Cancer Vaccine: క్యాన్సర్ వ్యాధి ఇప్పటికీ వైద్యశాస్త్రానికి అంతు చిక్కనిదిగా ఉంది. క్యాన్సర్ వచ్చిన రోగులు తొలి దశల్లో గుర్తిస్తే తప్పా.. అడ్వాన్సుడ్ స్టేజెస్‌లో దానిని పూర్తిగా నివారించలేదని పరిస్థితి ఉంది. అయితే, ప్రస్తుతం క్యాన్సర్ వ్యాక్సిన్‌పై కొనసాగుతున్న పరిశోధనలు భవిష్యత్తుపై ఆశల్ని పెంచుతున్నాయి.
NASA: ఎప్పుడూ లేని విధంగా అంతరిక్షంలో ఉంటూ భూమి చుట్టూ తిరుగుతున్న వ్యోమగాముల సంఖ్య పెరిగింది. ఇది ‘‘మానవత్వానికి కొత్త రికార్డు’’ అని నాసా అభివర్ణించింది.
Prajwal Revanna: జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసులో సిట్ దూకుడు పెంచింది. అతడిపై మూడో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ ఏడాది పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన వందలాది సె*క్స్ వీడియోలు వెలుగులోకి వచ్చాయి. హసన్ జిల్లాలో ఈ వీడియోలు వైరల్‌గా మారాయి.
Biryani: తమిళనాడులో అధికార డీఎంకే పార్టీ కార్యక్రమానికి హాజరైన ప్రజలు, అక్కడ వడ్డించిన బిర్యానీ తిని అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో బిర్యానీ తినడంతో 100 మందికి పైగా ఫుడ్ పాయిజనింగ్ అయింది. అస్వస్థతకు గురైన వారిలో 40 మంది చిన్నారులతో సహా 100 మంది అస్వస్థతకు గురయ్యారు.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఇద్దరు అక్కడ నుంచే ఓటేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. నిజానికి ఇలా ఓటు హక్కుని వినియోగించే అవకాశం ఉందా..? అంటే ఔననే సమాధానం వస్తుంది. వ్యోమగాములు 1997 నుంచి అంతరిక్షం నంచి ఓటేస్తున్నారు. ది న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. 1997లో టెక్సాస్ శాసనసభకు నాసా ఉద్యోగులు అంతరిక్షం నుంచి ఓటు వేయడానికి అనుమతించే బిల్లుని ఆమోదించారు. అప్పటి నుంచి అంతరిక్షం నుంచి ఓటేసే పద్ధతి ప్రారంభమైంది.
Bride flee: కొనుకున్న కొత్త కోడలు అత్తామామలకు మత్తు మందు కలిపి ఇచ్చి పరారైంది. ఈ ఘటన రాజస్థాన్‌లో జరిగింది. బుండీ జిల్లాలో ఓ నవ వధువుల తన అత్తామామలకు ఆహారంలో మత్తు మందు కలిపి ఇచ్చి, వారు మత్తులోకి జారుకున్న తర్వాత ఇంటి నుంచి పారిపోయిందని పోలీసులు శుక్రవారం తెలిపారు.
Bangladesh: బంగ్లాదేశ్‌లో మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై దాడులు ఆగడం లేదు. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయినప్పటి నుంచి అక్కడ మైనారిటీలు, వారి వ్యాపారాలు, ఆలయాలు, చర్చ్‌ల మీద దాడులు జరగుతూనే ఉన్నాయి. 15 రోజుల్లో దేశంలోని 49 జిల్లాల్లో 1000కి పైగా దాడులు జరిగాయి. ఆగస్టు 5 నుంచి ఆగస్టు 20 వరకు మైనారిటీలపై మొత్తం 1068 దాడులు జరిగాయిని ఆ దేశంలోని ప్రముఖ వార్తాపత్రిక ప్రోథోమ్ అలో తెలిపింది.
Israel: లెబనాన్ మిలిటెంట్ సంస్థ, ఇరాన్ ప్రాక్సీగా చెప్పబడుతున్న హిజ్బుల్లా మరోసారి ఇజ్రాయిల్‌పై రాకెట్లతో విరుచుకుపడింది. శనివారం ఉదయం ఇజ్రాయిల్ నగరమైన సఫేద్, దాని పరిసర ప్రాంతాలపై 55 రాకెట్లను ప్రయోగించిందని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) వెల్లడించింది. లెబనాన్ నుంచి రెండు దఫాలుగా దాడి జరిగిందని, మొదటిసారి సుమారు 20 రాకెట్లు, రెండోసారి 35 రాకెట్లు ప్రయోగించబడినట్లు ఇజ్రాయిల్ సైన్యం పేర్కొంది.
Mamata Banerjee: కోల్‌కతా వైద్యురాలి ఘటన పశ్చిమ బెంగాల్ సర్కార్, సీఎం మమతా బెనర్జీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆర్ జీ కర్ మెడికల్ కాలేజ్‌లో 31 ఏళ్ల ట్రైనీ పీజీ వైద్యురాలిపై అత్యంత దారుణంగా అత్యాచారం, హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన యావత్ దేశంలో నిరసనలకు కారణమైంది. బెంగాల్లో ఇప్పటికీ బాధితురాలికి న్యాయం జరగాలని డాక్టర్లు నిరసన తెలుపుతూనే ఉన్నారు. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశానికి డాక్టర్లు ఎవరూ హాజరుకాలేదు.
Deepjyoti: ప్రధాని నరేంద్రమోడీ నివాసంలోకి కొత్త సభ్యుడు చేరారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధానినే ఎక్స్ వేదికగా చెప్పారు. ఇంతకీ ఆ కొత్త సభ్యుడు ఎవరో కాదు ‘‘దీప్ జ్యోతి’’ అనే దూడ. ప్రధాని నివాసం 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని గోమాత ఒక దూడకు జన్మనిచ్చినట్లు ప్రధాని పోస్ట్ చేశారు. తన నివాసంలో చిన్న దూడతో గడిపిన వీడియోని పంచుకున్నారు.