Devendra Fadnavis: ‘‘ అందుకే నా భార్యని టార్గెట్ చేస్తున్నారు ’’.. కాంగ్రెస్ కూటమిపై ఫడ్నవీస్ ఫైర్..
- గెలవలేక నా భార్యని ట్రోల్ చేస్తున్నారు..
- కాంగ్రెస్ కూటమిపై ఫడ్నవీస్ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devendra Fadnavis: నవంబర్ 20న మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ కూటముల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాంగ్రెస్ నాయకుడు కన్హయ్య కుమార్ బుధవారం డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్‌ని ఉద్దేశిస్తూ.. ‘‘ఆమె రీల్స్ చేయడంలో బిజీగా ఉంది’’ అంటూ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై అధికార బీజేపీ మండిపడుతోంది. ఈ వ్యాఖ్యలు మరాఠీ మహిళల్ని అవమానపరచడమే అని బీజేపీ అంటోంది.
Read Also: Amit Shah: అమిత్‌షా హెలికాప్టర్‌ను తనిఖీ చేసిన ఎన్నికల సంఘం అధికారులు (వీడియో)
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
ఇదిలా ఉంటే, దీనిపై దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాము గెలవలేమని తెలిసినందుకే తన రాజకీయ ప్రత్యర్థులు వ్యక్తిగత దాడికి పాల్పడుతున్నారని, నా భార్య అమృతా ఫడ్నవీస్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. “నా భార్యపై చేసిన ట్రోల్‌లను (వ్యాఖ్యలు) నాగరికత కలిగిన వ్యక్తి చూస్తే, వారు ఇబ్బంది పడతారు. మనం రాజకీయాల్లో ఉన్నాము, ఓపికగా ఉండాలి, సత్యాన్ని ఇబ్బంది పెట్టవచ్చు కానీ ఓడించలేరని నేను నా భార్యతో చెప్పాను” అని ఫడ్నవీస్ అన్నారు. ఎదుర్కోవాలంటే నేరుగా ఎదుర్కోండని, నా భార్యపై మీమ్స్ చేయడం ఏంటి..? ఇంతకీ మీరు చేస్తున్న యుద్ధం ఏమిటి..? నేను ఓపికతో ఉన్నాను, వారిని ఓడిస్తాను అని సవాల్ చేశారు.
మహారాష్ట్ర ఎన్నికలు ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ కూటమికి కీలకంగా మారాయి. మహాయుతి (బీజేపీ-అజిత్ పవార్-ఏక్‌నాథ్ షిండే), మహావికాస్ అఘాడీ( కాంగ్రెస్-శరద్ పవార్- ఉద్ధవ్ ఠాక్రే) కూటముల మధ్య తీవ్రపోటీ నెలకొంది. మొత్తం 288 సీట్లకు నవంబర్ 20న ఎన్నికలు జరుగుతుండగా, 23న ఫలితాలు వెల్లడికానున్నాయి.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!