Man swallows keys: బీహార్ మోతిహారికి చెందిన ఓ వ్యక్తి తాళంచెవి, కత్తి, రెండు నెయిల్ కట్టర్ని మింగేశాడు. ఆన్లైన్ గేమ్స్ ఆడేందుకు అతడి కుటుంబం నిరాకరించడంతో ఈ చర్యకు ఒడిగట్టాడు. పరిస్థితి తీవ్రంగా మారడంతో అతనికి వైద్యులు 1.5 గంటల పాటు శస్త్రచికిత్స చేసి, కడుపులో ఉన్న వస్తువుల్ని బయటకు తీశారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Sunita Williams: అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్ ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్)కి వెళ్లిన సునితా విలియమ్స్ మరో 6 నెలల పాటు అక్కడే ఉండబోతున్నట్లు నాసా చెప్పింది. సునితా విలియమ్స్ జూన్ 5న ఫ్లోరిడా నుంచి స్టార్‌లైనర్ స్పేస్ క్యాప్సూల్‌లో అంతరిక్షంలోకి వెళ్లింది.
PM Modi: దాయాది దేశం పాకిస్తాన్ భారత ప్రధాని నరేంద్రమోడీకి ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 15-16 తేదీల్లో ఇస్లామాబాద్‌లో జరగబోతున్న షాంఘై కోఆపరేషణ్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (సిహెచ్‌జి) సమావేశానికి పాకిస్తాన్ పీఎం మోడీతో పాటు ఇతర నాయకులను ఆహ్వానించినట్లు సమాచారం.
Pakistan: పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సుల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తు్న్న బస్సు కాలువలో పడిపోవడంతో 29 మంది మరణించారు. ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది.
Kiren Rijiju: ‘‘మిస్ ఇండియా’’ పోటీల్లో దళితులు, ఆదివాసీలు లేరంటూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సెటైర్లు వేస్తోంది. ఆయన చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు కేవలం ‘‘బాల బుద్ధి’’ నుంచి మాత్రమే వస్తాయని ఆయన అన్నారు.
Mamata Banerjee: కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో 31 ఏళ్ల పీజీ ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య జరిగింది. ఈ దారుణ ఘటనపై యావత్ దేశం అట్టుడుకుతోంది. ముఖ్యంగా వైద్యులు బాధితురాలికి న్యాయం జరిగాలని ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ కేసులో ప్రభుత్వ నిర్లక్ష్యం, పోలీసుల వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ కలకత్తా హైకోర్టు ఈ కేసుని సీబీఐకి బదిలీ చేసింది. ఈ రోజు సుప్రీంకోర్టు కూడా ఈ కేసులో బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Lateral Entry Row: బ్యూరోక్రసీలో లాటరల్ ఎంట్రీకి సంబంధించిన ప్రకటనను రద్దు చేయాలని కోరుతూ కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఈరోజు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్సి) అధిపతికి లేఖ రాశారు. ఇటీవల యూపీఎస్సీ కేంద్ర ప్రభుత్వంలోని వివిధ ఉన్నత స్థానాలకు లాటరల్ ఎంట్రీ నియామకాల కోసం ‘‘ప్రతిభావంతులైనవారిని’’ కోరుతూ ఒక ప్రకటన విడుదల చేసింది. 24
Supreme Court: లైంగిక వేధింపుల కేసులో నిందితుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదల చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు కొట్టేసింది. గతేడాది ఈ కేసులో యుక్తవయసులోని బాలికను ‘లైంగిక ప్రేరేపణలను నియంత్రించుకోవాలి’’ అని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.
Supreme Court: కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో 31 ఏళ్ల వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన యావద్ దేశాన్ని షాక్‌కి గురిచేస్తోంది. ఈ ఘటనలో బాధితురాలికి న్యాయం జరగాలని డాక్టర్లు, సాధారణ ప్రజలు ఆందోళన నిర్వహిస్తున్నారు.
Supreme Court: కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం, హత్య కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ రోజు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్‌లు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాల త్రిసభ్య ధర్మాసనం విచారిస్తోంది. ఈ కేసులో ఆర్జి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జరిగిన 31 ఏళ్ల పీజీ ట్రైనీ డాక్టర్‌పై ఆగస్టు 9న దారుణమైన అత్యాచారం జరిగింది.