Al Jazeera: కెమెరాలు తీసుకుని వెళ్లిపోండి.. ‘‘అల్ జజీరా’’కి ఇజ్రాయిల్ షాక్..
- అల్ జజీరాకు ఇజ్రాయిల్ షాక్..
- కెమెరాలు తీసుకుని వెంటనే వెళ్లిపోవాలని ఆదేశం..
- ఇది మానవ హక్కుల్ని ఉల్లంఘించడమే అన్న మీడియా సంస్థ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Al Jazeera: ఖతార్‌కి చెందిన ప్రముక మీడియా సంస్థ ‘‘అల్ జజీరా’’కి ఇజ్రాయిల్ షాక్ ఇచ్చింది. వెస్ట్ బ్యాంక్‌లోని రమల్లాలో అల్ జజీరా కార్యాలయానికి వెళ్లిన ఇజ్రాయిల్ ఆర్మీ వెంటనే వారిని ఖాళీ చేయాలని ఆదేశించింది. భారీగా ఆయుధాలు, ముసుగులు ధరించిన ఇజ్రాయిల్ సైనికులు ఆదివారం తెల్లవారుజామున మీడియా ఆఫీస్ ఉన్న భవనంలోకి వెళ్లారు. అనంతరం వెస్ట్ బ్యాంక్ బ్యూరో చీఫ్ వాలిద్ అల్ ఒమారీకి నోటీసులు అందించారు. 45 రోజుల పాటు అల్ జజీరా కార్యాలయాన్ని మూసివేయాలనే ఆర్డర్ జారీ చేసినట్లు తెలుస్తోంది.
Read Also: Golden Temple: ఆలయం కాంప్లెక్స్‌లో కాల్పుల కలకలం.. యువకుడు ఆత్మహత్య
Also Read
- Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
- Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
- Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
- India-Turkey: ‘తత్వం బోధపడినట్లుంది’.. భారత్‌పై ఆధారపడుతున్న టర్కీ.. కారణమేంటో తెలిస్తే..!
అల్ జజీరాని 45 రోజుల పాటు మూసివేయడానికి కోర్టు తీర్పు ఉందని ఇజ్రాయిల్ సైనికులు పేర్కొన్నారు. ఈ క్షణమే అన్ని కెమెరాలు తీసుకుని ఆఫీసు నుంచి బయలుదేరాలని ఇజ్రాయిల్ ఆర్మీ వార్నింగ్ ఇచ్చింది. ఈ ఏడాది మే నెలలో జెరూసలేంలో అజ్ జజీరా కార్యాలయంగా ఉపయోగించుకుంటున్న ఓ హోటల్‌పై ఇజ్రాయిల్ అధికారులు దాడులు చేశారు.
అయితే, ఈ దాడుల్ని అల్ జజీరా ఖండించింది. ఇది మానవహక్కులు, సమాచార హక్కుని ఉల్లంఘించే చర్యగా పేర్కొంది. గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయిల్ చర్యల్ని దాచిపెట్టే ప్రయత్నంగా అభివర్ణించింది. ఇజ్రాయిల్ చర్య అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలకు విరుద్ధంగా ఉందని చెప్పింది. గత నెలలో గాజాలో వైమానిక దాడిలో అల్ జజీరా జర్నలిస్ట్ ఇస్మాయిల్ అల్ ఘౌల్‌ని ఇజ్రాయిల్ చంపేసింది. అక్టోబర్ 07 దాడిలో ఇతను హమాస్ కార్యకర్తగా పాల్గొన్నట్లు చెప్పింది. అక్టోబరు 7 దాడిలో పాల్గొన్న అల్-ఘౌల్ ఎలైట్ నుఖ్బా యూనిట్‌లో సభ్యుడు , ఇజ్రాయిల్‌పై దాడుల్ని ఎలా రికార్డ్ చేయాలో హమాస్ కార్యకర్తలకు సూచించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!