Mohan Bhagwat: బీజేపీ సైద్ధాంతిక గురువు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్‌కి కేంద్రం భద్రతను పటిష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న ‘‘జెడ్-ప్లస్’’ కేటగిరి నుంచి మరింత పటిష్టమైన అధునాతన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తూ ఏఎస్ఎల్ ప్రోటోకాల్‌కి భద్రతను పెంచారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి సమానంగా భగవత్‌కి భద్రతను అప్‌గ్రేడ్ చేశారు. ప్రస్తుతం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) సిబ్బంది మోహన్ భగవత్‌కి భద్రతను అందిస్తోంది.
Wolf attack: ఉత్తర ప్రదేశ్ బహ్రైచ్ జిల్లాలో తోడేళ్లు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తోడేళ్ల దాడుల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. జిల్లాలో తోడేళ్ల దాడిలో ఓ చిన్నారి మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఖారీపైర్‌లోని ఛత్తర్‌పూర్‌లో సోమ, మంగళవారం మధ్యరాత్రి 3,6,9 ఏళ్లు కలిగిన ముగ్గురు పిల్లలపై దాడి చేసినట్లుగా అధికారులు తెలిపారు. అధికారులు సంఘటన స్థలానికి చేరుకునేలోపే తోడేళ్లు సమీపంలోని రాయ్‌పూర్ గ్రామానికి వెళ్లాయని, అక్కడ 5 ఏళ్ల చిన్నారిని ఇంటి నుంచి పట్టుకెళ్లాయని చెప్పారు.
ఇప్పటి వరకు లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి మొత్తం 17 కేసులు నమోదయ్యాయి. ఈ పరిణామాలు మలయాల మూవీ ఆర్టిస్ట్ అసోసియేటన్ ‘‘అమ్మ’’ రద్దుకు దారి తీశాయి. ఈ వేధింపుల ఆరోపణల్లో పలువురు నటులని, నిర్మాతని ప్రశ్నించే అవకాశం ఉంది. 2013లో ఓ సినిమా సెట్లో ఒక నటుడు తనను వేధించాడని నటి సోనియా మల్హార్ తాజాగా ఫిర్యాదు చేశారు. కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)కి ఆమె ఫిర్యాదు చేశారు.
Kolkata rape-murder Case: కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రి ఘటన యావద్ దేశాన్ని షాక్‌కి గురిచేసింది. నైట్ డ్యూటీలో ఉన్న 31 ఏళ్ల పీజీ ట్రైనీ వైద్యురాలిపై అత్యంత దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది. ఈ ఘటనపై దేశంలోని డాక్టర్లు, సాధారణ ప్రజలు ఆందోళన, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
Cabinet Decisions: దేశవ్యాప్తంగా కొత్తగా 12 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వీటి ద్వారా 10 లక్షల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. కేబినెట్ సమావేశం తర్వాత మాట్లాడిన ఆయన.. ‘‘నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీలకు క్యాబినెట్ ఈ రోజు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం రూ. 28,602 కోట్లు పెట్టుబడి పెడుతుంది.’’ అని చెప్పారు.
Doctors safety: కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, ఆస్పత్రి ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. నైట్ డ్యూటీలో ఉన్న 31 ఏళ్ల వైద్యురాలిపై అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన డాక్టర్ భద్రను ప్రశ్నార్థకంగా మార్చింది.
Champai Soren: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ బీజేపీలో చేరడం ఖరారైంది. బీజేపీలో చేరాలనే తన నిర్ణయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆయన ప్రకటించారు. గిరిజనుల కోసం పోరాడే ఏకైక పార్టీ బీజేపీనే అని అన్నారు. సంతాల్ పరగణాలో గిరిజనులు గుర్తింపును రక్షించేందుకు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్ షాలపై విశ్వాసం వ్యక్తం చేసిన ఆయన, గిరిజన హక్కుల కోసం పాటుపడాలని తన మద్దతుదారుల్ని కోరారు. చంపాయ్ సోరెన్ ఆగస్టు 30న బీజేపీలో చేరనున్నారు.
Bihar: బీహార్ అరారియాలో ఓ వ్యక్తి ప్రైవేట్ పార్ట్‌లో కారం పొడి పోసి దాడి చేయడం వైరల్‌గా మారింది. ఈ ఘటనలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగతనానికి పాల్పడ్డాడనే అభియోగంపై కొందరు బాధితుడి చేతులు వెనకకు కట్టి, ప్యాంట్ విప్పి, అతడి ప్రైవేట్ పార్టులో కారం పోసి, కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీడియోలో కనిపిస్తున్న మహ్మద్ సిఫత్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Crime: మహిళలు, బాలికలపై అత్యాచారాలు ఆగడం లేదు. దేశంలో ఎక్కడో చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. మహారాష్ట్ర థానే జిల్లాలో 13 ఏళ్ల మైనర్ బాలికపై 28 ఏళ్ల నిందితుడు పదే పదే అత్యాచారానికి ఒడిగట్టాడు. నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. భివాండిలోని న్యూ ఆజాద్ నగర్ ప్రాంతానికి చెందిన నిందితుడి పొరుగింటిలోనే బాలిక ఉండేది.
Actor Darshan: రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్మన్ బెంగళూర్‌లోని పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. అయితే, ఇటీవల జైలు పరిసరాల్లో దర్శన్ సిగరేట్ తాగుతూ వీఐపీ ట్రీట్మెంట్ పొందుతున్న ఫోటో వైరల్‌గా మారడం వివాదమైంది. దీంతో పలువురు జైలు అధికారుల్ని సీఎం సిద్ధరామయ్య ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.