PM Narendra Modi: ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో, వరసగా మూడోసారి ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్ష పార్టీలన్నీ జట్టు కట్టి ఇండియా కూటమి పేరుపై పోటీ చేసినప్పటికీ, బీజేపీ సీట్లు తగ్గించారే కానీ అధికారంలోకి రాకుండా అడ్డుకోలేకపోయారు. మరోవైపు ప్రధాని మోడీ అంతర్జాతీయ పరిణామాలపై కూడా తనదైన ముద్ర వేస్తున్నారు. ఏకకాలంలో ఇటు రష్యాతో పాటు అటు అమెరికాతో స్నేహ సంబంధాలని కలిగి ఉన్నారు.
ప్రస్తుతం ఇజ్రాయిల్-హమాస్, ఉక్రెయిన్-రష్యా యుద్ధాలు జరుగుతున్న ఈ సమయంలో విడుదలైన గ్లోబల్ లీడర్స్ అప్రూవల్ రేటింగ్స్‌లో, ప్రజాదరణలో ప్రధాని నరేంద్రమోడీకి ఎదురులేదని మరోసారి నిరూపితమైంది. తాజాగా విడుదలైన జాబితాలో ప్రపంచ దేశాధినేతల్లో మోడీ తొలిస్థానంలో నిలిచారు. నరేంద్ర మోడీ మరోసారి 69 శాతం ఆమోదం రేటింగ్‌లతో అత్యంత ప్రజాదరణ పొందిన గ్లోబల్ లీడర్‌గా అవతరించారని మార్నింగ్ కన్సల్ట్ ఇటీవల సర్వే పేర్కొంది.
Read Also: Sathya 27th Showroom: ఆఫర్లే.. ఆఫర్లు.. సత్యా 27వ షోరూం అనంతపురంలో ఘనంగా ప్రారంభం
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధ నేతగా ఉన్న మోడీ ఉన్నారని, అయితే గతంలో పోలిస్తే కొంచెం (7శాతం) అప్రూవల్ రేటింగ్ తగ్గినట్లు చెప్పింది. అత్యధికంగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (20 శాతం), అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ (39 శాతం), కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (29 శాతం)ల యొక్క అప్రూవల్ రేటింగ్ దారుణంగా క్షీణిస్తున్నట్లు సర్వే వెల్లడించింది. అనూహ్యంగా యూకే ప్రధాని కైర్ స్టార్మర్, మాజీ ప్రధాని రిషి సునాక్ స్థానంలో ప్రపంచ ప్రముఖ నాయకుల జాబితాలో టాప్-10లో చోటు దక్కించుకున్నారు. జూలై 2024లో ఉన్న ఆమోదం రేటింగ్‌తో ఈ జాబితా వెలువడింది.
ప్రపంచంలో టాప్-10 ప్రజాదరణ కలిగిన నేతలు వీరే..
1) నరేంద్రమోడీ- భారత్
2) ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రడార్ – మెక్సికో అధ్యక్షుడు
3) జేవియర్ మిలీ – అర్జెంటీనా అధ్యక్షుడు
4) వియోలా అమ్హెర్డ్- స్విట్జర్లాండ్ ఫెడరల్ కౌన్సిలర్
5) సైమన్ హారిస్ – ఐర్లాండ్ మంత్రి
6) కీర్ స్టార్మర్ – యూకే ప్రధాని
7 డోనాల్డ్ టస్క్ – పోలాండ్ మాజీ ప్రధాన మంత్రి
8) ఆంథోనీ అల్బనీస్ – ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి
9) పెడ్రో సాంచెజ్ – స్పెయిన్ ప్రధాన మంత్రి
10 జార్జియా మెలోని – ఇటలీ ప్రధాన మంత్రి