Prashant Kishor: బీహార్ వేదికగా మరో పార్టీ రాబోతోంది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ‘జన్ సురాజ్’ పేరుతో పార్టీని స్థాపించబోతున్నట్లు ఆయన ఆదివారం వెల్లడించారు.
Gujarat: గుజరాత్ అహ్మదాబాద్‌కి చెందిన వ్యక్తికి పెళ్లైన తర్వాత తన భార్య గురించి సంచలన విషయం తెలిసింది. దీంతో తనను మోసం చేశారని సదరు వ్యక్తి భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు.
Delhi Court: మహిళలకు ఇచ్చే ప్రత్యేక అధికారాలను సొంత ప్రయోజనాల కోసం ‘కత్తి’లా వాడకూడదని, తప్పుడు అత్యాచారం కేసు నమోదు చేసిన మహిళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులును ఢిల్లీ కోర్టు ఆదేశించింది. అదనపు సెషన్స్ జడ్జి షెఫాలీ బర్నాలా టాండన్ ఈ కేసును విచారిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Sonam Wangchuk: కేంద్రపాలిత ప్రాంతానికి రాష్ట్ర హోదా ఇవ్వడంతో పాటు రాజ్యాంగ పరిరక్షణ డిమాండ్లపై పర్యావరణ కార్యకర్తల కేంద్రానికి అల్టిమేటం జారీ చేశారు. ప్రభుత్వం లడఖ్ అధికారుల్ని చర్చలకి ఆహ్వానించకుంటే ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం నుంచి నిరాహార దీక్ష చేస్తానని ఆదివారం హెచ్చరించారు.
VIDEO: బెంగళూర్‌లోని గోల్డ్ ఫించ్ హోటల్లో బీజేపీ-జేడీఎస్ పాదయాత్ర గురించి కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి మాట్లాడుతున్న సమయంలోనే ఆయన ముక్కు నుంచి రక్తం ధారాళంగా కారింది. ఉన్నట్లుండి జరిగిన ఈ సంఘటనతో అక్కడ ఉన్న వారంతా ఏమైందనే భయాందోళన వ్యక్తం చేశారు.
Kerala High Court: బాల్య వివాహాల నిషేధ చట్టం -2006, ఈ దేశంలో ప్రతీ పౌరుడికి మతంతో సంబంధం లేకుండా వర్తిస్తుందని కేరళ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. ప్రతీ భారతీయుడు ముందుగా పౌరుడు ఆ తర్వాత ఒక మతంలోని సభ్యుడు అవుతాడని చెప్పింది.
Subhas Chandra Bose: జపాన్‌లోని రెంకోజీ ఆలయంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అవశేషాలను వెనక్కి తీసుకురావాలని ఆయన మనవడు చంద్రకుమార్ బోస్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 18లోగా వెనక్కి తీసుకురావాలని కోరారు. నేతాజీపై వస్తు్న్న తప్పుడు కథనాలకు బ్రేక్ పడాలంటే ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం నుంచి తుది ప్రకటన రావాలని ఆయన అన్నారు.
Tamil Nadu: తమిళనాడులో రాజకీయ హత్యలు ప్రకంపలను సృష్టిస్తున్నాయి. ఈ నెలలో బీఎస్పీ తమిళనాడు చీఫ్ ఆర్మ్‌స్ట్రాంగ్‌ని దుండగులు హత్య చేయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై స్టాలిన్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. పదవి నుంచి దిగిపోవాలని ఏఐడీఎంకే, బీజేపీలు డిమాండ్ చేశాయి.
Astrologer: జో బైడెన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకున్నారు. డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో పోటీపడబోతున్నారు.
Nithya Pellikoduku: దేశవ్యాప్తంగా 20కి పైగా వివాహాలు చేసుకున్న నిత్య పెళ్లికొడుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళల్ని నమ్మించి పెళ్లి చేసుకుని వారి నగలు, ఇతర విలువైన వస్తువులతో ఉడాయిస్తున్న 43 ఏళ్ల వ్యక్తిని మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఆదివారం తెలిపారు.