PM Modi-Putin telephonic call: ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో టెలిఫోన్లో మాట్లాడారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఇటీవల జరిగిన ఉక్రెయిన్ పర్యటనపై ఇరు నేతలు చర్చించారు.
Benjamin Netanyahu: ఇజ్రాయిల్, లెబనాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ రోజు ఉదయం ఇజ్రాయిల్ లెబనాన్‌లోని హిజ్బుల్లా మిలిటెంట్లపై వైమానిక దాడితో విరుచుకుపడింది. మరోవైపు హిజ్బుల్లా కూడా ఇజ్రాయిల్ ఉత్తర భాగంపై రాకెట్లు , డ్రోన్లతో దాడులు చేసింది. అయితే, హిజ్బుల్లా దాడుల్ని సమర్థవంతంగా అడ్డుకున్నట్లు ఇజ్రాయిల్ తెలిపింది. ఇదిలా ఉంటే ఆదివారం జరిగిన దాడి చివరిది కాదని ఇజ్రాయిల్ పీఎం బెంజమిన్ నెతన్యాహూ లెబనాన్, హిజ్బుల్లాను హెచ్చరించారు.
Shiekh Hasina: రిజర్వేషన్ కోటా రద్దు ఆందోళనలు చివరకు బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి, ఇండియా పారిపోయేలా చేశాయి. ప్రస్తుతం మహ్మద్ యూనస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. షేక్ హసీనా దేశం వదిలినప్పటి నుంచి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమెపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా షేక్ హసీనాతో పాటు ఆమె మాజీ కేబినెట్ మంత్రులు, సహాయకులపై మరో నాలుగు హత్య కేసులు నమోదు అయ్యాయని ఆదివారం మీడియా నివేదికలు తెలిపాయి.
Crime: ఆవేశంతో 16 ఏళ్ల బాలుడు తన తండ్రిని హత్య చేసిన ఘటన ఢిల్లీలోని రోహిణిలో జరిగింది. తండ్రిని హత్య చేసినందుకు బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఆదివారం పోలీసులు వెల్లడించారు. బాలుడు తన తండ్రి తలపై ప్లాస్టిక్ పైపుతో కొట్టడంతో మరణించాడని పోలీసులు తెలిపారు.
Actor Darshan: కన్నడ స్టార్ దర్శన్ తన అభిమాని రేణుకాస్వామిని హత్య చేసిన కేసులో జైలులో ఉన్నాడు. అయితే, అతడికి జైలులో వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Malayalam cinema: మలయాళ సినీ పరిశ్రమలో మహిళా వేధింపులపై ఇటీవల హేమా కమిటి సమర్పించిన నివేదిక సంచలనంగా మారింది. కొందరు అగ్ర నటులుపై వచ్చిన ఆరోపణలు ప్రకంపలను రేపుతున్నాయి. మలయాళ పరిశ్రమలో మహిళా నటులపై కమిట్మెంట్ల పేరుతో వేధింపులు జరిగినట్లు కమిటీ తన నివేదికలో పేర్కొంది. అయితే, పరిశ్రమపై వస్తున్న ఆరోపణలను దర్యాప్తు చేసేందుకు కేరళ ప్రభుత్వం సిద్ధమైంది. మహిళా ఐఏఎస్ అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేయాలని పినరయి విజయన్ సర్కార్ ఆదివారం నిర్ణయించింది.
Punjab: మతమౌఢ్యానికి ఓ వ్యక్తి బలయ్యాడు. పంజాబ్ గురుదాస్‌పూర్ జిల్లాలో 30 ఏళ్ల వ్యక్తి దెయ్యం వదిలిస్తానని చెబుతూ ఓ పాస్టర్, అతని 8 మంది సహచరులు సదరు వ్యక్తిని దారుణంగా కొట్టారు. అతని శరీరం నుంచి దెయ్యాన్ని వదిలించడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంటూ కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడైన పాస్టర్‌పై కేసు నమోదు చేశారు.
Insurance Money: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భార్యభర్తలు దారుణంగా ఒక వ్యక్తి హత్యకు పాల్పడ్డారు. వ్యాపారంలో నష్టాలను అధిగమించేందుకు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ వ్యాపారవేత్త తనలాగే కనిపించే వ్యక్తిని హత్య చేసి, ప్రమాదంగా చిత్రీకరించాడు. చివరకు కుట్ర బయపటడటంతో అరెస్టయ్యాడు.
Delhi: వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రస్తుతం ఢిల్లీలో అధికారంలో ఉంది. అయితే, తాజాగా ఆ పార్టీ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆప్‌కి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు ఈ రోజు బీజేపీలో చేరారు. బీజేపీ అగ్ర నేతలు రాంవీర్ సింగ్ బిధూరి, అరవిందర్ సింగ్ లవ్లీ, యోగేంద్ర చందోలియా సమక్షంలో వారంతా కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.
Howrah murder: అక్రమ సంబంధాలు పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. చాలా వరకు కేసుల్లో భార్యలు తమ ప్రియులతో కలిసి భర్తల్ని హతమారుస్తున్నారు. క్షణకాలం సుఖాల కోసం హత్యలకు పాల్పడటం కాకుండా, పిల్లల్ని ఒంటరివాళ్లను చేస్తు్న్నారు. తాము ఎంతో తెలివిగలవారమని భావించి పక్కా ప్లాన్‌తో హత్యలు చేస్తున్నప్పటికీ, పోలీసుల నుంచి తప్పించుకోలేమనే నిజాన్ని మరిచిపోతున్నారు.