Subhas Chandra Bose: నేతాజీ అవశేషాలను తీసుకురావాలి.. ప్రభుత్వాన్ని కోరిన చంద్రబోస్ మనవడు..
- నేతాజీ అవశేషాలను తీసుకురావాలి..
- ప్రభుత్వాన్ని కోరిన చంద్రబోస్ మనవడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Subhas Chandra Bose: జపాన్‌లోని రెంకోజీ ఆలయంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అవశేషాలను వెనక్కి తీసుకురావాలని ఆయన మనవడు చంద్రకుమార్ బోస్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 18లోగా వెనక్కి తీసుకురావాలని కోరారు. నేతాజీపై వస్తు్న్న తప్పుడు కథనాలకు బ్రేక్ పడాలంటే ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం నుంచి తుది ప్రకటన రావాలని ఆయన అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడికి సంబంధించిన ఫైళ్లను బహిర్గతం చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం చొరవ తీసుకుందని చెప్పారు. జాతీయంగా, అంతర్జాతీయంగా మొత్తం 10 విచారణల తర్వాత తైవాన్ విమాన ప్రమాదంలో నేతాజీ ఆగస్టు 18, 1945న మరణించారని స్పష్టంగా తేలిందని చెప్పారు.
Read Also: Women’s Asia Cup Final 2024: ఆసియా కప్ విజేతగా శ్రీలంక మహిళల జట్టు..
Also Read
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై కోర్టు సమన్లు..
- Rajnath Singh: బంగ్లాదేశ్ తరహా అస్థిరతను సృష్టించేందుకు కుట్ర?.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..
- Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఊరట.. తిరంగా మార్చ్‌పై తక్షణ ఆదేశాలకు నిరాకరణ!
- Gujarat: పాకిస్థాన్‌కు చెందిన 319 మందికి భారత పౌరసత్వం.. శరణార్థుల కన్నీటి పర్యంతం..
కాబట్టి భారత ప్రభుత్వం నేతాజీ మరణంపై తప్పుడు సమాచారం తొలిగిపోయేందుకు భారత ప్రభుత్వం తుది ప్రకటన చేయడం అత్యవసరమని చంద్రకుమార్ బోస్ ఆదివారం మోడీకి ఒక లేఖ రాశారు. నేతాజీ అవశేషాలను ఆగస్టు 18, 2024 నాటికి రెంకోజీ నుండి భారతదేశానికి తిరిగి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నేతాజీ భారత్‌కు తిరిగి రావాలనుకున్నారని, అయితే విమాన ప్రమాదంలో మరణించినందున కుదరలేదని చెప్పారు. రెంకోజీ ఆలయంలో నేతాజీ అస్థికలను ఉంచడం చాలా అవమానకరమని ఆయన అభిప్రాయపడ్డారు.
భారత్‌కి స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహానేత అవశేషాలు భారత నేలను తాకాలని మేము గత మూడున్నరేళ్లుగా ప్రధానికి లేఖ రాస్తున్నానని చెప్పారు. నేతాజీ కుమార్తె అనితా బోస్ హిందూ సంప్రదాయం ప్రకారం ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని కోరుకుంటున్నట్లు బోస్ పేర్కొన్నారు. ప్రభుత్వం నుండి లేదా ప్రధాన మంత్రి నుండి ఎటువంటి స్పందన రాకపోవడం చాలా దురదృష్టకరమని చెప్పారు. 1945 ఆగస్ట్‌లో జపాన్ లొంగిపోయిన తర్వాత జపాన్ మిలిటరీ విమానంలో తైవాన్‌ను వదిలి రష్యాకు వెళుతుండగా విమాన ప్రమాదంలో నేతాజీ మరణించినట్లు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
India Rice Exports: కేవలం 5 నెలల్లో బియ్యం ఎగుమతులతో రూ.45,739 కోట్లు.. భారత్‌కు భారీ ఆదాయం!
-
Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్ సంచలన వ్యాఖ్యలు!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
Sai Pallavi Saree Look: “మేడం సార్.. మేడం అంతే”.. పింక్ చీరలో సహజ సౌందర్యంతో మనసు దోచుకున్న సాయి పల్లవి..
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!