Ismail Haniyeh: హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్‌గా ఉన్న ఇస్మాయిల్ హనీయే ఈ ఏడాది ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో అనూహ్య రీతిలో హత్యకు గురయ్యాడు. ఆయన నివసిస్తున్న హోటల్‌లో భారీ పేలుడుతో మరణించాడు. అయితే, ఈ హత్య చేసింది ఇజ్రాయిల్, దాని గూఢచార సంస్థ మొస్సాద్ అంటూ ఇరాన్, హమాస్, హిజ్బుల్లా ఆరోపించాయి. అయితే, ఇప్పటి వరకు తామే ఈ హత్య చేసినట్లు ఇజ్రాయిల్ ఎక్కడా చెప్పలేదు.
Read Also: YS Jagan: ఏ సమస్య వచ్చినా అండగా ఉంటా.. కడప కార్పొరేటర్లతో వైఎస్ జగన్ భేటీ
ఇదిలా ఉంటే, తాజా ఇస్మాయిల్ హనియే హత్యను తామే చేసినట్లు తొలిసారిగా ఇజ్రాయిల్ అంగీకరించింది. ఇజ్రాయిల్ రక్షణ మంత్రి ఇజ్రాయిల్ కట్జ్ మాట్లాడుతూ.. యెమెన్ తిరుగుబాటుదాడులు ‘‘హౌతీ’’ల మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసినట్లు చెప్పారు. ‘‘మేము హౌతీల వ్యూహాత్మక మౌలిక సదుపాయాలపై దాడులు చేశాము. దాని నాయకుల్ని హతమార్చాం. మేము టెహ్రాన్‌లో, గాజాలతో, లెబనాన్‌లో హనియే, సిన్వార్, నస్రల్లాలకు చేసినట్లు సనా,హెడెయిడాలో చేస్తాం’’ అని హెచ్చరించారు. సిరియాలో బషర్ అల్ అస్సాద్ పాలనను పడగొట్టినట్లు ఇజ్రాయిల్ రక్షణ మంత్రి అంగీకరించారు. హయత్ తహ్రీర్ అల్-షామ్ (HTS) నేతృత్వంలోని ప్రతిపక్ష దళాలు నవంబర్‌లో వాయువ్య ప్రావిన్స్ ఇడ్లిబ్ నుండి బలమైన దాడిని ప్రారంభించాయి. డిసెంబర్ 08న సిరియా రాజధాని డమాస్కస్‌ని చేజిక్కించుకుని అస్సాద్ పాలనను ముగించాయి.
దీనికి ముందు, ఆగస్టులో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ రక్షణలో ఉన్న ఇస్మాయిల్ హనియానేని షార్ట్ రేంజ్ ప్రొజెక్టయిల్ ఉపయోగించి హతమార్చింది. అయితే, ఈ ఆపరేషన్ ఎలా జరిగిందనేది ఇప్పటికీ రహస్యంగానే ఉంది. ఇరాన్ కొత్త ప్రధాని మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణస్వీకారానికి వచ్చిన సమయంలో హనియే హత్య జరిగింది. ఈ హత్య తర్వాత వరసగా హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రత్లా, హనియే మృతితో హమాస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన యాహ్యా సిన్వార్‌లను ఇజ్రాయిల్ హతం చేసింది.