Kolkata Doctor Case: కోల్‌కతా వైద్యురాలి ఘటన యావత్ దేశాన్ని షాక్‌కి గురిచేసింది. బాధితురాలిపై జరిగిన దాడిని నిరసిస్తూ న్యాయం కోసం మెడికోలు, మహిళలు, సాధారణ ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో 31 ఏళ్ల ట్రైనీ వైద్యురాలు నైట్ డ్యూటీలో ఉన్న సమయంలో అత్యంత దారుణంగా అత్యాచారం, హత్యకు గురైంది.
Haryana Elections: హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ 01న ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే, ఈ సారి కూడా అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ భావిస్తుంటే, బీజేపీకి అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.
Bengaluru Techie Missing: ఇటీవల బెంగళూర్‌కి చెందిన టెక్కీ 37 ఏల్ల విపిన్ గుప్తా కనిపించకుండా పోయాడు. ఆ కేసు ఆ రాష్ట్రంలో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తన భర్తను కనుగొనాలని భార్య సోషల్ మీడియాలో ఏడుస్తూ సాయం కోరడం చర్చనీయాంశంగా మారింది. విపిన్ గుప్తా మిస్సింగ్‌పై ఆమె బెంగళూర్‌లోని కొడిగేహళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా నమోదు చేసింది.
Monsoon Brides: భారత ఉపఖండంలోని దేశాలకు రుతుపవనాలే జీవనాధారం. రుతుపవనాలపై ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది. అయితే, పాకిస్తాన్లో మాత్రం ‘‘రుతపవన పెళ్లికూతుళ్లు’’ పెరుగుతున్నారు. బాల్యంలోనే వారి తల్లిదండ్రులు వివాహాలు జరిపిస్తున్నారు. 2022లో పాకిస్తాన్ వ్యాప్తంగా, ముఖ్యంగా సింధ్ ప్రాంతంలో భారీ వర్షాలు, వరదలు వచ్చాయి.
Bulldozer action: రాజస్థాన్ ఉదయ్‌పూర్ నగరం అల్లర్లతో అట్టుడుకుతోంది. ఒక ప్రాథమిక పాఠశాలలో 10 తరగతి విద్యార్థి, తన సహవిద్యార్థిపై కత్తితో దాడి చేయడం నగరంలో ఉద్రిక్తలకు దారి తీసింది. దాడి చేసిన బాలుడు మైనారిటీ వర్గాని చెందడం, గాయపడిన బాలుడు మెజారిటీ వర్గానికి చెందడంతో నగరంలో ఒక్కసారిగా ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి.
Bangladesh: బంగ్లాదేశ్ రిజర్వేషన్ కోటాపై ప్రారంభమైన అల్లర్లు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. షేక్ హసీనా తన ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసి ఇండియా పారిపోయినా, ముహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినా కూడా అక్కడ పరిస్థితి పూర్తిగా చక్కబడలేదు.
CM Siddaramaiah: మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) స్కాములో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. స్కామ్‌లపై విచారణకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అనుమతి ఇవ్వడంతో కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారియి. మైసూర్ నగరం అభివృద్ధి కోసం ప్రభుత్వం సేకరించిన భూమిలో సిద్ధరామయ్య భార్య పార్వతికి చెందిన భూమి ఉండటం,
Rajasthan: రాజస్థాన్ ఉదయ్‌పూర్ నగరం అట్టుడుకుతోంది. మతహింసతో ఆ నగరంలో హింసాత్మక వాతావరణం ఏర్పడింది. ఇద్దరి విద్యార్థుల మధ్య గొడవ ఆ తర్వాత మత విద్వేషాలకు కారణమైంది.
Doctors strike: కోల్‌కతాలో వైద్యురాలి అత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా వైద్యుల్లో ఆగ్రహావేశాలకు కారణమైంది. హత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా వైద్యులు సమ్మెకు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన సమ్మె ఆదివారం ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది.
Pakistan: మైనారిటీ హక్కులపై పాఠాలు చెప్పాలనుకునే దాయాది దేశం పాకిస్తాన్, తన దేశంలో జరుగుతున్న మైనారిటీ అణిచివేతను పట్టించుకోవడం లేదు. పలు అంతర్జాతీయ వేదికల్లో భారత్‌లో మైనారిటీల హక్కులు ఉల్లంఘన జరుగుతుందని పాకిస్తాన్ ఆరోపిస్తుంటుంది.