Election Commission: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఓటర్ సంఖ్య గణాంకాలలో లేదా ఓటర్ బాబితా నుంచి ఏకపక్షంగా ఓటర్ల తొలగింపు చేయలేదని ఈసీ చెప్పింది. అక్టోబర్ 19న మహారాష్ట్ర ప్రతిపక్ష ‘‘మహా వికాస్ అఘాడీ’’ పలు అంశాలపై ఎన్నికల కమిషన్‌ని కలిసింది. సాయంత్రం 5 గంటల ఓటింగ్ శాతం, తుది గణాంకాల్లో ఓటింగ్ శాతం మధ్య తేడాల గురించి ఈసీకి ఫిర్యాదు చేసింది.
Read Also: Jagdeep Dhankhar: ‘‘బైపాస్ సర్జరీకి కూరగాయల కత్తిని వాడకూడదు’’.. ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..
ఈసీ ఈ ఆరోపణల్ని తిరస్కరించింది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఫలితాలను, చివరి ఫలితాలుగా పరిగణించడం కేవలం అపోహ మాత్రమే అని పేర్కొంది. చాలా చోట్ల ఓటింగ్ అధికారికంగా సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది, అయితే, అప్పటికే పోలింగ్ బూతులో ఉన్న వారికి ఓటేయడానికి మరింత సమయం అనుమతిస్తారు.
ఓటర్ల జాబితా నుంచి ఏకపక్షంగా ఓటర్లను తొలగించారనే కాంగ్రెస్ ఆరోపణలకు సంబంధించి, ఈ సారి మొత్తం 8,00,391 మంది ఓటర్ల పేర్లు తొలగించినట్లు కమిషన్ తెలిపింది. ఒక్కో నియోజకవర్గంలో సగటున 2,779 మంది పేర్లు ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. మహారాష్ట్రలో 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 50,000 మంది ఓటర్లను చేర్చుకున్నట్లు కాంగ్రెస్ ఫిర్యాదు తప్పుదోవ పట్టించేదిగా ఉందని కమిషన్ పేర్కొంది. అన్ని రాజకీయ పార్టీలతో గౌరవప్రదమైన, సహకార సంబంధానికి కట్టుబడి ఉన్నామని, ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి చాలా కీలకమని ఎన్నికల సంఘం తెలిపింది.