Hassan Nasrallah: ఇజ్రాయిల్ హిజ్బుల్లాపై విరుచుకుపడుతోంది. శుక్రవారం లెబనాన్‌లోని బీరూట్‌తో సహా ఇతర ప్రాంతాల్లో హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయిల్ వైమానిక దాడి చేసింది. ఈ దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణించినట్లు ఇజ్రాయిల్ ఆర్మీ ప్రకటించింది. ఇకపై ఉగ్రవాదంతో నస్రల్లా ప్రపంచాన్ని భయపెట్టలేడని ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇదిలా ఉంటే, పాకిస్తాన్ మూవీ ఇండస్ట్రీలో బహుబలిగా చెప్పబడుతున్న ‘‘ది లెజెండ్ ఆఫ్ హౌలా జాట్’’ సినిమా భారతదేశంలో విడుదల చేసేందుకు అనుమతి రాలేదు. 2019 నుంచి పాకిస్తాన్లో భారతీయ సినిమాల విడుదలపై ఆ దేశం నిషేధం విధించింది. ఈ నేపథ్యంలోనే ఇండియాలో కూడా ఈ సినిమా విడుదలకు కేంద్రం అనుమతి ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఈ చిత్రం పంజాబ్ లో మాత్రమే అందుబాటులో ఉంటుందని గతంలో కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.
Rahul Gandhi: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమం ‘‘నాచ్ గానా( సాంగ్స్-డ్యాన్స్)’’ కార్యక్రమం అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
Hassan Nasrallah: హిజ్బుల్లాను చావు దెబ్బ తీసింది ఇజ్రాయిల్. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా బీరూట్‌పై జరిగిన వైమానికి దాడుల్లో మరణించినట్లు ఇజ్రాయిల్ మిలిటరీ ఈ రోజు తెలిపింది.
ISI: పాకిస్తాన్ గూఢచార ఎజెన్సీ ‘‘ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)’’ కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మాలిక్ నియమితులైనట్లు పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది. సెప్టెంబర్ 30న మాలిక్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. పాకిస్తాన్లో ప్రభుత్వం కన్నా అత్యంత శక్తివంతమైన విభాగం ఆ దేశ సైన్యం. సైన్యాధ్యక్షుడి తర్వాత అంతటి శక్తివంతమైన వ్యక్తిగా ఐఎస్ఐ చీఫ్‌ని భావిస్తారు. ఈయన పాకిస్తాన్లో నెంబర్ 2గా ఉంటారు.
Amit Shah: జమ్మూ కాశ్మీర్ నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. ఉగ్రవాదులతో శాంతికి సిద్ధమే అని ప్రకటించారు. ఆయుధాలు వదులుకుని, ప్రభుత్వంతో చర్చలకు ముందుకు రావాలని లేదా భద్రతా బలగాల చేతిలో చావడానికి సిద్ధంగా ఉండాలని అమిత్ షా గురువారం కోరారు.
MUDA Land Scam: మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) ల్యాండ్ స్కామ్ కన్నడ రాజకీయాల్లో సంచలనంగా మారింది. సీఎం సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతికి ఈ స్కామ్‌లో ప్రమేయం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. మైసూర్ నగరాభివృద్ధికి పార్వతి నుంచి సేకరించిన భూమి విలువ కన్నా,
Godhra Train Burning Case: 2002 గోద్రా రైలు దహనం కేసులో గుజరాత్ ప్రభుత్వంతో పాటు పలువురు దోషులు దాఖలు చేసిన అప్పీళ్లను జనవరి 15న విచారిస్తామని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. తదుపరి విచారణ తేదీకి ఎలాంటి వాయిదాలు వేయబోమని న్యాయమూర్తులు జేకే మహేశ్వరి, రాజేష్ జిందాల్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
బీజేపీ, ఎన్సీపీ(అజిత్ పవార్), శివసేన(ఏక్నాథ్ షిండే) అధికార కూటమి మొత్తం మహారాష్ట్రలోని 48 లోక్సభస స్థానాల్లో కేవలం 17 స్థానాలను మాత్రమే గెలుచుకుంటి. 2019లో సొంతగా 23 ఎంపీ స్థానాలను సాధించిన బీజేపీ ఈ సారి 9 స్థానాలకే పరిమితమైంది.
Rachana Banerjee: ఒకప్పటి తెలుగు హీరోయిన్, ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీగా ఉన్న రచన బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ట్రోలింగ్కి గురవుతున్నాయి. బెంగాల్లో వరద ప్రాంతాలను సందర్శించి ఎంపీ ‘‘క్వింటాళ్ల నీరు’’ అని కామెంట్స్ చేయడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్, మీమ్స్‌కి దారి తీసింది. హుగ్లీ ఎంపీగా ఉన్న ఆమె మంగళవారం జిల్లాలోని వరద ప్రాంతాలను సందర్శించారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ.. ‘‘క్వింటాళ్ల, క్వింటాళ్ల కొద్దీ నీరు వచ్చింది, ప్రజలకు ఇళ్లు లేవు. వారు వీధిన […]