Saudi Arabia: సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్(ఎంబీఎస్)పై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారులపై సౌదీ యుద్ధాన్ని ప్రారంభించేందుకు ఎంబీఎస్ తన తండ్రి సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు సౌదీకి చెందిన మాజీ అధికారి ఒక నివేదికలో ఆరోపించారు.
Rahul Gandhi: లాటరల్ ఎంట్రీ వివాదంపై కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఆ విధానంపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఇది దళితులు, ఓబీసీలు, ఆదివాసీలపై దాడి అని సోమవారం అన్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వమే ఈ విధానాన్ని తీసుకువచ్చిందని బీజేపీ ఆరోపించింది. బీజేపీ రామరాజ్యాన్ని వక్రీకరించి, రాజ్యాంగాన్ని నాశనం చేయడానికి, బహుజనుల నుంచి రిజర్వేషన్లు లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని ఆయన ట్వీట్ చేశారు.
Kolkata Doctor Case: కోల్‌కతా ట్రైనీ వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటన యావద్ దేశాన్ని కుదిపేస్తోంది. ఈ కేసులో ఎన్నో అనుమానాలు వస్తున్నా్యి. చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిదని బాధితురాలి తల్లిదండ్రులు ఇప్పటికే ఆరోపించారు. మ
iPhone: ఐఫోన్‌కి ఉన్న క్రేజే వేరు, అప్పులు చేసైనా ఆ ఫోన్ కొనాలనుకునేవారు చాలా మందే ఉంటారు. తల్లిదండ్రులను వారి స్థోమత గురించి ఆలోచించకుండా పిల్లలు ఐఫోన్ కావాలని కోరుతుండటం చూస్తూనే ఉన్నాం. తాజాగా అలాంటి సంఘటనే జరిగింది. ఓ వ్యక్తి ఐఫోన్ కోసం తల్లిని బ్లాక్మెయిల్ చేసిన ఘటన వైరల్‌గా మారింది.
Jharkhand: ఎన్నికల ముందు జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జార్ఖండ్ ముక్తి మెర్చా(జేఎంఎం) సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి చంపాయి సోరెన్ బీజేపీలో చేరబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు చంపాయి సోరెన్ ఢిల్లీకి వెళ్లడం ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది.
Champai Soren: జార్ఖండ్ మాజీ సీఎం, జార్ఖండ్ ముక్తిమోర్చా(జేఎంఎం) పార్టీ కీలక నేత చంపాయి సోరెన్ బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన ఢిల్లీకి వెళ్లడం కూడా అనుమానాలను బలపరుస్తోంది.
Kolkata Doctor Case: కోల్‌కతా డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యాయం చేయాల్సిన ఆమెనే, న్యాయం కోసం రోడెక్కి ర్యాలీ చేయడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో ప్రభుత్వం, పోలీసుల నిర్లక్ష్యాన్ని కలకత్తా హైకోర్టు తూర్పారపడుతోంది. ఈ కేసుని సీబీఐకి అప్పగించింది.
ఇదిలా ఉంటే, ఈ కేసులో బాధితురాలి తల్లిదండ్రులు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. తమ కూతరు చనిపోయిన మొదటి రోజు నుంచే పోలీసులు వేధింపులు ప్రారంభయమ్యాయని, కుమార్తె మృతదేహం చూసేందుకు 3 గంటల పాటు అనుమతించలేదని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ఇది ఒక వ్యక్తి చేసిన సంఘటన కాదని, దీని వెనక ఇతరుల ప్రమేయం ఉందని బాధితురాలి తల్లి ఆరోపించారు. తమ కుమార్తె ఆరోగ్యం, ఆమె వద్ద దొరికిన మెడిసిన్స్‌పై దృష్టి సారించారని, కేసుని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
ఇదిలా ఉంటే, పంజాబ్‌కి చెందిన ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. డెహ్రాడూన్‌లో మంగళవారం సాయంత్రం పబ్లిక్ బస్సులో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆమె మొరాదాబాద్ నుంచి వస్తుండగా మంగళవారం డెహ్రాడూన్‌లోని ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్(ISBT) వద్ద ఘటన జరిగింది.
Mumbai: కోల్‌కతా వైద్యురాలి ఘటన మరవక ముందే దేశంలో పలు చోట్ల అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా డాక్టర్లపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ముంబైలోని సియోన్ ఆస్పత్రిలో మహిళా వైద్యురాలిపై ఓ రోగి, అతని బంధువులు మద్యం మత్తులో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. వీరిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.