Bengal Governor: కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం-హత్య ఘటన ఆ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో 31 ఏళ్ల పీజీ వైద్యురాలు నైట్ డ్యూటీలో ఉన్న సమయంలో ఆమెపై అఘాయిత్యం జరిగింది. ఈ ఘటనపై సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వంపై బీజేపీ, సీపీఎం పార్టీలు ఫైర్ అవుతున్నాయి. ఈ ఘటన వెనక తృణమూల్ పార్టీకి చెందిన వ్యక్తులు ఉన్నారంటూ ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసును కలకత్తా హైకోర్టు సీబీఐకి బదిలీ చేసింది.
Mamata Banerjee: కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం-హత్య ఘటన ఆ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపలనకు కారణమైంది. మమతా బెనర్జీ సర్కారుపై బీజేపీ, లెఫ్ట్ పార్టీలు విరుచుకుపడుతున్నాయి. గత వారం కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో 31 ఏళ్ల పీజీ ట్రైనీ మహిళా డాక్టర్‌పై అత్యంత పాశవికంగా అత్యాచారం జరిగింది
Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై ఢిల్లీ హైకోర్టులో బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి శుక్రవారం ఓ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ భారత పౌరసత్వాన్ని రద్దు చేసేలా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖని ఆదేశించాలని ఆయన హైకోర్టుని ఆశ్రయించారు.
Uddhav Thackeray: కేంద ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు-2024పై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. వక్ఫ్ బోర్డు అపరిమిత అధికారాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ బిల్లుని కేంద్రం ఇటీవల లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అయితే, దీనిపై ప్రతిపక్షాలు ఆందోళన నిర్వహించడంతో, ఈ బిల్లుని చర్చించేందుకు పార్లమెంట్‌లోని 31 మంది ఎంపీలతో ‘‘జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)’’ ఏర్పాటు చేశారు.
Kolkata Doctor Case: దేశవ్యాప్తంగా కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం-హత్య ఘటన ఆగ్రహావేశాలకు కారణమైంది. ఈ కేసును ప్రస్తుతం సీబీఐ విచారిస్తోంది. ఈ ఒక్క ఘటనే కాదు ఆస్పత్రులు వేదికగా జరిగిన మూడు అత్యాచార ఘటనలు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురించేంది. ముంబైలో 1973లో జరిగిన ‘‘అరుణా షాన్‌బాగ్’’ ఘటన ఇందులో మొదటి ఈ ఘటన జరిగి 50 ఏళ్లు గడిచినా కూడా ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట పడకపోవడం గమనార్హం. 50 ఏళ్ల తర్వాత ఇదే తీరుగా కోల్‌కతా పీజీ వైద్యురాలిపై హత్యాచారం జరిగింది.
ఇదిలా ఉంటే, ఈ రోజు(శుక్రవారం) పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కోల్‌కతాలో ర్యాలీ చేపట్టారు. వైద్యురాలికి మద్దతు నిరసన తెలుపుతున్న సమయంలో కొందరు దుండగులు ఆస్పత్రిలోకి చొరబడి దాడి చేశారు.
kolkata doctor case: కోల్‌కతా వైద్యురాలి అత్యాచార ఘటన యావత్ దేశాన్ని షాక్‌కి గురిచేసింది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, ఆస్పత్రిలో ట్రైనీ పీజీ డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న 31 ఏళ్ల యువతిపై అత్యంత దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది.
Uddhav Thackeray: ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పొత్తుల్లో ప్రధాన పార్టీలు బిజీగా ఉన్నాయి. ఇదిలా ఉంటే శివసేన( యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Jammu Kashmir Elections: మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అన్నింటి కన్నా ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ రాష్ట్రంలోని 90 అసెంబ్లీ స్థానాలకు మూడు విడుతల్లో అంటే సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 01 తేదీల్లో పోలింగ్ జరగనుంది. మిగతా రాష్ట్రాలతో కలిసి జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు కూడా అక్టోబర్ 04న విడుదల కానున్నాయి.
Kolkata Doctor Case: కోల్‌కతా వైద్యురాలి అత్యాచార, హత్య ఘటన పశ్చిమ బెంగాల్‌తో పాటు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ కేసులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ఘటన జరిగిన ఆర్జీ కర్ ఆస్పత్రి యాజమాన్యం, పోలీసుల తీరుపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తో్ంది.