Bengaluru Techie Missing: ‘‘మీరు జైలులో పెట్టినా మంచిదే, నా భార్య వద్దకు మాత్రం వెళ్లను’’..
- బెంగళూర్ టెక్కీ విపిన్ గుప్తా మిస్సింగ్ సుఖాంతం..
- నోయిడాలోని ఓ మాల్‌లో చిక్కిన విపిన్..
- భార్య వద్దకు వెళ్లేందుకు ససేమిరా..
- ఆమె నా స్వేచ్ఛని హరిస్తోంది..
- జైలులో పెట్టినా మంచిదే కానీ అక్కడి వెళ్లను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru Techie Missing: ఇటీవల బెంగళూర్‌కి చెందిన టెక్కీ 37 ఏల్ల విపిన్ గుప్తా కనిపించకుండా పోయాడు. ఆ కేసు ఆ రాష్ట్రంలో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తన భర్తను కనుగొనాలని భార్య సోషల్ మీడియాలో ఏడుస్తూ సాయం కోరడం చర్చనీయాంశంగా మారింది. విపిన్ గుప్తా మిస్సింగ్‌పై ఆమె బెంగళూర్‌లోని కొడిగేహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా నమోదు చేసింది.
చివరకు మహిళ భర్త విపిన్ గుప్తా పోలీసులకు చిక్కాడు. నోయిడాలో ఓ షాపింగ్ మాల్ నుంచి బయటకు వస్తున్న అతడిని పోలీసులు పట్టుకున్నారు. అయితే, కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తనని గుర్తించకుండా విపిన్ గుప్తా తన రూపురేఖలు మార్చుకునేందుకు గుండు కొట్టించుకున్నాడు. బెంగళూర్ నుంచి వెళ్లిపోయాయ ఫోన్ స్విచ్ఛాప్ చేశాడు. అయితే, కొత్త సిమ్ కొనుగోలు చేసి ఆ ఫోన్‌లో వేయడంతో అతడిని పోలీసులు ట్రేస్ చేసి పట్టుకున్నారు.
Also Read
- Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
- Petrol-Diesel Price: హార్ముజ్‌లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
- India-Sri Lanka: భారత్‌కు వ్యతిరేకంగా ఆ పని ఎప్పటికీ చేయబోం.. స్పష్టం చేసిన శ్రీలంక అధ్యక్షుడు!
- Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
మొదట్లో బస్టాండ్, రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్టు్ల్లోని సీసీటీవీ ఫుటేజీలను చూసిన అతడిని కనుగొనలేకపోయారు. దాదాపుగా 10 రోజుల తర్వాత బుధవారం అతని ఆచూకీని గుర్తించారు. ముందుగా మాల్ వెలుపల సివిల్ డ్రెస్సుల్లో ఉన్న పోలీసులు విపిన్‌ని చుట్టుముట్టారు. పోలీసులని గుర్తించిన విపిన్ ఒక నవ్వు నవ్వి తర్వాత ఏంటని ప్రశ్నించినట్లు ఓ అధికారి చెప్పారు. తమతో బెంగళూర్ రావాలని అతని కోరామని, ఇందుకు అతను తీవ్రంగా వ్యతిరేకించినట్లు చెప్పారు. చాలా గంటల మాట్లాడి ఒప్పించిన తర్వాత విపిన్ అయిష్టంగానే బెంగళూర్ వచ్చాడు.
అయితే, పోలీసులతో తన బాధను పంచుకున్న తీరు ప్రస్తుతం హైలెట్ అవుతోంది. ‘‘మీరు నన్ను జైలులో పెట్టినా ఉంటానున, కానీ నేను తిరిగి రాను’’ అని అధికారులకు పదేపదే చెప్పినట్లు సమాచారం. శుక్రవారం బెంగళూర్ కెంపేగౌడ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత స్టేట్‌మెంట్ రికార్డ్ చేసి ఇంటికి వెళ్లేందుకు విపిన్‌ని అనుమతించారు. తాను తీవ్రమైన కుటుంబ సమస్యల్ని ఎదుర్కొన్నట్లు చెప్పాడు. తనపై తన భార్య నియంత్రణ ఎక్కువైనట్లు వివరించాడు. చిన్నచిన్న సమస్యలకు కూడా విమర్శలకు గురయ్యేవాడినని చెప్పాడు. తన వ్యక్తిగత స్వేచ్ఛని తన భార్య పరిమితం చేసిందని ఆరోపించాడు.
‘‘నేను ఆమెకు రెండో భర్తని, నేను ఆమెని మూడేళ్ల క్రితం కలిసినప్పుడు ఆమెకు అప్పటికే 12 ఏళ్ల కుమార్తె ఉంది. అయినా కూడా ఆమెని వివాహం చేసుకునేందుకు అంగీకరించాను. మాకు 8 నెలల కుమార్తె ఉంది. ఆమె నా స్వేచ్ఛని హరిస్తుంది. నా ప్లేట్ నుంచి ఒక్క అన్నం మెతుకు, చపాతీ ముక్క కిందపడిపోయినా అరుస్తుంది. నేను ఆమెకు నచ్చినట్లు బట్టలు వేసుకోవాలి. నేను చివరికి టీ తాగడానికి కూడా ఒంటరిగి వెళ్లలేను’’ అని పోలీసులకు చెప్పాడు. అతను బెంగళూర్ వదిలిన తర్వాత తిరుపతి, భువనేశ్వర్, ఢిల్లీ, నోయిడా వెళ్లినట్లు చెప్పాడు.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!