Salman Khan: ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్ హత్య కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ హత్యను తామే చేశామని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. సల్మాన్ ఖాన్‌తో స్నేహం కారణంగానే ఇతడిని చంపేసినట్లు సోషల్ మీడియా పోస్టులో ప్రకటించారు. ఈ నేపథ్యంలో బాంద్రాలోని సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్మెంట్ వద్ద భద్రతను పెంచారు. ఈ ప్రాంతం చుట్టూ భారీ పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. దాదాపుగా 60 మంది పోలీసులు అనుమానాస్పద కార్యకలాపాలను పర్యవేక్షించడానికి 24/7…
Karnataka High Court: మసీదు లోపల ‘‘జై శ్రీరాం’’ అంటూ నినాదాలు చేయడం మతపరమైన భావాలను దెబ్బతీయదని కర్ణాటక హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మసీదులోపలన జైశ్రీరాం అని అరవడం ఏ తరగతి మనోభావాలను , మత భావాలను ఉల్లంఘించలేదు అని పేర్కొంది. మసీదులో నినాదాలు చేసిన ఇద్దరు వ్యక్తులపై మత విశ్వాసాలను అవమానపరిచారని నమోదైన క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ని కోర్టు రద్దు చేసింది.
Hoax bomb threats: నకిలీ బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. మంగళవారం పలు విమానాలకు ఆన్లైన్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీ నుంచి చికాగో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంతో పాటు నాలుగు డొమెస్టిక్ విమానాలకు కూడా ఇదే తరహా బెదిరింపులను ఎదుర్కొన్నాయి. జైపూర్-బెంగళూరు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, దమ్మం-లక్నో ఇండిగో, దర్భంగా-ముంబై స్పైస్‌జెట్, సిలిగురి-బెంగళూరు ఆకాస ఎయిర్ విమానాలకు బాంబు వచ్చాయి.
Bishnoi community: ఎన్సీపీ నేత, మాజీ మహారాష్ట్ర మంత్రి బాబా సిద్ధిఖి హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సల్మాన్ ఖాన్‌కి అత్యంత ఆప్తుడు, మిత్రుడిగా ఉన్న సిద్ధిఖీని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కాల్చిచంపినట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే, గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అసలు సల్మాన్ ఖాన్‌కి ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు..?
India-Canada: భారత్ కెనడాల మధ్య మరోసారి దౌత్యయుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. ఖలిస్తానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారతీయ అగ్రశ్రేణి దౌత్యవేత్త సంజయ్ కుమార్ వర్మతో పాటు పలువురికి సంబంధం ఉందని కెనడా ఆరోపించింది. ఈ ఆరోపణలపై భారత్ తీవ్రంగా ఫైర్ అయింది. కెనడాలో తమ భారతీయ హైకమిషనర్‌తో సహా ఆరుగురిని విత్ డ్రా చేసుకుంటున్నట్లు ప్రకటించింది. మరోవైపు ఇండియాలో కెనడాకు చెందిన ఆరుగురు దౌత్యవేత్తలు శనివారం లోగా భారత్ వదిలి వెళ్లాలని ఆదేశించింది. ఈ పరిణామాలతో […]
Air India: ఆన్లైన్లో బెదిరింపులు రావడంతో న్యూఢిల్లీ నుంచి చికాగో వెళ్తున్న ఎయిర్ ఇండియా డైరెక్ట్ ఫ్లైట్‌ని కెనడాలోని ఇకల్యూబ్ ఎయిర్‌పోర్టుకి మళ్లించారు.
S Jaishankar: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) యొక్క కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (CHG) 23వ సమావేశం కోసం భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్తాన్ చేరుకున్నారు. ఇస్లామాబాద్‌లో ల్యాండ్ అయిన జైశంకర్‌కి అక్కడి అధికారులు ఆహ్వానం పలికారు. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. కాశ్మీర్, సీమాంతర ఉగ్రవాదం వంటి సమస్యలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దాదాపుగా 9 ఏళ్ల తర్వాత భారత్ నుంచి ఓ విదేశాంగ మంత్రి పాకిస్తాన్ వెళ్లడం ఇదే తొలిసారి.
India-Canada Conflict: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పాపులారిటీ అక్కడ రోజురోజుకు పడిపోతోంది. మరోవైపు ప్రభుత్వంపై కొందరు ఎంపీలు అసమ్మతి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటిన్నింటి పక్కకు తప్పించి, మరోసారి సిక్కులు, సిక్కు ఎంపీల మద్దతు పొందేందుకు ఖలిస్తానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యని ముందుకు తీసుకువచ్చారు. ఈ కేసులో కెనడాలోని భారత అగ్రశ్రేణి దౌత్యవేత్తల ప్రమేయం ఉన్నట్లు ఆరోపించడంతో ఒక్కసారిగా ఇరు దేశాల మధ్య దౌత్యయుద్ధం మొదలైంది. భారత్ ఇప్పటికే […]
CM Yogi: ఇటీవల కాలంలో ఆహారంలో ఉమ్మివేయడం, జ్యూస్‌లో మూత్రం కలపడం వంటి ఘటనలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కస్టమర్లని ఇలాంటి ఘటనలతో మోసం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, వీటిపై యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో యూపీ గవర్నమెంట్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది.
Europa Clipper Probe: సౌరకుటుంబంలో గ్రహాలకు పెద్దన్న బృహస్పతి(గురుడి) వద్దకు నాసాకు చెందిన ‘‘యూరోపా క్లిప్పర్ ప్రోబ్’’ ప్రయాణం మొదలైంది. సోమవారం ఫ్లోరిడా నుంచి అంతరిక్ష నౌక బయలుదేరింది. 2.9 బిలియన్ కిలోమీటర్ల దూరంలోని గురుడిని చేరుకోవడానికి అంతరిక్ష నౌక ఏకంగా 5.5 ఏళ్ల పాటు ప్రయాణించనుంది. 2030 నాటికి జూపిటర్ కక్ష్యలోకి చేరుకుంది. నిజానికి ఈ ప్రయోగం గత వారం ప్లాన్ చేసినప్పటికీ.. మిల్టన్ హరికేన్ కారణంగా నిలిపేయబడింది.