Rajasthan: ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో మత ఘర్షణలకు కారణమైంది. ప్రభుత్వ పాఠశాలో పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలుడు దేవరాజ్ అనే బాలుడిపై మైనారిటీ వర్గానికి చెందిన మరో బాలుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన తర్వాత నగర వ్యాప్తంగా మతపరమైన హింస చోటు చేసుకుంది. గాయపడిన బాలుడు నాలుగు రోజుల చికిత్స తర్వాత ఈ రోజు మరణించాడు.
UP News: ఉత్తర్ ప్రదేశ్ హర్దోయ్‌లో దారుణం జరిగింది. సోదరుడికి రాఖీ కట్టేందుకు పుట్టింటికి వెళ్తా అని పట్టుబట్టడంతో ఓ భర్త, భార్యపై దారుణానికి ఒడిగట్టాడు.
ఈ నేపథ్యంలో ఎంపాక్స్ ముప్పును ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ వార్డుల ఏర్పాటుతో పాటు విమానాశ్రయాల్లో అప్రమత్తత ప్రకటించడంతో సహా ప్రభుత్వం అనేక ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. దద్దుర్లు ఉన్న రోగులను గుర్తించి ఐసోలేషన్ వార్డులను తరలించాలని ప్రభుత్వం ఆస్పత్రిని ఆదేశించింది.
PM Modi Ukraine visit: ప్రధాని మోడీ పోలాండ్, ఉక్రెయిన్ పర్యటనలకు వెళ్లబోతున్నారు. ఆగస్టు 21న పోలాండ్ దేశంలో, ఆగస్టు 23న ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇటీవల రష్యాలో పర్యటించిన మోడీ, తాజాగా ఉక్రెయిన్ వెళ్లబోతున్నారు.
Assembly Elections: ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. లోక్‌సభ ఎన్నికలు జరిగి,
Congress leader: కర్ణాటక గవర్నర్ థాపర్ చంద్ గెహ్లాట్ ‘‘బంగ్లాదేశ్’’ తరహా పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని కాంగ్రెస్ నేత ఇవాన్ డిసౌజా బెదిరించడం వివాదాస్పదంగా మారింది. ముడా స్కామ్ కేసులో సీఎం సిద్ధరామయ్యపై గవర్నర్ విచారణకు ఆదేశించారు. దీనిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిసౌజా గవర్నర్‌ని హెచ్చరిస్తూ వ్యాఖ్యలు చేశారు.
Hezbollah: గత నెలలో హిజ్బుల్లా సీనియర్ కమాండర్, కీలక నేత ఫువాద్ షుక్ర్ని ఇజ్రాయిల్ వైమానిక దాడిలో హతమార్చింది. అయితే, ఈ ఆపరేషన్ కోసం ఇజ్రాయిల్ షుక్ర్కి తెలివిగా ఉచ్చు బిగించింది. లెబనాన్ రాజధాని బీరూట్‌లో ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న షుక్ర్ని ‘‘ టెలిఫోన్ కాల్’’ మట్టుపెట్టేలా చేసింది. నిజానికి హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థని రాకెట్ ఫోర్స్‌గా తీర్చిదిద్దిన ఘటన ఇతనికే చెల్లుతుంది. అయితే, అతడి గుర్తింపును మా
బీజేపీ మమతా బెనర్జీని ‘‘నిర్మమతా బెనర్జీ’’గా పేర్కొంది. ఈ భయంకరమైన సంఘటన తర్వాత ఆమె పేరు మార్చాలని దుయ్యబట్టింది. బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మీడియాతో మాట్లాడుతూ.. మమతా బెనర్జీ వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆమె ‘విధ్వంసకురాలి’’గా మారారని అన్నారు. ఆమె తన దుశ్చర్యలతో సమాజానికి సేవ చేస్తున్న ఒక మహిళా డాక్టర్ గౌరవాన్ని నాశనం చేశారని అన్నారు.
Kolkata Doctor Case: కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో 31 ఏళ్ల పీజీ ట్రైనీ మహిళా డాక్టర్‌పై దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది. ఈ ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ని సీబీఐ గత రెంమూడు రోజులుగా విచారిస్తోంది. విచారణ కోసం ఈ రోజు కూడా సీబీఐ…
Kolkata doctor case: కోల్‌కతా డాక్టర్ హత్యాచారం ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. నిందితుడు సంజయ్ రాయ్ ‘‘పాలిగ్రాఫ్ టెస్ట్’’ నిర్వహించాలని సీబీఐ పిటిషన్‌కి కలకత్తా హైకోర్టు అనుమతి ఇచ్చింది. కోల్‌కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో గత శుక్రవారం 31 ఏళ్ల వైద్యురాలిపై దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది.