Jagdeep Dhankhar: భారత ఆర్థిక వ్యవస్థను నాశనం చేసేందుకు ‘‘రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి’’ ప్రయత్నిస్తున్నారని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికపై రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యల గురించే ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Monkey Pox: ప్రపంచాన్ని మంకీపాక్స్ వైరస్ కలవరపెడుతోంది. ఆఫ్రికాలో ఉప్పెనలా నమోదు అవుతున్న కేసుల నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) దీనిని ‘‘గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ’’గా ప్రకటించింది.
Monkeypox: ప్రపంచాన్ని ‘‘మంకీపాక్స్’’ భయాందోళనకు గురిచేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆఫ్రికాలో ఉప్పెన కేసులు పెరుగుతుండటంతో బుధవారం ఈ వ్యాధిని ‘‘ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి’’గా ప్రకటించింది.
ఇదిలా ఉంటే, ఆర్జీ కాలేజ్, ఆస్పత్రిపై జరిగిన దాడిలో బీజేపీ, సీపీఎం కార్యకర్తల పాత్ర ఉందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురువారం ఆరోపించారు. గవర్నర్‌ని కలిసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం మరియు హత్యకు వ్యతిరేకంగా నిరసనల సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణాన్ని ధ్వంసం చేసిన వారు "బయటి వ్యక్తులు" వారు "వామపక్షాలు , బిజెపి జెండాలను మోసుకెళ్లారు" అని పేర్కొన్నారు.
Live Location: బెంగళూర్‌లో ఒక మహిళ హత్య, ఆమె డెడ్‌బాడీని కనుగొనేందుకు పోలీసులకు ‘‘లైవ్ లొకేషన్’’ సాయపడింది. హత్యకు కొన్ని నిమిషాల ముందు సదరు మహిళ ఆమె స్నేహితురాలికి పంపిన లొకేషన్ కీలకంగా మారింది. వివరాల్లోకి వెళ్తే, లలిత అలియాస్ దివ్య తన స్నేహితురాలికి పెట్టిన లైవ్ లొకేషన్ ఆమె మృతదేహాన్ని కనుగొనేందుకు సాయపడింది. రామనగర జిల్లా మగాడి హుజగల్ కొండ అటవీ ప్రాంతలోని గోతిలో 32 ఏళ్ల బ్యూటీషియన్ని పూడ్చిపెట్టారు.
Independence Day 2024: భారతదేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇటలీ ప్రధాని నరేంద్రమోడీతో ఉన్న ఫోటోని ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
August 15: ఆగస్టు 15, భారతదేశానికి బ్రిటీష్ వలస పాలన నుంచి స్వాతంత్య్రం లభించిన తేదీ. ఎన్నో ఉద్యమాల తర్వాత 1947 ఇదే తేదీన మన భారతీయ పతాకం సగౌరవంగా రెపరెపలాడింది. ఈ తేదీ ఒక్క మనదేశానికే కాకుండా ఉపఖండంలోని పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లో కూడా ప్రముఖమైన తేదీగా ఉంది.
Sri Lanka: ద్వీప దేశం శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో ఏకంగా 39 మంది అభ్యర్థులు బరిలో దిగారు. ఈ అధ్యక్ష ఎన్నికల్లో ముగ్గురు మైనారిటీ తమిళులతో పాటు ఇద్దరు బౌద్ధ సన్యాసులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పెద్ద నాయకులు పోటీ చేస్తున్నారు.
Sheikh Hasina: రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో చెలరేగిన అల్లర్ల కారణంగా ఆ దేశ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి, ఇండియా పారిపోవాల్సి వచ్చింది. ఈ అల్లర్లతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 560కి చేరింది. తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ విన్నర్ మహ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టారు.
Earthquake: వరస భూకంపాలతో పసిఫిక్ సముద్ర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. గురువారం రోజు ఈశాన్య తైవాన్ ప్రాంతంలో 5.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే(యూఎస్జీఎస్) తెలిపింది. ఈ భూకంప ప్రకంపనలకు రాజధాని తైపీలోని భవనాలు వణికాయి.