Air India: ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్ ఇస్మాయిల్ హనియేని టెహ్రాన్‌లో హత్య చేయడం, ఈ హత్యలో ఇజ్రాయిల్ ప్రమేయం ఉందని ఇరాన్ ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణల్ని ఇజ్రాయిల్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయిల్‌పై ప్రత్యక్ష దాడికి ఆదేశించినట్లు సమాచారం వస్తోంది. మరోవైపు లెబనాన్ రాజధాని బీరూట్‌లో హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థ కమాండర్ షుక్ర్‌ని వైమానిక దాడిలో ఇజ్రాయిల్ హతమార్చింది.
Read Also: Breaking News: “ఎలక్టోరల్ బాండ్ స్కీమ్”పై దర్యాప్తు బృందం ఏర్పాటుకి నిరాకరించిన సుప్రీంకోర్టు..
ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుంచి ఇజ్రాయిల్ ప్రధాన నగరం టెల్ అవీవ్‌కి వెళ్లాల్సిన విమానాలను ఆగస్టు 8 వరకు నిలిపేసిట్లు ప్రకటించింది. ఎయిర్ ఇండియా గురువారం సాయంత్రం న్యూఢిల్లీ నుంచి టెల్ అవీవ్ వెళ్లాల్సిన విమానాన్ని ఆపరేషనల్ కారణాలతో రద్దు చేసింది.