Menstrual Cramps: రుతుక్రమ నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు ఓ యువతి ట్యాబ్లెట్లు వేసుకోవడం ఆమె ప్రాణాలను తీసింది. ఈ ఘటన తమిళనాడు లోని తిరుచ్చి జిల్లాలో జరిగింది. ముసిరి తాలూకా సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 18 ఏళ్ల యువతి రుతుక్రమంలో నొప్పి నివారణకు మెడిసిన్స్ తీసుకుంది. తీవ్రమైన కడుపు నొప్పిని తగ్గించే ప్రయత్నంలో ఎక్కువ ట్యాబ్లెట్లను వేసుకుంది. ఇది ఆమె ప్రాణాలనపు తీసింది. ఈ విషాద ఘటన ఆగస్టు 21న తిరుచ్చిలోని పులివలం ప్రాంతంలో చోటు చేసుకుంది.
Punjab Ex MP: నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై పంజాబ్ మాజీ ఎంపీ సిమ్రంజిత్ సింగ్ మాన్ అవమానకర వ్యాఖ్యలు చేయడంతో గురువారం వివాదం చెలరేగింది. రైతుల నిరసనల్లో అత్యాచారాలు జరిగాయని కంగనా ఆరోపించడంతో వివాదం మొదలైంది. ఈ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ శిరోమణి అకాలీదళ్(అమృత్ సర్) నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
Gautam Adani: గౌతమ్ అదానీ దేశంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని అధిగమించి అగ్రస్థానంలో నిలిచారు. 2024 హూరన్ ఇండియా రిచ్ లిస్టులో గౌతమ్ అదానీ అతడి కుటుంబం మొత్తం ఆస్తుల విలువ రూ. 11.6 లక్షల కోట్లుగా ఉంది.
Champai Soren: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ జార్ఖండ్ ముక్తీ మోర్చా(జేఎంఎం) పార్టీకి రాజీనామా చేశారు. తాను పార్టీ మారబోతున్నట్లు ప్రకటించిన ఆయన ఈ రోజు రాజీనామా చేశారు.
Mehbooba Mufti: జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. వచ్చే నెల ఆఖరులో మూడు విడతల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరగబోయే తొలి ఎన్నికలు ఇవే. ఇదిలా ఉంటే, కాశ్మీరీ కీలక నేత, మాజీ సీఎం, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ(పీడీపీ) అధినేత మెహబూబా ముఫ్తీ తాను ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ముఖ్యమంత్రి అయినప్పటికీ పార్టీ ఎజెండాను అమలు చేయడం సాధ్యం కాదని అన్నారు. ఆమెకు బదులుగా తన కుమార్తె ఇల్తిజా…
Mamata Banerjee: కోల్‌కతాలో 31 ఏళ్ల వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సర్కార్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర
INS Arighat: అణుశక్తితో నడిచే భారతదేశ రెండో జలంతర్గామి రేపు ప్రారంభించబడనుంది. ఐఎన్ఎస్ అరిఘాత్ అణుశక్తితో నడిచే రెండో బాలిస్టిక్ క్షిపణి జలంతర్గామి. అరిఘాట్ని రేపు విశాఖపట్నంలో ప్రారంభించే అవకాశం ఉంది. రక్షణ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రారంభోత్సవానికి కావాల్సిన సన్నాహాలు చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది.
Bangladesh: రిజర్వేషన్ కోటా రిజర్వేషన్ల రద్దు కోసం బంగ్లాదేశ్ అట్టుడికిన విషయం తెలిసిందే. ఈ ఉద్యమం చివరకు షేక్ హసీనా ప్రధాని పదవికి ఎసరు పెట్టింది. ఈ ఆందోళనలు తీవ్రమైన హింసాత్మక చర్యలకు దారి తీయడంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఆగస్టు 5న ఇండియా పారిపోయి వచ్చేసింది.
డాక్టర్ ఘోష్ తన చర్యల ద్వారా వృత్తికి చెడ్డపేరు తెచ్చారని మరియు క్రమశిక్షణా కమిటీ అతన్ని జాతీయ వైద్య సంఘం సభ్యత్వం నుండి "వెంటనే" సస్పెండ్ చేయాలని నిర్ణయించిందని ఐఎంఏ ప్రకటనలో పేర్కొంది. ఇదే కాకుండా హత్యాచార పరిస్థితిని ఎదుర్కొనే విషయంలో మీరు బాధితురాలి తల్లిదండ్రులకు మనోవేదనను పెంచారు, అలాగే సమస్యనున సముచితంగా నిర్వహించడంలో సానుభూతి, సున్నితత్వం లేదని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.