Bangladesh Protest: రిజర్వేషన్లపై బంగ్లాదేశ్‌లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 50 మంది మరణించినట్లు తెలుస్తోంది. చాలా ప్రాంతాల్లో నిరసనకారులు గవర్నమెంట్, ప్రైవేట్ ఆస్తులకు నిప్పుపెట్టి, ధ్వంసం చేస్తున్నారు.
Domestic violence: గుజరాత్లో ఓ భర్త తన భార్యను దారుణంగా వేధిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. భర్తపై బాధిత మహిళ గృహహింస కేసు పెట్టింది. తన భర్త అతని స్నేహితుల ముందు బట్టలు విప్పాలని బలవంతం చేస్తున్నట్లు ఆరోపించింది. 35 ఏళ్ల బాధిత మహిళ తాను ఎదుర్కొంటున్న హింస గురించి ఫిర్యాదు చేసింది.
Bangladesh: రిజర్వేషన్ల వివాదంతో బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. వేలాది మంది రోడ్లపైకి వచ్చిన హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్య్ర సమరయోధుల కోటా రిజర్వేషన్లను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.
Harassment: కోల్‌కతా నుంచి అబుదాబి వెళ్తున్న విమానంలో ఓ మహిళని జిందాల్ గ్రూప్ ఉద్యోగి వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. తనకు జరిగిన భయంకరమైన అనుభవాన్ని సదరు బాధిత మహిళ ఎక్స్ వేదికగా వెల్లడించింది. జిందాల్ గ్రూప్ కంపెనీకి చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒక మహిళకు పోర్న్ క్లిప్‌లు చూపించి, అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.
Police Dog: కర్ణాటకలో ఓ పోలీస్ జాగిలం వీరోచితంగా ఒక అనుమానాస్పద హంతకుడిని పట్టించడంతో పాటు మహిళను రక్షించింది. వర్షంలో 8 కి.మీ తడుస్తూ పరిగెత్తి హంతకుడిని గుర్తించింది. ఒక మహిళ ప్రాణాలను రక్షించడంలో పోలీస్ జాగిలం కీలక పాత్ర పోషించింది.
Priyanka Gandhi:ఉత్తర్ ప్రదేశ్‌లో ‘కన్వర్ యాత్ర’ వివాదం రాజకీయ రచ్చకు కారణమవుతోంది. ముజఫర్ నగర్ జిల్లా నుంచి సాగే ఈ యాత్రకు పోలీసులు విధించిన రూల్స్ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. యాత్రా మార్గంలోని పలు తినుబండారాల దుకాణాల యజమానులు వారి పేర్ల కనిపించేలా ప్రదర్శించాలని పోలీసులు ఆదేశించారు. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పి్స్తున్నాయి. పోలీసులు ఆదేశాలను ప్రియాంకాగాంధీ తీవ్రంగా విమర్శించారు. ‘‘కులం మరియు మతం ఆధారంగా సమాజంలో విభజనను సృష్టించడం రాజ్యాంగ విరుద్ధమైన నేరం. ఈ ఉత్తర్వును తక్షణమే […]
Solar Cycle: సూర్యుడు ప్రస్తుతం తన 25వ ‘సోలార్ సైకిల్’(సౌర చక్రం)లో ఉన్నాడు. 11 ఏళ్ల పాటు సాగే ఈ ప్రక్రియలో ప్రస్తుతం సగం కాలం పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం సోలార్ సైకిల్ గరిష్టానికి చేరుకుంది.
Gandharva mahal: బర్మా టేకు, విదేశాల నుంచి విద్యుత్ దీపాలు, బెల్జియం అద్దాలు ఇలా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన గంధర్వ మహాల్ వందేళ్లు పూర్తి చేసుకుంది. మైసూర్ ప్యాలెస్ మరించేలా 1924లో నిర్మించిన ఈ అద్భుత కట్టడం తూర్పుగోదావరి జిల్లాకే ప్రత్యేకంగా నిలుస్తోంది.
Pakistan: ఆల్‌ఖైదా అధినేత ఒసామా బిన్‌లాడెన్ అత్యంత సన్నిహితుడిగా పరిణగించబడుతన్న అమీన్ ఉల్ హక్‌ని పాకిస్తాన్లో శుక్రవారం అరెస్ట్ చేశారు. యూఎన్ ఆంక్షల జాబితాలో ఉన్న ఉగ్రవాది అయిన హక్‌ని పంజాబ్ ప్రావిన్స్ ఉగ్రవాద నిరోధక అధికారులు పట్టుకున్నారు.
Kidney Sale Racket: ఐదు రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కిడ్నీ విక్రయాల ముఠాను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. బంగ్లాదేశ్‌కి చెందిన వారి కిడ్నీలను విక్రయిస్తున్నారు. అవయవాలు అవసమున్న వారికి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు క్రైమ్ బ్రాంచ్ విచారణలో వెలుగులోకి వచ్చింది.