Sunita Williams: అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్.. మరో 6 నెలల తర్వాతే భూమి పైకి..
- అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్..
- మరో 6 నెలల తర్వాతే భూమి పైకి..
- స్పేస్ ఎక్స్ క్రూ-9 ద్వారా రిటర్న్ జర్నీ..
- అప్పటి వరకు ఐఎస్ఎస్‌లోనే సునీతా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunita Williams: అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్ ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్)కి వెళ్లిన సునితా విలియమ్స్ మరో 6 నెలల పాటు అక్కడే ఉండబోతున్నట్లు నాసా చెప్పింది. సునితా విలియమ్స్ జూన్ 5న ఫ్లోరిడా నుంచి స్టార్‌లైనర్ స్పేస్ క్యాప్సూల్‌లో అంతరిక్షంలోకి వెళ్లింది. అయితే, స్టార్‌లైనర్‌లో ప్రొపల్షన్ సిస్టమ్ సమస్యలు ఏర్పడటంతో వారు భూమికి రాలేకపోయారు. స్పేస్ క్యాప్సుల్‌లో లీక్స్ ఏర్పడ్డాయి. థ్రస్టర్లు విఫలమయ్యాయి. అయితే, వీటిని సరి చేసేందుకు నిపుణులు ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేదని తెలుస్తోంది. దీంతో వారి సునితా విలియమ్స్‌తో పాటు మరికొందరి వ్యోమగాముల స్పేష్ మిషన్ కొన్ని నెలల పాటు పొడగించనున్నారు.
ప్రయోగం తర్వాత 8 రోజుల్లోనే భూమిపైకి తిరిగి రావాలని అనుకున్నప్పటికీ స్టార్‌లైనర్ స్పేస్ క్యాప్సుల్‌లో అవాంతరాలతో వారు మరికొన్ని రోజులు ఐఎస్ఎస్‌లోనే గడపనున్నారు. సునితా విలియమ్స్‌తో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ లేకుండానే స్టార్ లైనర్ భూమికి వస్తుందని నాసా శుక్రవారం ప్రకటించింది. ఆరు నెలల పాటు అంటే ఫిబ్రవరి 2025 వరకు వీరిద్దరు అంతరిక్షంలో ఉండబోతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎలాన్ మస్క్‌కి చెందిన ‘‘స్పేస్ ఎక్స్’’ క్రూ-9 వెహికిల్ ద్వారా భూమిపైకి తిరిగి వస్తారు.
Also Read
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
Read Also: Mallikarjun Kharge: కేంద్రం తగ్గింది.. “యూపీఎస్ లో ‘యూ’ అంటే మోడీ ప్రభుత్వం యూ-టర్న్”
ఇదిలా ఉంటే స్టార్‌లైనర్‌లో అంతరాయాలు బోయింగ్ సంస్థకు భారీ నష్టాలను మిగిల్చియా. దీని నష్టాలు 1 బిలియన్ డాలర్లకు మించి ఉన్నాయని సీఎన్‌బీసీ నివేదించింది. నాసా వ్యోమగాముల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడంతో రిటర్న్ మిషన్ కోసం స్పేస్ ఎక్స్‌కి ప్రాధాన్యత ఇచ్చింది. అయితే, ఖాళీగా స్టార్‌లైనర్‌ని భూమికి తిరిగి తీసుకురావడానికి సరైన సమయం కోసం నాసా దాని ఫ్లైట్ రెడీనెస్ రివ్యూకి సంబంధించిన అదనపు దశల్ని నిర్వహిస్తోంది.
అత్యవసర సిబ్బందిని తిరిగి తీసుకురావడానికి స్టార్‌లైనర్ సురక్షితంగా ఉందని బోయింగ్ హామీ ఇచ్చినప్పటికీ, నాసా అంగీకరించలేదు. అయితే, నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ బోయింగ్‌కి మద్దతిచ్చారు. భవిష్యత్తులో స్టార్‌లైనర్ మళ్లీ ప్రారంభించబడుతుతందని తాను 100 శాతం నమ్ముతున్నానని పేర్కొన్నారు. నాసా అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ కెన్ బోవర్‌సాక్స్ మాట్లాడుతూ, సిబ్బందిని ఇంటికి తీసుకురావడానికి స్పేస్‌ఎక్స్‌ను ఎంచుకునే నిర్ణయంలో నాసా అధికారులు ఏకగ్రీవంగా ఉన్నారని చెప్పారు.
తాజావార్తలు
-
Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
ట్రెండింగ్
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?