BJP: మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అవుతోంది. బంగ్లాదేశ్ హింసాత్మక ఘటనల గురించి మాట్లాడుతూ, బంగ్లాదేశ్ నుంచి శరణు కోరి వచ్చే ప్రజలకు బెంగాల్ అండగా నిలుస్తుందని, వారికి ఆశ్రయం ఇస్తుందని చెప్పారు. మమతా చేసిన వ్యాఖ్యల్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఎన్నికల్లో గెలవడానికి పొరుగుదేశం నుంచి వచ్చే అక్రమ వలసదారుల్ని జార్ఖండ్ వరకు స్థిరపరిచాలని ఇండియా కూటమి చెడ్డ ప్రణాళిక అని ఆరోపించింది.
పశ్చిమ బెంగాల్ బీజేపీ కో ఇంఛార్జ్ అమిత్ మాల్వియా మమతా బెనర్జీ వ్యాఖ్యలపై ఆగ్రహ వ్యక్తం చేశారు. ఇతర దేశం నుంచి వచ్చేవారికి ఆశ్రయం కల్పించే హక్కు మమతా బెనర్జీకి ఎక్కడిదని ప్రశ్నించారు. ఇమ్మిగ్రేషన్, పౌరసత్వం పూర్తిగా కేంద్రం పరిధిలోని అంశమని, ఇలాంటి విషయాల్లో రాష్ట్రాలకు ఎలాంటి అధికారాలు లేవని చెప్పారు. కోల్‌కతాలో జరిగిన ర్యాలీలో బెంగాల్ సీఎం మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న హింస నేపథ్యంలో, పొరుగు దేశం నుండి కష్టాల్లో ఉన్న ప్రజల కోసం తన రాష్ట్ర తలుపులు తెరిచి ఉంచుతానని మరియు వారికి ఆశ్రయం కల్పిస్తానని చెప్పారు.
Read Also: MP: రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్న మహిళలు..వారిపై మొరంవేసి సజీవ సమాధికి యత్నం
ఈ వ్యాఖ్యలపై మాల్వియా ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘భారతదేశంలో ఎవరినైనా స్వాగతించే అధికారం మమతా బెనర్జీకి ఎవరు ఇచ్చారు? ఇమ్మిగ్రేషన్ మరియు పౌరసత్వం ప్రత్యేకంగా కేంద్రం పరిధిలో అంశమని, రాష్ట్రాలకు ఎలాంటి అధికారం లేదు’’ అని ట్వీట్ చేశారు. బెంగాల్ నుంచి జార్ఖండ్ వరకు అక్రమ బంగ్లాదేశీయులను స్థిరపరచడానికి ఇండియా కూటమి దుష్ట పన్నాగమని ఆరోపించారు.
ఇతర దేశాల నుంచి మత హింస నుంచి తప్పించుకుని వచ్చిన హిందూ శరణార్థులకు సీఏఏ కింద పౌరసత్వాన్ని ఇవ్వడాన్ని మమతా బెనర్జీ వ్యతిరేకిస్తున్నారని, అదే సమయంలో బంగ్లాదేశీయులను భారతదేశానికి ఆహ్వానిస్తున్నారని మాల్వియా అన్నారు. టీఎంసీకి ఓటు వేసే అక్రమ రోహింగ్యాలను రైళ్లు తగలబెట్టండి, రోడ్లు దిగ్భంధించండి, ప్రజలను చంపమని ఆమె చెబుతోందని మాల్వియా ఆరోపించారు.
Mamata Banerjee on
Odd days – We will not allow Hindu refugees, who came to India to escape religious persecution, to apply for citizenship under CAA and get their legitimate rights. If they insist, we will ask illegal Rohingyas, who vote for the TMC, to burn trains, block roads… pic.twitter.com/cSMqrkCF4M
— Amit Malviya (@amitmalviya) July 21, 2024