Hydrogen Motocycle: పెట్రోల్, డిజిల్ వంటి శిలాజ ఇంధనాల స్థానంలో ఆటోమొబైల్ రంగం ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి తీసుకువస్తున్నారు.
Cancers In India: భారతదేశంలో క్యాన్సర్ వ్యాధులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా క్యాన్సర్లలో ‘‘హెడ్ అండ్ నెక్’’ క్యాన్సర్లే 26 శాతం ఉన్నాయని, దేశంలో తల మరియు మెడ క్యాన్సర్లు పెరుగుతున్నాయని ఓ అధ్యయనం తెలియజేసింది.
MP Shocker: ఇటీవల కాలంలో ఇంటర్నెట్లో ‘పోర్న్’ విపరీతంగా చూడటం నేరాలకు కారణమవుతోంది. మైనర్లు అత్యాచారాలకు, హత్యలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ తగ్గడం కూడా పోర్న్ అడిక్షన్ని పెంచుతోంది. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన ఈ జాఢ్యం ఎంతలా పెరిగిందనే విషయాన్ని తెలియజేస్తోంది.
Doda attack terrorists: ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్లో వరసగా ఉగ్రవాద దాడులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా గత కొంత కాలంగా లోయ ప్రాంతంతో పోలిస్తే జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర ఘటనలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
Haryana Opinion Poll: ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో గెలుపు ప్రస్తుతం బీజేపీ, ఇండియా కూటమికి చాలా కీలకంగా మారబోతోంది. లోక్సభ ఎన్నికల్లో సొంత మెజారిటీతో అధికారంలోకి రాలేకపోయిన బీజేపీ, ఈ మూడు రాష్ట్రాల్లో గెలిచి తమ పాలనకు తిరుగు లేదని నిరూపించుకోవాలని భావిస్తుండగా..
High Court: వివాహితులు ‘‘సహజీవనం’’ చేయడంపై పంజాబ్-హర్యానా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇలా ‘‘లివ్ ఇన్ రిలేషన్ షిప్’’లో ఉండే వివాహితులకు రక్షణ కల్పించడం ‘‘తప్పు చేసేవారిని’’ ప్రోత్సహించడం, ద్వంద్వ వివాహాలను ప్రోత్సహించడం లాంటిదే అని కోర్టు అభిప్రాయపడింది.
PM Modi Ukraine Visit: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్రమోడీ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇటీవల మోడీ రష్యాలో పర్యటించారు.
Amritpal Singh: లోక్సభ వేదికగా ఖలిస్తానీ మద్దతుదారు, ఎంపీ అమృత్పాల్ సింగ్కి కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ మద్దతు ఇవ్వడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఖలిస్తాన్కి మద్దతు ఇస్తూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన అమృత్పాల్ని జాతీయ భద్రతా చట్టాల కింద అరెస్ట్ చేశారు.
BJP MP Nishikant Dubey: జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే డిమాండ్ చేశారు. ఈ ప్రాంతాల్లోకి బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలు పెరుగుతున్నాయని గురువారం ఆందోళన వ్యక్తం చేశారు.