగినంత బొగ్గు నిల్వలను కలిగి ఉంది. కుస్ముండా ఓపెన్‌కాస్ట్ గని 2023-24 ఆర్థిక సంవత్సరంలో 50 మిలియన్ టన్నులకు పైగా బొగ్గును ఉత్పత్తి చేసింది. బొగ్గు ఉత్పత్తిలో ఇది గెవ్రా తర్వాతి రెండో స్థానంలో ఉంది.
ఈ గనుల నుంచి పర్యావరణ అనుకూల విధానాల ద్వారా బొగ్గుని వెలికి తీస్తున్నారు. పేలుళ్లు లేకుండా బొగ్గుని కత్తిరించే ‘సర్ఫేస్ మైనర్’ వంటి ప్రపంచంంలో అతిపెద్ద, అత్యాధునిక మైనింగ్ మిషన్లను మోహరించారు. ఓవర్‌బర్డెన్ తొలగింపు కోసం (బొగ్గు సీమ్‌ను బహిర్గతం చేయడానికి మట్టి, రాయి మొదలైన పొరలను తొలగించే ప్రక్రియ) 240 డంపర్లు, 42 క్యూబిక్ మీటర్లు పారని కలిగిన ప్రపంచంలోనే అతిపెద్ద HEMM (హెవీ ఎర్త్ మూవింగ్ మెషినరీ)ని వీటిలో ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలో టాప్ -5 అతిపెద్ద బొగ్గు గనుల్లో రెండు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఉండటం రాష్ట్రానికి గర్వకారణమని SECL సీఎండీ ప్రేమ్ సాగర్ మిశ్రా అన్నారు.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!