Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రయాణించే హెలికాప్టర్ టేకాఫ్ ఆలస్యం కావడం వివాదాస్పదంగా మారింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ATC) నుండి క్లియరెన్స్ రాకపోవడంతో హెలికాప్టర్ టేకాఫ్ ఆలస్యం అయింది. జార్ఖండ్‌లోని గొడ్డాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఊహించని విధంగా ఈ ఆలస్యాన్ని ఎదుర్కొన్నారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని, తిరిగి ఢిల్లీకి వచ్చే సమయంలో విమానంలో టెక్నికల్ స్నాగ్ ఏర్పడింది. జార్ఖండ్ డియోఘర్‌లో ఈ ఘటన జరిగింది. సాంకేతిక లోపాన్ని సరిదిద్దే వరకు విమానం అక్కడే ఉంటుంది. దీంతో ప్రధాని ఢిల్లీకి తిరిగి రావడం ఆలస్యం కానుంది.
Anmol: హర్యానాకు చెందిన అన్మోల్ అనే దున్న జీవన శైలి చూస్తే, విలాసం అనే పదానికి చక్కగా సరిపోతుంది. ఈ దున్న ఖరీదు ఏకంగా రూ.23 కోట్లు. ఇది భారతదేశంలో జరిగే వివిధ అగ్రికల్చర్ ఫెయిర్స్లో అలరిస్తోంది. అన్మోల్ అనే దున్న ఏకంగా 1500 కిలోల బరువు ఉంది. దీని పరిమాణం, వంశపారంపర్యత, సంతానోత్పత్తి సామర్థ్యాలకు ప్రసిద్ధి చెందింది.
Bombay High Court: ఏకాభిప్రాయంతో మైనర్ భార్యతో సెక్స్ చేసిన అది అత్యాచారంగానే పరిగణించబడుతుందని బాంబే హైకోర్టు తీర్పు చెప్పింది. అలాంటి చర్యలకు సంబంధించిన చట్టపరమైన రక్షణ చట్టం అంగీకరించదని చెప్పింది. తన భార్యపై అత్యాచారం చేసిన వ్యక్తికి 10 ఏళ్ల శిక్షను సమర్థిస్తూ బాంబే హైకోర్ట్ నాగ్‌పూర్ బెంచ్ వ్యాఖ్యానించింది.
Madras High Court: టీనేజ్ ప్రేమని నేరంగా పరిగణించలేమని పేర్కొంటూ లైంగిక వేధింపులకు పాల్పడిన కేసును ఎదుర్కొంటున్న యువకుడిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ని రద్దు చేస్తూ మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ తీర్పు చెప్పింది. జస్టిన్ ఎన్ ఆనంద్ వెంకటేష్‌తో కూడిన ధర్మాసనం నవంబర్ 4 నాటి ఉత్తర్వుల్లో.. యువకుడు, యువతి మధ్య శారీరక సంబంధం ఇద్దరి మధ్య ఏకాభిప్రాయ సంబంధంలో సహజమైన పరస్పర చర్య అని తీర్పు చెప్పింది. ఐపీసీ సెక్షన్ 354-A(1)(i) ప్రకారం ఇది నేరానికి అర్హమైనంది కాదని పేర్కొంది.
Congress: రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇబ్బడిముబ్బడిగా హామీల వర్షం కురిపించింది. అయితే, ఇప్పుడు ఈ హామీల వల్ల ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు కొత్త పన్నులు విధించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. కర్ణాటక సర్కార్ ప్రతిపాదించిన ‘‘గ్రీన్ సెస్’’ ముసాయిదా రూపొందించకముందే రాజకీయంగా కాంగ్రెస్ ఇబ్బందుల్లో పడింది.
Stephen Miller: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలుపొందారు. అయితే, ఆయన అధికారం చేపట్టిన తర్వాత ‘‘ఇమ్మిగ్రేషన్ పాలసీ’’ ఎలా ఉంటుందని అంతా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అనే ఆందోళన నెలకొంది.
Lawrence Bishnoi: గత నెలలో ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిక్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సిద్ధిక్ తన కుమారుడు జీషన్ సిద్ధిక్ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న క్రమంలో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్స్ కాల్చి చంపారు. ఈ కేసులో మోస్ట్ వాంటెడ్ నిందితుల్లో ఒకరైన శుభమ్ లోంకర్ ఖచ్చితంగా బిష్ణోయ్ గ్యాంగ్ కోసం పనిచేస్తునట్లు పోలీసుల విచారణలో తేలింది.
Tulsi Gabbard: అమెరికా అధ్యక్షుడైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తన క్యాబినెట్ని ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నాడు. వచ్చే ఏడాది జనవరిలో యూఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునే ముందే తన టీమ్‌ని ఖరారు చేసుకుంటున్నాడు. తాజాగా మాజీ డెమొక్రాటిక్ ప్రతినిధి నుంచి ట్రంప్ మద్దతుదారుగా మారిన తులసీ గబ్బార్డ్‌ని తన నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా నియమించారు. ఆమె కింద మొత్తం అమెరికాలోని 18 గూఢచార ఏజెన్సీలు పనిచేస్తాయి.
Delhi Mayor Polls: ఢిల్లీ మేయర్ ఎన్నికల ముందు గందరగోళం నెలకొంది. దళితుడు అయిన కొత్త మేయర్ పూర్తి కాలం పదవీకాలంలో కొనసాగాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎన్నికలను బహిష్కరించింది. ఈ రోజు ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో గలాటా చోటు చేసుకుంది. సాధారణంగా ప్రతీ ఏప్రిల్‌లో నిర్వహించే ఎన్నికలు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), బీజేపీ మధ్య పోరుతో ఆలస్యమైంది. కొత్త మేయర్‌కి మరో 5 నెలల పదవీ కాలం మాత్రమే లభిస్తుంది.