Lateral Entry Row: ప్రతిపక్షాల ఒత్తిడి తర్వాత లాటరల్ ఎంట్రీపై కేంద్రం యూ-టర్న్..
- వివాదాస్పదంగా ‘‘లాటరల్ ఎంట్రీ’’ నియామకాలు..
- ప్రతిపక్షాల ఒత్తిడితో కేంద్రం యూ-టర్న్..
- ప్రకటన రద్దు చేయాలని యూపీఎస్‌సీకి కేంద్రమంత్రి లేఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lateral Entry Row: బ్యూరోక్రసీలో లాటరల్ ఎంట్రీకి సంబంధించిన ప్రకటనను రద్దు చేయాలని కోరుతూ కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఈరోజు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్‌సి) అధిపతికి లేఖ రాశారు. ఇటీవల యూపీఎస్‌సీ కేంద్ర ప్రభుత్వంలోని వివిధ ఉన్నత స్థానాలకు లాటరల్ ఎంట్రీ నియామకాల కోసం ‘‘ప్రతిభావంతులైనవారిని’’ కోరుతూ ఒక ప్రకటన విడుదల చేసింది. 24 మంత్రిత్వ శాఖల్లో జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్, డిప్యూటీ సెక్రటరీ వంటి 45 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ శాఖల్లో స్పెషలిస్టు(ప్రైవేట్ రంగానికి చెందిన వారితో సహా) నియామకం కోసం నోటిఫికేషన్ వెలువడింది. భారతదేశ పరిపాలన యంత్రాంగం, సామర్థ్యాన్ని, ప్రతిస్పందనను పెంచేందుకు నిపుణుల అవసరాన్ని గుర్తించడం ద్వారా ప్రధాని నరేంద్రమోడీ హయాంలో లాటరల్ ఎంట్రీ పథకాన్ని అధికారికంగా ప్రవేశపెట్టారు.
Also Read
అయితే, దీనిపై కాంగ్రెస్‌తో సహా అన్ని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉన్నత పదవుల్లో కేంద్రం ఆర్ఎస్ఎస్ వ్యక్తుల్ని తీసుకురావాలని అనుకుంటోందని మండిపడ్డారు. ఈ చర్య ఓబీసీలు, దళితులు, ఆదివాసీలకు దెబ్బగా అభివర్ణించారు. ప్రతిపక్షాల నుంచే కాకుండా మిత్రపక్షాల నుంచి కూడా అభ్యంతరాలు రావడంతో కేంద్రం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
లాటరల్ ఎంట్రీ ప్రకటనని రద్దు చేయాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోడీ ఆదేశాలతో యూపీఎస్సీ చైర్ పర్సన్ ప్రతీ సుడాన్‌కి కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ లేఖ రాశారు. రాజ్యాంగంలోని సమానత్వం, సామాజిక న్యాయ సూత్రాలకు అనుగుణంగా లాటరల్ ఎంట్రీ ప్రవేశాలు అవసరం అని, ముఖ్యంగా రిజర్వేషన్ల విషయంలో అని ఆయన లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ‘‘చారిత్రక అన్యాయాలను పరిష్కరించడం మరియు కలుపుకొనిపోవడాన్ని ప్రోత్సహించే లక్ష్యం మా సామాజిక న్యాయ ఫ్రేమ్‌వర్క్‌కు మూలస్తంభం’’ అని మోడీ భావిస్తున్నారని సింగ్ అన్నారు.
“ఈ స్థానాలను స్పెషలైజ్డ్‌గా పరిగణించి, సింగిల్ కేడర్ పోస్టులుగా నియమించారు కాబట్టి, ఈ నియామకాలలో రిజర్వేషన్‌కు ఎటువంటి నిబంధన లేదు” అని లేఖలో పేర్కొన్నారు. సామాజిక న్యాయంపై ప్రధాని దృష్టి సారించిన నేపథ్యంలో ఈ అంశాన్ని సమీక్షించి, సంస్కరించాల్సిన అవసరం ఉందన్నారు. లాటరల్ ఎంట్రీ రిక్రూట్‌మెంట్ కోసం ప్రకటనను రద్దు చేయాలని తాను యూపీఎస్‌సీని కోరుతున్నానని, ఈ దశ సామాజిక న్యాయం మరియు సాధికారత సాధనలో గణనీయమైన పురోగతి అవుతుందని చెప్పారు.
తాజావార్తలు
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు!
-
The Paradise: టైటిల్లోనే కాదు.. ‘పుష్ప’, ‘పెద్ది’, ‘ప్యారడైజ్’ కథల్లోనూ ఒకే కనెక్షన్.. సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా ?
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!