Tirupati Laddoo Row: తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్..
- సుప్రీంకోర్టుకి చేరిన తిరుపతి లడ్డూ వివాదం..
- సిట్‌తో దర్యాప్తు చేసేలా ఆదేశించాలని పిల్..
- హిందువుల మనోభావాలను దెబ్బతీశారని పేర్కొన్న పిటిషనర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirupati Laddoo Row: తిరుపతి లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. లడ్డూలో జంతువుల కొవ్వు వినియోగిస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఒక్కసారి హిందువులు, భక్తుల్లో ఆందోళన మొదలైంది. ఈ వివాదం పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఏపీలో అధికార, విపక్షాల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే, ఈ ఘటనపై ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ నివేదిక కోరింది. కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ నిందితులను కఠినంగా శిక్షించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిండ్ కూడా దీనిపై స్పందించారు. చర్యలు తీసుకోవాలని కోరారు.
Read Also: UP Crime: 7 ఏళ్ల బాలికపై ఇద్దరు మైనర్ బాలురు అత్యాచారం..
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
ఇదిలా ఉంటే, ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. తిరుపతి లడ్డూల్లో జంతువుల కొవ్వు వినియోగిస్తున్నారనే ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. భక్తులకు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వుతో తయారుచేసిన లడ్డూ ప్రసాదాన్ని అందించారని హిందూ సేన అధ్యక్షుడు సుర్జిత్ సింగ్ యాదవ్ పిటిషన్ దాఖలు చేశారు. హిందూ మతాన్ని అపహాస్యం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని పేర్కొన్నాడు.
శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో “లడ్డూ ప్రసాదం” తయారీలో జంతువుల కొవ్వును ఉపయోగించారనే ఆరోపణ హిందూ సమాజం యొక్క మనస్సాక్షిని కదిలించిందని,భ్యుల మతపరమైన భావాలు, మనోభావాలను ఆగ్రహానికి గురి చేసిందని పిటిషన్ పేర్కొంది. ఈ కేసు ప్రజల ప్రయోజనాలతో ముడిపడి ఉందని పిటిషనర్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!