Deepjyoti: ప్రధాని నరేంద్రమోడీ నివాసంలోకి కొత్త సభ్యుడు చేరారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధానినే ఎక్స్ వేదికగా చెప్పారు. ఇంతకీ ఆ కొత్త సభ్యుడు ఎవరో కాదు ‘‘దీప్ జ్యోతి’’ అనే దూడ. ప్రధాని నివాసం 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని గోమాత ఒక దూడకు జన్మనిచ్చినట్లు ప్రధాని పోస్ట్ చేశారు. తన నివాసంలో చిన్న దూడతో గడిపిన వీడియోని పంచుకున్నారు.
Read Also: Gyanvapi Mosque: “జ్ఞానవాపి మసీదు నిజానికి శివాలయమే”.. యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు..
‘‘ గావ్ సర్వసుఖ ప్రదా: అని మన గ్రంథాల్లో చెప్పబడింది. కొత్త సభ్యుడు లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాన మంత్రి నివాస ప్రాంగణానికి శుభప్రదంగా వచ్చారు. ప్రియమైన తల్లి ఆవు కొత్త దూడకు జన్మనిచ్చింది, దాని నుదుటిపై కాంతి గుర్తు ఉంది. అందుకే దీనికి ‘‘దీప్‌జ్యోతి’’ అని పేరు పెట్టాను’’ అని మోడీ హిందీలో ట్వీట్ చేశారు. ‘‘ లోక్ కళ్యాణ్ మార్గ్‌లోకి కొత్త సభ్యుడు! దీప్జ్యోతి నిజంగా ఆరాధ్యదైవం’’ అని మరో పోస్టులో పేర్కొన్నారు. ప్రధాని లేగదూడతో గడిపిన ఫోటోలను కూడా పంచుకున్నారు.
A new member at 7, Lok Kalyan Marg!
Deepjyoti is truly adorable. pic.twitter.com/vBqPYCbbw4
— Narendra Modi (@narendramodi) September 14, 2024