Kolkata doctor case: మూడుసార్లు వైద్యురాలి పేరెంట్స్‌కి ఫోన్.. ఒక్కసారి నిజం చెప్పలేదు..
- కోల్‌కతా వైద్యురాలి ఘటనలో సంచలన విషయాలు..
- ఘటన తర్వాత తల్లిదండ్రులకు మూడు సార్లు ఆస్పత్రి నుంచి ఫోన్..
- ప్రతీసారి ఆత్మహత్య అంటూ అబద్ధాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata doctor case: కోల్‌కతా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. నైట్ డ్యూటీలో ఉన్న 31 ఏళ్ల ట్రైనీ వైద్యురాలిపై అత్యంత దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది. ఈ ఘటనపై యావత్ దేశంలో డాక్టర్లు, సాధారణ ప్రజలు ఆందోళనలు, నిరసనలు తెలియజేశారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో పోలీసులు, మమతా బెనర్జీ సర్కార్ విఫలమైందని కలకత్తా హైకోర్టు కేసుని సీబీఐకి అప్పగించింది. నిందితుడు సంజయ్ రాయ్ తన నేరాన్ని సీబీఐ ముందు ఒప్పుకున్నాడు.
అయితే, ఈ ఘటనలో ఆర్ జీ కర్ ఆస్పత్రి సిబ్బంది వ్యవహరించిన తీరుపై, ఆ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పటికే ఇతడిని సీబీఐ వరసగా మూడు రోజుల పాటు ప్రశ్నించింది. ఘటన జరిగిన తర్వాత వైద్యురాలి తల్లిదండ్రులకు మూడుసార్లు ఆస్పత్రి నుంచి ఫోన్ వెళ్లింది. అయితే, ఏ ఒక్కసారి కూడా వారికి నిజాన్ని చెప్పలేదని తెలిసింది. ప్రతీసారి ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని, పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు తప్పితే ఆమెపై అత్యాచారం జరిగి హత్యకు గురైందనే విషయాన్ని దాచేశారు.
Also Read
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
Read Also: Hurun India List: “ఆసియా బిలియనీర్ల రాజధాని”గా ముంబై.. బెంగళూర్‌ని దాటేసిన హైదరాబాద్..
మొదటికాల్‌లో ఆర్‌జీ కర్ హాస్పిటల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ డాక్టర్ పేరెంట్స్‌కి ఫోన్ చేసి వారిని వెంటనే రావాల్సిందిగా ‘‘మీ కుమార్తె బాగా లేదు, దయచేసి ఆస్పత్రికి రాగలరా..?’’అని అడిగాడు. డాక్టర్ తండ్రి ఏదో తప్పు జరిగిందని గ్రహించి మరిన్ని వివరాలు అడగటంతో దానికి అతను ‘‘ఆమె బాగాలేదు, మేము ఆమెను అడ్మిట్ చేశాం, నువ్వు త్వరగా రాగలావా..?’’ అని అన్నాడు. మరింత సమాచారం అడిగితే ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్లు చెబుతారంటూ ఫోన్ పెట్టేశాడు.
రెండవ కాల్‌లో అదే ఆస్పత్రి నుంచి వచ్చింది. ఆస్పత్రి సిబ్బంది మాట్లాడుతూ..‘‘ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉంది. దయచేసి వీలైనంత త్వరగా రండి’’ అని కోరారు. ఈ కాల్‌లో కూడా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితిని వైద్యులు వివరిస్తారని చెప్పారు.
మూడో కాల్‌లో సిబ్బంది చాలా ఆందోళనతో ఫోన్ చేసి.. ‘‘ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చు. ఆమె మరణించి ఉండొచ్చు. పోలీసులు ఇక్కడే ఉన్నారు. అందరి ముందే ఈ కాల్ చేస్తున్నాం’’ అని వైద్యురాలి తల్లిదండ్రులకు చెప్పారు. ఈ ఘటన తర్వాత ఆస్పత్రికి వచ్చిన తల్లిదండ్రుల్ని మూడు గంటల పాటు బయటే ఉండేలా చేయడం, ఆ తర్వాతే బాధితురాలి మృతదేహాన్ని చూపించడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ దారుణమైన సంఘటనని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందని తల్లిదండ్రులు ఆరోపించారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..