Kolkata doctor case: కోల్‌కతా డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో సీబీఐ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆర్ జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సెమినార్ హాలులో 31 ఏళ్ల ట్రైనీ వైద్యురాలి మృతదేహం కనుగొన్న తర్వాత, ఘటన గురించి స్థానిక పోలీసులకు తెలియజేయడంలో జాప్యం చేసినట్లు సీబీఐ కనుగొంది.
Chirag Paswan: కేంద్రమంత్రి, లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్ బీజేపీతో విభేదాలను తోసిపుచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ నుంచి తనకు విడదీయరాని బంధం ఉందని, తనను విడదీయలేరని అన్నారు. బీజేపీ కోరుకుంటే రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే భాగస్వామిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
Airbus Beluga: ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఎయిర్ బస్ బెలూగాగా పిలిచి ఈ తిమింగలం ఆకారంలో ఉండే ఈ విమానం ఇప్పటి వరకు 2 సార్లు హైదరాబాద్‌కి రాగా, ఇది మూడోసారి. శుక్రవారం తెల్లవారుజామున 12.17 గంటలకు శంషాబాద్‌లో విమానం దిగింది. అంతకుముందు డిసెంబర్ 2022, ఆగస్టు 2023లో ఈ విమానం ఇక్కడకు వచ్చింది.
Covid Outbreak: భారత్ మరో కోవిడ్ వ్యాప్తికి సిద్ధంగా ఉండాలని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) నిపుణుడు శుక్రవారం హెచ్చరించారు. అమెరికాతో పాటు దక్షిణ కొరియాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరికలు వచ్చాయి. సీడీసీ అంచనాల ప్రకారం.. యూఎస్‌లో దేశంలోని 25 రాష్ట్రాల్లో కోవిడ్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి. దక్షిణ కొరియాలో కూడా గణనీయంగా కేసులు నమోదవుతున్నాయి.
IC 814 hijacking: ఇండియన్ ఎయిర్‌లైన్ ఖాట్మాండూ-ఢిల్లీ IC 814 విమానం హైజాక్‌ని దేశం ఇప్పటికి మరిచిపోలేదు. ఈ ఘటన 7 రోజుల పాటు యావత్ దేశాన్ని తీవ్ర గందరగోళానికి గురిచేసింది. ఉగ్రవాదులు విమానాన్ని హైజాక్ చేసి ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్‌కి తీసుకెళ్లారు. ప్రయాణికుల్ని కాపాడేందుకు అప్పటి అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం భయకరమైన ఉగ్రవాది మసూద్ అజార్‌తో సహా ముగ్గుర ఉగ్రవాదుల్ని విడుదల చేయాల్సి వచ్చింది. ఈ హైజాకింగ్ ఘటన ఆధారంగా నెట్‌ఫ్లిక్స్‌లో ‘IC […]
Plot to kill Wife: ఒక వ్యక్తి తన భార్యను ప్లాన్ ప్రకారం చంపేసి, ఆమె కూతురిని పెళ్లి చేసుకోవాలనుకున్న ఘటన అమెరికాలో జరిగింది. 71 ఏళ్ల అమెరికన్ వ్యక్తి ఈకేసులో నేరాన్ని అంగీకరించడంతో అతనికి నాలుగేళ్ల జైలు శిక్ష, ఐదేళ్ల ప్రొబేషన్ శిక్ష విధించబడింది. బాధితురాలి సవతి కుమార్తె ఇన్వాల్వ్ అయిన ఈ ఘటనలో అనేక సార్లు బాధితురాలు ఆస్పత్రిలో ప్రాణాపాయంతో చేరాల్సి వచ్చింది. చివరకు అసలు నిజం వెలుగులోకి వచ్చింది.
Viral post: ఆఫీస్ నుంచి ఒక నిమిషం ముందు వెళ్లినందుకు ఉద్యోగిని అతని బాస్ మందలించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలు సందర్భాల్లో సదరు ఉద్యోగి ఆఫీస్ పనిగంటల కన్నా ఒక నిమిషం ముందు వెళ్లిపోయాడు. సాయంత్రం 5 గంటలకు బదులు 4.59 గంటలకు ఆఫీస్ నుంచి వెళ్లిన వర్కర్‌కి నోటీసులు అందించారు.
NASA: బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్ క్యాప్సూల్ ద్వారా ఇటీవల సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లారు. అయితే, అనూహ్యంగా స్టార్‌లైనర్‌లో లీకులు ఏర్పడటంతో ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోనే చిక్కుకుపోయారు. ఆమె వచ్చే అవకాశం ఇప్పట్లో కనిపించడం లేదు. ఆమె అంతరిక్షంలోనే మరో ఆరు నెలల పాటు ఉంటుందని ఇటీవల నాసా ప్రకటించింది.
Himanta Biswa Sarma: యూనిఫాం సివిల్ కోడ్ అమలులో భాగంగా అస్సాంలోని హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం కీలక బిల్లుకు గురువారం ఆమోదం తెలిపింది. ముస్లిం వివాహాలు-విడాకులను ప్రభుత్వం దగ్గర తప్పనిసరిగా నమోదు చేయాలనే బిల్లుని తీసుకువచ్చింది. ఈ బిల్లు కాజీ వ్యవస్థను రద్దు చేయడంతో పాటు బహుభార్యత్వం, బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయనుంది. కాంగ్రెస్ వంటి విపక్షాలు ఈ బిల్లుని విమర్శిస్తున్నప్పటికీ ఇది బాలికల అభ్యున్నతికి కీలక బిల్లు అని అస్సాం ప్రభుత్వం చెబుతోంది.
Abortion: ఇంట్లోనే మాత్రలను వినియోగించి అబార్షన్ నిర్వహించడం సురక్షితమని, ఆస్పత్రి భారాన్ని తగ్గించవచ్చని లాన్సెట్ జర్నల్‌లో శుక్రవారం ప్రచురితమైన ఒక అధ్యయనం పేర్కొంది. స్వీడన్‌కి చెందిన పరిశోధకులు 435 మంది మహిళలపై ట్రయల్స్ నిర్వహించాయి. ఇంట్లో లేదా ఆస్పత్రిలో మిసోప్రోస్టోల్ (వైద్య గర్భస్రావ ప్రక్రియలో భాగంగా ఇచ్చిన మాత్ర)లు తీసుకున్న మహిళల్ని వీరు విశ్లేషించారు.