S Jaishankar: జమ్మూ కాశ్మీర్ విషయంలో భారత్ రాజీ పడే పరిస్థితే లేదని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కుండబద్దలు కొట్టారు. సరిహద్దుల్లో సానుకూల, ప్రతికూల పరిస్థితుల్లో భారత్ స్పందిస్తుందని అన్నారు. దాయాది దేశంతో ‘‘అంతరాయం లేని చర్చల’’ యుగం ముగిసిందని చెప్పారు.
Love: ప్రేమ ఈ భావన మానవ సంబంధాలను సరికొత్త స్థాయికి తీసుకెళ్తుంది. అయితే, ఈ ప్రేమ అనే భావన మానవ మెదడులోని ఏ భాగాలను ప్రభావితం చేస్తుందనే విషయాలపై శాస్త్రవేత్తలు అధ్యయనంలో కీలక విషయాలను తెలుసుకున్నారు. ప్రేమ అనే భావన మెదడులోని వివిధ భాగాలను ప్రేరేపితం చేస్తుందని తెలిసింది.
Assam: యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేసే దిశగా అస్సాంలోని హిమంత బిశ్వ సర్మ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. అస్సాం అసెంబ్లీ గురువారం రాష్ట్రంలోని ముస్లిం వివాహాలు-విడాకులుకు సంబంధించి పాత చట్టాన్ని తొలగించి, వివాహాలు విడాకులకు ప్రభుత్వ నమోదును తప్పనిసరి చేసే బిల్లును ఆమోదించింది.
Pakistan: పాకిస్తాన్ తన సమస్యల నుంచి దృష్టిని మళ్లించేందుకు కాశ్మీర్‌ని సాధనంగా వాడుకుంటోంది. అ దేశంలో ప్రజలు తినడానికి తిండి లేకున్నా, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా కూడా ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా కాశ్మీర్ తమ ప్రాధాన్యత ఎజెండాగా ఉంచుతోంది.
Hurun India Rich List: ఎక్కువ మంది ధనవంతులు ఏ రాశుల వారు ఉంటారు..? ఏ రాశి వారు వ్యాపారాల్లో రాణించగలుగుతారు అనేవి క్లిష్టమైన ప్రశ్నలు. అయితే, తాజాగా హూరన్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం మాత్రం కొన్ని రాశుల వారి సంపాదన పెరిగినట్లు సూచిస్తోంది. ముఖ్యం ధనాన్ని ఆకర్షించిన రాశుల్లో కర్కాటకం తొలిస్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాతి స్థానాల్లో మిథునం, సింహ రాశులు వారు ఉన్నారు. ఇక ఎక్కువ మంది ధనవంతులు ఉన్న రాశుల్లో […]
Kolkata doctor case: కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. నైట్ డ్యూటీలో ఉన్న 31 ఏళ్ల ట్రైనీ వైద్యురాలిపై అత్యంత దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది.
Hurun India List: హూరన్ ఇండియా రిచ్ లిస్ట్-2024 విడుదలైంది. ఈ జాబితాలో ముఖేష్ అంబానీని దాటేసి గౌతమ్ అదానీ ఇండియాలోనే అత్యంత ధనవంతుడిగా టాప్-1 స్థానానికి చేరుకున్నాడు. ఇదిలా ఉంటే, భారతదేశంలోనే కాదు, మొత్తం ఆసియాలోనే ‘‘బిలియనీర్ల రాజధాని’’గా ముంబై నిలిచింది. ముంబై కేవలం ఇండియాలోనే కాదు, ఆసియాలో సత్తా చాటింది. చైనా రాజధాని బీజింగ్‌ని దాటేసి తొలిస్థానంలో నిలిచింది. ముంబైలో సంపన్న నివాసితుల సంఖ్యలో 386కి చేరుకుంది. ఇండియాలో ముంబై తర్వాత రెండో స్థానంలో […]
Condom Use: యూరప్ దేశాల్లో లైంగికంగా చురుకుగా ఉండే టీనేజర్లలో కండోమ్‌ల వాడకం గత దశాబ్ధ కాలంగా తగ్గుతోందని, అసురక్షితమైన సెక్స్ రేట్ పెరగడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. కండోమ్‌ల వాడకం తగ్గడం వల్ల లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు(STIs), ప్రణాళిక లేని గర్భాలు ప్రమాదాలను పెంచుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ యూరప్ ఒక ప్రకటనలో తెలిపింది.
Kaivalya Vohra: హూరన్ రిచ్ లిస్ట్ -2024 దేశంలో అత్యంత ధనవంతుల జాబితాను ప్రకటించింది. గౌతమ్ అదానీ ఈ జాబితాలో టాప్ ప్లేస్‌లో నిలిచారు. ముఖేష్ అంబానీ రెండో స్థానంలో ఉన్నారు. అయితే, ఈ జాబితాలో ఓ పేరు మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. కౌవల్య వోహ్రా.. 21 ఏళ్ల ఈ కుర్రాడి సంపద రూ. 3600 కోట్లు. హూరన్ రిపోర్టులో అత్యంత చిన్న వయసు కలిగిన ధనవంతుడిగా నిలిచారు.
ఇదిలా ఉంటే, ఈ ఘటనపై బెంగాల్ వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనల్ని మమతా బెనర్జీ అణిచివేసేందుకు ప్రయత్నిస్తోంది. బుధవారం జరిగిన నిరసనల్లో ఆందోళనకారులపై పోలీసులు టియర్ గ్యాస్, లాఠీచార్జ్ ప్రయోగించారు. దీనిపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మమతా బెనర్జీపై బీజేపీ విమర్శల దాడిని ఎక్కువ చేసింది.