PM Modi: ప్రధాని నరేంద్రమోడీకి డొమినికా అత్యున్నత పురస్కారం..
- ప్రధాని నరేంద్రమోడీకి డొమినికా అత్యున్నత పురస్కారం..
- ‘‘డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్’’ని ప్రధానం చేసిన కరేబియన్ దేశం..
- కోవిడ్-19 సమయంలో భారత్ ఇచ్చిన మద్దతుకు గుర్తింపుగా అవార్డ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: కోవిడ్-19 మహమ్మారి సమయంలో తమకు చేసిన సహాయానికి కరేబియన్ దేశం డొమినికా ప్రధాని నరేంద్రమోడీకి అత్యున్నత పురస్కరాన్ని ప్రకటించింది. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసినందుకు గుర్తింపుగా కామన్వెల్త్ ఆఫ్ డొమినికా తన అత్యున్నత జాతీయ అవార్డు ‘‘డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్’’ని ప్రధానం చేసింది. నవంబర్ 19 నుండి 21 వరకు గయానాలోని జార్జ్‌టౌన్‌లో జరగనున్న ఇండియా-కారికామ్ సమ్మిట్ సందర్భంగా కామన్‌వెల్త్ అధ్యక్షురాలు సిల్వానీ బర్టన్ ఈ అవార్డును ప్రదానం చేస్తారని డొమినికన్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
Read Also: Team India: టీ20ల్లో భారత్ విజృంభణ.. ఆస్ట్రేలియా రికార్డు సమం
Also Read
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
‘‘ఫిబ్రవరి 2021లో, ప్రధానమంత్రి మోడీ డొమినికాకు 70,000 డోసుల ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 వ్యాక్సిన్‌ను సరఫరా చేసారు – ఇది డొమినికా తన కరేబియన్ పొరుగువారికి మద్దతునిచ్చేందుకు వీలు కల్పించింది” అని ప్రకటన పేర్కొంది. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డొమినికాకు భారత్ చాలా మద్దతు అందిస్తోంది. మోడీ చేసిన ఈ కృషికి ఈ అవార్డును ఇస్తోంది. డొమినికా ప్రాంతానికి ప్రధాని మోడీ సంఘీభావం తెలిపినందుకు ఈ అవార్డుని తమ దేశం థాంక్స్ తెలియజేస్తోందని డొమినికా ప్రధాని రూజ్ వెల్ట్ స్కెరిట్ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ అవార్డు ప్రతిపాదనను అంగీకరిస్తూ, వాతావరణ మార్పు మరియు భౌగోళిక రాజకీయ సంఘర్షణల వంటి సవాళ్లను పరిష్కరించడంలో ప్రపంచ సహకారం యొక్క ప్రాముఖ్యతను ప్రధాని మోదీ హైలైట్ చేశారు మరియు ఈ సమస్యలను పరిష్కరించడంలో డొమినికా మరియు కరేబియన్‌లతో కలిసి పనిచేయడానికి భారతదేశం యొక్క నిబద్ధతను ధృవీకరించారు. భారత్-కారికోమ్ సమ్మిట్‌కి ప్రెసిడెంట్ బర్టన్ , ప్రధాని స్కెరిట్ హాజరవుతారు. ఈ సమావేశంలో భారత్, కరేబియన్ కమ్యూనిటీ(కారికోమ్) సభ్యదేశాల మధ్య సహకారం, ప్రాధాన్యతలు, అవకాశాల గురించి చర్చిస్తారు.
తాజావార్తలు
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..