Venu Goapl Reddy
Author- NTV Telugu-
Odisha: బ్రాహ్మణ మహిళను పెళ్లి చేసుకున్న మాజీ ఎంపీ.. తెగ నుంచి బహిష్కరణ..
Odisha: ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్(బీజేడీ)కి చెందిన మాజీ గిరిజన ఎంపీ, గిరిజనేతర మహిళను పెళ్లి చేసుకోవడం వివాదంగా మారింది. మాజీ ఎంపీ ప్రదీప్ మాఝీ, సుశ్రీ సంగీత సాహూ అనే బ్రహ్మణ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి జరిగిన ఒక రోజు తర్వాత ఆయన కుటుంబాన్ని తెగ నుంచి బహిష్కరించారు. గోవాలో వివాహం జరిగిన ఒక రోజు తర్వాత ‘‘భటర సమాజ్ కేంద్ర కమిటీ’’ ఈ నిర్ణయం తీసుకుంది -
Bihar: ‘‘డ్యాన్స్ చేస్తావా లేదా సస్పెండ్ చేస్తా’’.. పోలీసులపై లాలూ కుమారుడి జులుం..
Bihar: బీహార్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్ హోలీ వేడుకలు వివాదాస్పదంగా మారాయి. శనివారం ఆర్జేడీ నేత తన మద్దతుదారులతో హోలీని జరుపుకుంటున్న సమయంలో, యూనిఫాంలో ఉన్న ఒక పోలీస్ అధికారి పట్ల వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. ఆయన చర్యలపై అధికార జేడీయూ, బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. -
Pakistan: పాక్‌లో వరస దాడులు.. బలూచిస్తాన్‌లో ఆర్మీ కన్వాయ్‌పై ఎటాక్..
Pakistan: పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్సులో మరోసారి దాడి జరిగింది. ఇప్పటికే జఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు హైజాక్ ఘటనలో పాకిస్తాన్ తన పరువును కోల్పోయింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) దెబ్బకు పాకిస్తాన్ ఆర్మీ వణికిపోతోంది. ఇదిలా ఉంటే, తాజాగా చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్) మార్గంలో పాకిస్తాన్ బలగాలకు చెందిన కాన్వాయ్ లక్ష్యంగా శక్తివంతమైన బాంబు పేలుడు సంభవించింది. ప్రస్తుతం వస్తున్న నివేదికల ప్రకారం, బహుళ సంఖ్యలో మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. అయితే, అక్కడి అధికారులు మాత్రం వివరాలను విడుదల చేయలేదు. -
Trump travel Ban: ట్రంప్ ట్రావెల్ బ్యాన్ విధించే 43 దేశాలు ఇవే.. మూడు జాబితాలు రెడీ..
మొత్తం 43 దేశాలపై ప్రయాణ ఆంక్షలు విధించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ దేశాలను 3 జాబితాలుగా వర్గీకరించారు. ఈ జాబితాలో పాకిస్తాన్, ఉత్తర కొరియా, రష్యా వంటి దేశాలు కూడా ఉన్నాయి. -
Rabies Deaths: దేశంలో పెరిగిన ‘‘రేబిస్’’ మరణాలు.. కుక్క కాటుతో ప్రతీ నెల నలుగురు మృతి
Rabies Deaths: భారతదేశంలో ‘‘రేబిస్ వ్యాధి’’ వల్ల మరణాలు పెరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఒక నివేదికలో.. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే 36 శాతం మరణాలు ఇండియాలోనే ఉంటున్నాయని చెప్పింది. అధికారిక గణాంకాల పరిశీలిస్తే.. దేశంలో నివేదించబడిన రేబిస్ కేసులు, మరణాలలో దాదాపుగా 30-60 శాతం 15 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలే ఎక్కుగా ఉంటున్నారని తేలింది. చాలా వరకు వీటిని పిల్లలు నివేదించకపోవడంతోనే మరణాలు సంభవిస్తున్నట్లు చెప్పింది. 2024 క్యాలెండర్ ఇయర్లో 5.19 […] -
Punjab: అమృత్సర్ ఆలయంపై బాంబు దాడి.. పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధం..
Punjab: శుక్రవారం అర్థరాత్రి పంజాబ్ అమృత్‌సర్‌లోని ఓ దేవాలయంలో శక్తివంతమైన పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి కిటికీ అద్ధాలు, గోడలు దెబ్బతిన్నాయి. ఖాండ్వాలా ప్రాంతంలోని ఠాకూర్ ద్వార ఆలయం వద్ద ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మోటార్ సైకిల్ప వచ్చి, ఆలయంపై పేలుడు పదార్థాలు విసిరి పారిపోతున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయ్యాయి. -
BJP: ‘‘ముస్లిం కాంట్రాక్టర్లకు 4 శాతం రిజర్వేషన్’’.. ‘‘కాంగ్రెస్ ఒక ముస్లింలీగ్’’
BJP: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం కాంట్రాక్టర్లకు 4 శాతం రిజర్వేషన్లు ప్రకటించడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ ఒక నిర్దిష్ట మత సమాజానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని మండిపడింది. కాంగ్రెస్‌ని ‘‘ఆధునిక ముస్లింలీగ్’’గా అభివర్ణించింది. కొన్ని రాజకీయ పార్టీలు బుజ్జగింపు రాజకీయాలు మాత్రమే చేస్తాయని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. -
Congress: “ఫడ్నవీస్‌ని పడగొడితే మీరే సీఎంలు”.. షిండే, పవార్లకు కాంగ్రెస్ ఆఫర్..
Congress: మహారాష్ట్ర కాంగ్రెస్ నేత, మాజీ పీసీసీ చీఫ్ నానా పటోలే సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతుంటే, శివసేన నేత ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ తమతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆఫర్ ఇచ్చారు. ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చివేసి ప్రతిపక్షంతో చేరితే షిండే, పవార్లు ఇద్దరికీ ముఖ్యమంత్రి పదవులు ఇస్తామని పటోలే శుక్రవారం అన్నారు. -
Ranya Rao Case: నన్ను చెంపపై 15 సార్లు కొట్టారు.. ఆకలితో ఉంచి, ఖాళీ పేపర్‌పై సంతకం చేయించారు..
Ranya Rao Case: సినీనటి రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం కర్ణాటకతో పాటు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దుబాయ్ నుంచి రూ. 12.56 కోట్ల విలువైన బంగారు కడ్డీలను ప్రత్యేకమైన బెల్టు సాయంతో నడుముకు చుట్టుకుని తీసుకువస్తుండగా, బెంగళూర్ ఎయిర్‌పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులకు పట్టుబడింది. ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్ కస్టడీలో ఉంది. ఈ కేసులో గోల్డ్ మాఫియా ఇన్వాల్వ్ అయినట్లు భావిస్తుండటంతో ఇటు ఈడీ, అటు సీబీఐ రెండూ దర్యాప్తు చేస్తున్నాయి. -
US Missile Strike: యూఎస్ మిస్సైల్ దాడి.. ‘‘ఐసిస్’’ అబు ఖదీజా హతం..
US Missile Strike: ఇస్లామిక్ స్టేట్(ISIS) ఉగ్రసంస్థని అమెరికా చావు దెబ్బ తీసింది. ఇరాన్‌లోని అల్ అన్బర్ ప్రావిన్స్‌లో జరిగిన ఖచ్చితమైన వైమానిక దాడిలో ‘‘అబు ఖదీజా’’ అని పిలిచే అబ్దుల్లా మక్కీ మస్లేహ్ అల్-రిఫాయ్‌ని హతమార్చినట్లు అమెరికా ప్రకటించింది. అబు ఖదీజా ఐసిస్ ఉగ్రవాద సంస్థ గ్లోబల్ ఆపరేషన్స్ చీఫ్‌గా ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఉగ్ర సంస్థ రెండవ-కమాండ్ పదవిలో ఉన్నాడు. మార్చి 13న జరిగిన దాడిలో మరో ఐసిస్ ఉగ్రవాది కూడా మరణించాడు. Read […]
తాజావార్తలు
-
Dhanush’s ‘OM’ : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ “ఓమ్”.. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
-
Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
-
Suriya – Mani Ratnam : 8ఏళ్ల క్రితం నాటి కథతో మణిరత్నం దర్శకత్వంలో సూర్య?
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
ట్రెండింగ్
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!